For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తన భర్త తాగితే మన్మథుడిలా మారిపోతాడంట.. ఇతర స్త్రీలతోనూ...’

|

తన భర్త తాగే అలవాటు తక్కువగా ఉన్నప్పటికీ.. పార్టీలు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రం పీకలదాకా తాగుతాడంట. అంతటితో ఆగకుండా మన్మథుడిలా మారిపోతాడంట.

అంతే పార్టీకి వచ్చిన లేదా ఏదైనా అకేషన్ వచ్చిన అమ్మాయిలతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడట. తన భాగస్వామిని మాత్రం అస్సలు పట్టించుకోడట. అసలు తనకు పెళ్లి కాలేదన్నట్టు ప్రవర్తిస్తాడట.

అంతేకాదు చాలా వింతగా ప్రవర్తిస్తాడట. ఎవరైనా అమ్మాయిలు అందంగా కనిపిస్తే చాలు.. వారితో ముచ్చట్లు కలిపేస్తాడట. అయితే తర్వాతి రోజు ఏమీ తెలినట్టు సారీ చెబుతాడట. ఈ సమస్య నుండి తానెలా బయటపడాలని ఓ వివాహిత నిపుణులను సంప్రదించింది. ఇంతకీ తన సమస్యకు సమాధానం దొరికిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి..పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి..

తాగితే మన్మథుడే..

తాగితే మన్మథుడే..

హాయ్ నా పేరు రాజి(పేరు మార్చాం). నాకు పెళ్లై రెండేళ్లు పూర్తవుతోంది. పెళ్లి జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా మా వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. మా ఆయన చాలా తెలివైన వ్యక్తే. తన అవసరం ఉంటే ఏదైనా చేస్తాడు. తనకు నాతో ఏదైనా పని ఉంటే నన్ను ఉదయం నుంచి రాత్రి వరకు బతిమిలాడుతూ ఉంటాడు. తన అవసరం తీరి పోయాక నాతో ఏం పని లేనట్లుగా ప్రవర్తిస్తాడు.

తన ట్రిక్స్ అర్థమయ్యేవి కాదు..

తన ట్రిక్స్ అర్థమయ్యేవి కాదు..

పెళ్లయిన కొత్తలో మా ఆయన ట్రిక్ నాకు అర్థమయ్యేది కాదు. తన అవసరం ఉన్నప్పుడు తను నన్ను పొగుడుతుంటే నేను ఉబ్బిపోయేదాన్ని. తన అవసరం తీరాక మాత్రం నేనేవరో తెలీదన్నట్టు.. ప్రవర్తించేవాడు. దీంతో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. నాకు చాలా గందరగోళంగా అనిపించేది.

తనకు నచ్చినట్టు..

తనకు నచ్చినట్టు..

ఇక రాత్రి వేళ పడకగదిలో తన పని కోసం తనకు నచ్చినట్లుగా నన్ను మార్చుకునేవాడు. నాకు తెలియకుండానే తను అడిగిన ప్రతీది నేను చేసేలా నా మైండ్ మార్చేవాడు. డార్లింగ్ నీకు ఒక విషయం చెప్పాలంటూ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చేవాడు. పని పూర్తికాగానే ముఖం చాటేసేవాడు.

కొత్త సమస్య..

కొత్త సమస్య..

ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో నా భర్త నుండి నాకు కొత్త సమస్య ఎదురైంది. అది నన్ను బాగా ఆందోళనకు గురిచేస్తోంది. తను ఆల్కహాల్ తీసుకుంటే చాలు మన్మథుడిలా మారిపోతున్నాడు. నన్ను కాదని ఇతర అమ్మాయిలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు మద్యం తాగిన తర్వాత వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు గంటల కొద్దీ ముచ్చట్లు కలుపుతున్నాడు.

ఈ కారణం చేతనే కొంత మంది యువకులు వయస్సైనా వివాహం చేసుకోరు!ఈ కారణం చేతనే కొంత మంది యువకులు వయస్సైనా వివాహం చేసుకోరు!

నాకు మూడొస్తే..

నాకు మూడొస్తే..

అదే సమయంలో నాకు మూడొస్తే.. తనతో సంతోషంగా గడపాలని కోరుకుంటే మాత్రం అస్సలు సహకరించడు. పైగా చిరాకు పడుతున్నారు. తనకు ఆఫీస్ పని ఉందని ల్యాప్ ట్యాప్ ముందు పెట్టుకుని కూర్చొంటాడు. కనీసం మాట వరసకైనా మంచిగా మాట్లాడటం లేదు.

క్షమాపణలు చెబుతాడు..

క్షమాపణలు చెబుతాడు..

అయితే తను రాత్రి వేళ అలాంటి పొరపాటు చేశానని ఉదయం ఎవరైనా గుర్తు చేస్తే మాత్రం సింపుల్ గా సారీ చెప్పేస్తాడు. కానీ రాత్రి అయితే మళ్లీ అలాంటి పనులే చేస్తున్నాడు. తన ప్రవర్తన ఇలాగే ఉంటే.. భవిష్యత్తులో నాకు ఇబ్బంది కలుగుతుంది. నా సమస్యకు మంచి పరిష్కారం చూపగలరని ఓ వివాహిత నిపుణులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో తన సమస్యకు పరిష్కారం లభించిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణ ప్రవర్తనే..

సాధారణ ప్రవర్తనే..

చాలా మంది మగవారిలో ఇలాంటి అలవాటు ఉంటుంది. రాత్రి వేళ పీకలదాకా తాగడం.. ఏవేవో తప్పులు చేయడం.. అప్పుడు చేసిన తప్పుకు తర్వాతి రోజు పశ్చాతాపం పడటం చేస్తుంటారు. ఇదంతా సాధారణ ప్రవర్తనే. ఇలాంటి వారిలో శాశ్వత మార్పు రావడం కొంత కష్టమే.

మద్యం తగ్గించండి..

మద్యం తగ్గించండి..

మీ భర్త ఇలా ప్రవర్తించడానికి కారణం ఆల్కహాల్ కాబట్టి. మీ శ్రీవారు పార్టీల్లో లేదా ఇతర సమయాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో మద్యం వీలైనంత తక్కువ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ పార్టీల్లో ఎక్కువగా తాగే ఛాన్స్ వస్తే.. తను అతిగా తాగకుండా చూసుకోండి. ఎందుకంటే తాగిన తర్వాత కొందరు అతిగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా కొత్త అమ్మాయిలు కనిపిస్తే చాలు వారితో పరిచయం పెంచుకోడానికి ప్రయత్నిస్తారు.

హుందాగా ఉండమనండి..

హుందాగా ఉండమనండి..

ఇలాంటి విషయాల గురించి మీరు అదే పనిగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు లేదా ఎవరికైనా పార్టీ ఇచ్చినప్పుడు హుందాగా ఉండమని ముందే చెప్పండి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత విచక్షణ కోల్పోతున్నారని సామరస్యంగా చెప్పండి. అయినా కూడా తనలో ఎలాంటి మార్పు రాకపోతే నిపుణులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.

English summary

My Husband Flirts With Other Women After He Gets Drunk

Here we are talking about the my husband flirts with other women after he gets drunk. Read on
Story first published: Thursday, June 10, 2021, 14:02 [IST]