పెళ్లై ఏడాదైనా శారీరకంగా కలవలేదు.. ఈ మధ్యే తన ఫోన్ చూస్తే... నాకు దిమ్మ తిరిగిపోయింది...!

తన భాగస్వామి రెగ్యులర్ ఆ వీడియోలను చూస్తుంటే, అది మాన్పించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత జనరేషన్ వారిలో చాలా మంది పెళ్లి చేసుకున్న వెంటనే శారీరకంగా కలవడం.. చకచకా పిల్లల్ని కనడం వంటివి చేయడం లేదు. పెళ్లిళ్లను ఆలస్యంగానే చేసుకుంటున్నారు. అలాగే పిల్లల్ని కనడం వంటి ముఖ్యమైన విషయాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు.

My Partner secretly watches gay videos, what will i do?

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి కావాల్సినంత సమయం దొరికింది. అందుకే చాలా మంది శారీరకంగా తమ భాగస్వామితో కలవడాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేశారు.

My Partner secretly watches gay videos, what will i do?

అయితే ఇలా సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా తమ భాగస్వాములతో రొమాంటిక్ లైఫ్ ను ఎంతో బాగా ఆస్వాదించారట. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్య పెళ్లి కాకముందే తను కట్టుకోబోయే అమ్మాయిని తల్లి చేశాడు. ఇక బాలీవుడ్ భామ కరీనా కపూర్ కూడా రెండోసారి తల్లి కాబోతోంది. తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క జంట కూడా తమ కుటుంబంలో త్వరలో కొత్త వ్యక్తి రాబోతున్నాడని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఇదిలా ఉండగా గత ఏడాది పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి అయిన కొత్తలో శారీరకంగా కలవకుండా.. కొన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకుందామని.. ఆ తర్వాత ఆ కార్యంలో పాల్గొందామని.. అంతవరకు పిలల్ని కనడం వంటి విషయాలను వాయిదా వేసుకుందామని అనుకున్నారు.

My Partner secretly watches gay videos, what will i do?

అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వారిద్దరికీ కావాల్సినంత సమయం దొరికింది. ఈ సమయంలో తామిద్దరం ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని కలలు గన్న ఓ అమ్మాయికి తీవ్ర నిరాశ ఎదురైంది. తను ఆ కార్యం గురించి తన భర్తను ఎప్పుడు అడిగినా..ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడు భర్త. అయితే ఓ రోజు అనుమానమొచ్చిన భార్య తను ఏమి చేస్తున్నాడని, తన మొబైల్ చూస్తుండగా రహస్యంగా చూసింది. అంతే ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనయ్యింది. ఎందుకంటే, తను రెగ్యులర్ గా ఆ వీడియోలను చూస్తున్నాడు. దీంతో తన భర్త సంసారానికి పనికి రాడేమో అనే అనుమానం వచ్చింది ఆమెకు. ఇలాంటి సమయంలో ఆమె మానసిక నిపుణులను ఆశ్రయించింది. అప్పుడు వారు ఏమి సమాధానం ఇచ్చారో అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంతవరకూ కలవలేదు..

ఇంతవరకూ కలవలేదు..

హాయ్.. నా పేరు సునీత(పేరు మార్చాం). నాకు గత ఏడాది పెళ్లి అయ్యింది. కానీ నేను నా భాగస్వామితో ఆ కార్యంలో అస్సలు పాల్గొనలేదు. నేను చాలా సార్లు దాని కోసం ప్రయత్నం చేసినా.. నేనే చొరవ చూపించినా.. తను మాత్రం ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అయ్యేవాడు. ఈలోపు కరోనా మహమ్మారి వచ్చి లాక్ డౌన్ ప్రారంభమైంది.

తను అవి చూడటం..

తను అవి చూడటం..

లాక్ డౌన్ కారణంగా మా ఇద్దరికీ కావాల్సినంత ఏకాంత సమయం దొరికింది అని సంతోషిస్తున్న నాకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సమయంలో కూడా నేను ఎంతలా తనని ఒప్పించేందుకు ప్రయత్నించినా.. తాను ఎలాగోలా అవాయిడ్ చేస్తూనే వచ్చాడు. అయితే ఇటీవల తను గే సైట్లను చూస్తున్నట్లు నాకు తెలిసింది.

అనుమానంగా ఉంది..

అనుమానంగా ఉంది..

అప్పటినుండి తను సంసారానికి పనికిరాడేమో అనే అనుమానం మొదలైంది. తనని నిలదీసి అడుగుదామనిపించింది కానీ, అలా అడిగితే మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, మా సంబంధంలో చీలికలు వస్తాయేమోననే భయం కూడా వేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. నాకు సరైన సలహా ఇవ్వగలరు.

సమాజంలో అనేక మార్పులు..

సమాజంలో అనేక మార్పులు..

ప్రస్తుతం ఉన్న సమాజంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. సమాజానికి ఇబ్బంది లేకుండా ఉండేంత వరకూ ఎవరి జీవితం వారు వారి ఇష్టప్రకారం గడిపే వీలుంది. కొందరు వ్యక్తులు ఒకరి జీవితాల్ని శాసించకుండా కలిసి సహజీవనం చేసే మార్గంలో ఉన్నారు చాలా మంది. ఇక అసలు విషయానికొస్తే.. పెళ్లి తర్వాత మీరిద్దరూ కలవలేదంటున్నారు కాబట్టి.. కచ్చితంగా ఈ విషయంలో తనకు సమస్యో.. భయమో.. ఇబ్బందో ఇంకా ఏదో ఉందనిపిస్తోంది.

ఓపెన్ గా మాట్లాడుకోవడం..

ఓపెన్ గా మాట్లాడుకోవడం..

అయితే ఇలాంటి విషయాల పట్ల మీరు మీ భర్తను నిలదీయకుండా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అయితే మీరు అతనితో మాట్లాడటానికి ముందే, మీ అనుమానం నిజం అయితే, ఈ వివాహ బంధం నుండి బయటపడి.. మరో పెళ్లి చేసుకోవడానికి తయారుగా ఉండొచ్చు.

మీ జీవితం మీ చేతుల్లోనే..

మీ జీవితం మీ చేతుల్లోనే..

చాలా మంది జీవితాల్లో అనుకోకుండా అనేక విషయాలు జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఇంకా మీ జీవితం మీ చేతిలోనే ఉందన్న ధైర్యం కూడగట్టుకోవడం కూడా చాలా అవసరం. ఈ మొత్తం విషయంలో ఉండే పాజిటివ్ సైడ్ ని కూడా మరచిపోకూడదు.

విడాకులు తీసుకోవడం..

విడాకులు తీసుకోవడం..

ఒకవేళ మీ భర్త జరిగిపోయిన దాన్ని అంగీకరిస్తే, మీరు వీలైనంత త్వరగా విడాకులు తీసుకోవడం మంచిది. అందుకే మీరు మీ వారితో చాలా క్లోజ్ గా మాట్లాడండి. మీరు వారితో కలయికలో పాల్గొనకపోతే తాను తీవ్ర నిరాశ పడుతున్నట్లు చెప్పండి. తనతో కలిసి కుటుంబాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పండి.

Story first published: Thursday, August 27, 2020, 16:41 [IST]
Desktop Bottom Promotion