Latest Updates
-
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం
‘నా భార్యతో తన బాస్ అది చేయించుకుంటున్నాడు.. తనతో ఏకాంతంగా గడిపేందుకు...’
ప్రస్తుత సమాజంలో భార్యభర్తలిద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే బతుకు జట్కా బండి నడవడం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఒక్కరి సంపాదన మీదే ఆధారపడి జీవనం సాగించాలంటే ఇప్పట్లో కష్టమే.

అయితే భార్యభర్తలిద్దరికీ ఒకేచోట జాబ్ దొరకడం అనేది కష్టం. అందుకే వారి చదువులు, అర్హతకు బట్టి ఉద్యోగాలు చేస్తుంటారు. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ, ఎక్కడైతే లేడీ ఎంప్లాయీస్ ఉంటారో.. అలాంటి వారికి బాస్ నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వారిని ఎప్పుడెప్పుడు లొంగదీసుకుందామా అని కొందరు మగాళ్లు గుంటనక్కల్లా ఎదురుచూస్తుంటారు.

అంతేకాదు అవకాశం వచ్చిన ప్రతిసారీ వారిని ఆ కార్యం కోసం బలవంత పెడుతూ ఉంటారు. ఈ విషయాన్ని తమ భర్తకు చెప్పుకోలేక.. వేరే వారితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేక తమలో తామే కుంగిపోతుంటారు. అలా తన భార్య కార్యాలయంలో మేనేజర్ తనకు రోజురోజుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య ఏ మాత్రం నిర్మోహమాటం లేకుండా తన భర్తకు చెప్పేసింది.

దీంతో తను మానసికంగా బాగా కుంగిపోయాడు. తన మాటలు నమ్మి తనకు వార్నింగ్ ఇస్తే, తన భార్య జాబ్ ఎక్కడ తీసేస్తాడోనని భయం వేస్తుందట తనకు. కాబట్టి ఇలాంటి సమయంలో తానేం చేయాలని కోరుతున్నాడు. తనకు నిపుణులు ఏమి సమాధానం ఇచ్చారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తన బాస్ తో..
‘నా పేరు గిరీష్ (పేరు మార్చాం). నా వయసు 28 ఏళ్లు. నా భార్య నా కంటే రెండేళ్లు చిన్నది. తను ఇటీవలే ఓ కంపెనీలో జాబ్ సంపాదించింది. అది కార్పొరేట్ కంపెనీ కాబట్టి తను తరచుగా మీటింగుల కోసం టూర్లు వేస్తుంటుంది.

ఏకాంతంగా గడపాలని..
అలా విదేశాలకు ఓసారి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తన బాస్ తనతో ఏకాంతంగా గడపాలని బలవంతం చేసినట్లు.. ఆ విషయాన్ని నాకు చెప్పేసింది. జాబ్ సెక్యూరిటీ, ప్రమోషన్, శాలరీ కోసం తనకు నేను నో చెప్పలేకపోతున్నానని చెబుతోంది.

తనకు ఇష్టం లేకున్నా..
ఇప్పటికే తను ఆ విషయం గురించి చాలా బలవంతం చేశాడని, నేను ఎన్ని సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. ఏదో ఒక నెపంతో నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించింది. ఇక తనకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా, ఏదో ఒక వీక్ నెస్ పేరిట తనతో గడిపేందుకు ప్రయత్నించేవాడట.

అన్ని విషయాలు..
నా భార్య ఆఫీసులో జరిగే ప్రతి విషయాన్నీ ప్రతిరోజూ నాతో షేర్ చేసుకుంటుంది. తనకు నేనంటే చాలా ప్రేమే. కానీ తనకు వేరే దారి లేకపోవడంతో, ఆ పనికి ఒప్పుకుంటానంటోంది.

జాబ్ పోతుందని..
ఈ విషయం గురించి కంప్లైట్ ఇద్దామంటే.. తన జాబ్ పోతుందేమో అనే భయం నన్ను వెంటాడుతోంది. అయితే నేను ఈ విషయాన్నీ అంత ఈజీగా భరించలేకపోతున్నా. తనతో జాబ్ అయినా మానేయమని లేదా బాస్ తో క్లోజ్ గా ఉండటం అయినా మానేయమని చెప్పమని ఎన్నోసార్లు ఘర్షణ పడ్డాను.

విడాకులు ఇస్తానని..
ఓ రోజు మా ఇద్దరి మధ్య గొడవ ఎక్కువగా పెరిగి, నేను నీకు విడాకులు ఇచ్చేస్తా.. నీ దారి నువ్వు చూసుకో.. నా దారి నేను చూసుకుంటా అని కూడా వార్నింగ్ ఇచ్చాను. అప్పుడేమో తను అలా చేయొద్దని వేడుకుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఏమి చేయాలి' అని ఓ వివాహితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు.

మీ పార్ట్ నర్ సమస్య..
మీరు, మీ భార్య ఎదుర్కొంటున్న సమస్య మాకు అర్థమైంది. అయితే దీనికి అంత సులభంగా సమాధానం దొరకడం కష్టం. అయితే మీకు ముందుగా ఏదీ కావాలనే విషయం మీద చాలా స్పష్టత ఉండాలి.

మీ భార్య పని..
మీ భార్య చేస్తున్న ఆ పని గురించి తెలిసిన తర్వాత మీరు వారిని క్షమించాలనుకుంటున్నారా? లేదా అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ పార్ట్ నర్ ఆ విషయం గురించి ధైర్యంగా చెప్పింది కాబట్టి మీరు తనను క్షమించవచ్చు.

రహస్యంగా..
ఎందుకంటే చాలా మంది ఇలాంటి విషయాలను అస్సలు బయటకు చెప్పరు. చాలా సీక్రెట్ గా ఇలాంటి వ్యవహారాలను గుట్టుగా కానిచ్చేస్తుంటారు. అయితే మీ భార్య మాత్రం మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

భవిష్యత్తు గురించి..
మీ భవిష్యత్తు గురించి.. మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి.. మీరిద్దరూ కూర్చుకుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఈ విషయం గురించి ఆలోచిస్తూ.. మీ మైండ్ ను పాడు చేసుకోకుండా, మీ లైంగిక జీవితానికి దూరం కావొద్దు.



Click it and Unblock the Notifications