For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..’

|

మనలో పెళ్లయిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే జంటది మాత్రం కొంచెం విచిత్రమైన సమస్యగా ఆ వివాహిత ఫీలవుతోంది.

పెళ్లయిన తొలి రోజు నుండే తనకు సమస్యలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఓపికతో భరించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. తనతో చాలా కష్టమై పోయింది. ప్రతిరోజూ ఏ కారణం లేకుండానే తనను తిడుతూ ఉండేవాడు.

దీంతో తన సహనం కోల్పోయింది. ఈ సందర్భంగా తన సమస్యను ఇలా వివరించారు. ఇంతకీ తన ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరికిందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం...

అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

గొడవలు పెరుగుతూ..

గొడవలు పెరుగుతూ..

‘హాయ్ నా పేరు వాణి(పేరు మార్చాం). నా వయసు 28 సంవత్సరాలు. నాకు పెళ్లయి సుమారు ఐదేళ్లు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. పెళ్లైన కొత్తలో మా ఆయన నాతో బాగానే ఉండేవారు. కానీ రోజులు గడిచేకొద్దీ.. మా ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు పెరుగుతూ పోయాయి.

తగ్గుతాయని భావించాను..

తగ్గుతాయని భావించాను..

పెళ్లయ్యాక అందరికీ వచ్చే ప్రాబ్లమే నాకు వచ్చిందనుకున్నాను. ఎవరో ఒకరు సర్దుకుపోతే..ఏదో ఒక రోజు అన్నీ సమస్యలు సమిసిపోతాయని భావించాను. అయితే మా ఇద్దరి మధ్య, రోజురోజుకు మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చాయి.

అనవసరంగా తిడుతూ..

అనవసరంగా తిడుతూ..

పిల్లలు పుట్టిన తర్వాత, నన్ను తిట్టడంతో పాటు.. నా కుటుంబ సభ్యులను, నా తోబుట్టువులను అనవసరంగా తిడుతూ ఉన్నాడు. ఏ కారణం లేకుండానే అస్తమానం వారిని ఆడి పోసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఎవ్వరికీ ఎలాంటి సాయం చేయడు.

<strong>పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!</strong></p><p>పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!

ఏ పని చేయడు..

ఏ పని చేయడు..

కరోనా కారణంగా, తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లభించింది. అయితే ఇంట్లో ఉన్నప్పటి నుండి ఏ పని చేయడం లేదు. ఆఫీసు వర్క్ గురించి అసలు కేర్ చేయడం లేదు. తన మూడ్ బాగున్నప్పుడు మాత్రమే ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. ఏదైనా కాల్స్ వస్తే, నాతో మాట్లాడిస్తూ తప్పించుకుంటున్నాడు.

పడకగదిలో దూరం..

పడకగదిలో దూరం..

కరోనా లాక్ డౌన్ సడలింపులు వచ్చినా బయటకు వెళ్లడం లేదు. సరదాగా బయట తిరుగుదామన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మా కుటుంబ సభ్యులను కలవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. చివరికి పడకగదిలోనూ ఏడాదికి కేవలం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.

అనుమానంగా ఉంది..

అనుమానంగా ఉంది..

తన మానసిక పరిస్థితి బాగోలేదేమోనని నాకు అనుమానం వేసింది. ఎవరైనా మానసిక నిపుణులను చూపించాలని చాలా ట్రై చేశాను. కానీ తను అందుకు అంగీకరించలేదు. కొన్ని నెలలుగా తనకు కూడా చాలా దూరంగా ఉంటున్నాను.

అలాంటోళ్లు మాత్రమే సెక్స్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!

దూరం పెరిగింది..

దూరం పెరిగింది..

రీసెంట్ గా నా పేరేంట్స్ కు ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. అనరాని మాటలన్నీ అన్నాడు. కోపం తట్టుకోలేక ఒక దెబ్బ కొట్టేశాను. అంతే అప్పటి నుండి మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. కనీసం కన్న బిడ్డల్ని కూడా కలవనివ్వడం లేదు.

లీగల్ నోటీసుల దాకా..

లీగల్ నోటీసుల దాకా..

అంతేకాదు నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో నేను లీగల్ నోటీసులు కూడా పంపాను. దానికి కూడా కనీసం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒంటరిగానే ఉంటున్నాను. నాకో మంచి సలహా ఇవ్వగలరు' అని ఓ వివాహిత నిపుణులను సలహా అడిగింది. అందుకు వారు ఏమి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

ధైర్యంగా ఉండాలి..

ధైర్యంగా ఉండాలి..

ఇలాంటి సమయంలో మీరు న్యాయ సలహా తీసుకోవాలి. ముందుగా ఇలాంటి సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. సింగిల్ గా ఉంటున్నానని బాధపడొద్దు. మీ ఫ్రెండ్స్, పేరేంట్స్ ను కలుస్తూ, మాట్లాడుతూ ఉండండి. ఈ విషయంలో వారి మద్దతు తీసుకోండి.

మార్పు రావొచ్చు..

మార్పు రావొచ్చు..

వీలైతే మీ భర్త కుటుంబసభ్యులతో లేదా పెద్దలతో మాట్లాడి చూడండి. అప్పుడు తనలో మార్పు రావొచ్చు. ఎందుకంటే మీ గొడవల మధ్య మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి.. మీ ఇద్దరికి మానసిక నిపుణుల సలహాలు, సూచనలు అవసరం.

English summary

My Partner Has a Very Different Kind of Nature, He Always Abuses Me

Here we are talking about the my partner has a very different kind of nature, he always abuses me. Read on
Story first published: Saturday, June 19, 2021, 14:21 [IST]