Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
‘నా భర్త ఆంటీతో.. ఆమె భర్త ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నాడు..’
తన భర్త వివాహిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట.
మన దేశంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంబంధాలపై మోజు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం.. సఖ్యత, నమ్మకం, ఆప్యాయత వంటివి లేకపోవడం కారణంగా ఇలాంటి అనైతిక సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. భార్యకు తెలియకుండా భర్త పక్కచూపులు చూస్తున్నారు.

కొందరు పిల్లల కోసం.. మరికొందరు పిల్లలు పుట్టిన తర్వాత తమ కోరికలను తీర్చుకోవడానికి క్షణికావేశంలో తప్పటడుగులు వేస్తున్నారు. అయితే ఇలాంటి రహస్య సంబంధాలు ఏదో ఒక రోజు బయటపడటంతో కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. తమ వివాహేతర సంబంధాలను సమర్థించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలా చాలా మంది అన్యోన్య దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వివాహిత తన భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకుందట. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తన మాటల్లోనే...

పెళ్లి తర్వాత..
హాయ్ సార్! ‘‘నా పేరు రాజి(పేరు మార్చాం). నాకు పెళ్లి జరిగి సుమారు 10 సంవత్సరాలవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారిద్దరూ స్కూల్ కి వెళ్తున్నారు. మా ఆయన కూడా పెళ్లైన కొత్తలో నాతో బాగానే ఉండేవారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నా నుండి దూరంగా ఉంటున్నాడు. ఎందుకు ఇలా జరగుతుందనే ఆరా తీస్తే..ఇటీవలే తనకు ఇంకో అమ్మాయితో అఫైర్ ఉన్నట్టు తెలిసింది.

అబద్ధాలు చెబుతున్నాడు..
నాకు పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. వారిద్దరూ పదే పదే ఫోన్లు చేసుకోవడం.. వాట్సాప్ లో ఇతర సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసుకుంటూ.. మెసెజ్ లు పంపుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విషయమై ఓ రోజు తనను నిలదీశాను. అప్పుడు తనకు ‘చిన్న సాయం చేస్తున్నా' అని సింపుల్ గా చెప్పి తప్పించుకున్నాడు.

చాలా బాధగా ఉంది..
ఇలా ప్రతిరోజూ నాకు తన విషయంలో అబద్ధం చెబుతూనే ఉన్నాడు. దీంతో నాకు చాలా బాధ కలుగుతోంది. నాతో కాపురం చేస్తూ.. ఇంకొకరని తన పక్కన ఊహించుకోలేకపోతున్నాను. దీంతో తనను తలచుకుంటునే అసహ్యం వేస్తోంది. తనతో విడిపోవాలని అనిపిస్తోంది. కానీ సమాజం, పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు' అని ఓ వివాహిత తన గోడు వెళ్లబోసుకుంది. తన సమస్యకు నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి..
మీరు ఇంతలా బాధపడుతూ కూడా మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండం అభినందనీయం.. అయితే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తన కాల్ హిస్టరీ, మెసెజ్ ల డాటాను సేకరించి.. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీయండి.

పేరేంట్స్ చెప్పండి..
చాలా మంది ఇలాంటి విషయాలు బయటకొస్తే సమాజంలో పరువు పోతుందనో.. పిల్లలు ఇబ్బంది పడతారనో వీటిని భరిస్తూ తమలో తామే కుమిలిపోతుంటారు. అయితే మీ మౌనం వల్ల వారు మరింత రెచ్చిపోయేందుకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయం గురించి ముందుగా మీ పేరేంట్స్ కు చెప్పండి. మీకు కొంత మద్దతు లభిస్తుంది. మీ అత్తింటి వారికి కూడా పరిస్థితి గురించి చెప్పండి. తమ కుమారుడు అలాంటి అబ్బాయి కాదని వారు బుకాయించొచ్చు. అలాంటి సమయంలో మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపండి.

పశ్చాత్తాప పడేలా..
పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలనేవి క్షణికావేశంలో తీసుకునేవే. అవి తాత్కాలికమే. కాబట్టి మీరు తనతో కలిసి ఉంటూ తన తప్పులకు పశ్చాత్తపపడేలా, తను మారిపోయేలా కొన్ని పనులను చేయండి. ఎందుకంటే వివాహేతర సంబంధాలు ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండవు. అంతేకాదు అభద్రతా భావాన్ని కలిగించి, మనలో ఒత్తిడిని పెంచుతాయి. సామాజికంగా, ఆర్థిక పరంగా, కుటుంబ జీవితంలో తీవ్రమైన నష్టాలను చేకూరుస్తాయి.

కౌన్సెలింగ్ ఇప్పించండి..
మీ భర్త పరిస్థితి మరీ శ్రుతి మించితే మీరు మహిళా సంఘాల నాయకులను సంప్రదించండి. వారు మీ భర్తకు, తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. కాబట్టి ఏదేమైనా ధైర్యంగా డెసిషన్ తీసుకోండి. మీ పోరాటాన్ని సొసైటీ కచ్చితంగా అభినందిస్తుందని నిపుణులు తెలియజేశారు.



Click it and Unblock the Notifications