For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

chaysam divorce:సమంత-చైతూ నిజంగానే విడిపోయారు... విడాకులు తీసుకునేందుకు గల కారణాలేంటి?

|

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో ఎంతో మంది తారలు తెర ముందే కాదు.. తెర వెనుక కూడా ప్రేమాయణం కొనసాగిస్తారు. అయితే కొందరు పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకుని విడిపోతారు.

మరి కొందరు పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని తమ వివాహా బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి.

నాలుగేళ్లుగా వివాహ జీవితాన్ని ఎలాంటి ఆవాంతరాలు లేకుండా ఆనందంగా గడిపిన అక్కినేని నాగచైతన్య, సమంత తమ పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో రుమార్లు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఆ రూమర్స్ ను నిజం చేస్తూ.. తామిద్దరం విడిపోతున్నట్టు సమంత, నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మూడేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధాన్ని పెళ్లి తర్వాత మరింత చూడముచ్చటగా కనిపించారు.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉండేవారు. పెళ్లి తర్వాత ఏకాంతంగా గడిపేందుకు గోవాలో ఓ ఇల్లు సైతం కొనేశారు. అంతేకాదు హైదరాబాదులోనూ కోట్ల రూపాయల విలువైన ఫ్లాటును కొనుగోలు చేశారు. ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్లు కూడా చేసుకున్నారు. అయితే అంతలోనే ఏం జరిగిందో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని.. వీరి వివాహ బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీరి లవ్, మ్యారేజ్, డైవర్స్ వరకు ఎన్నో ట్విస్టులు.. టర్నులు అవ్వగా.. చివరికి డైవర్స్ తో ఎండ్ అయ్యింది. ఈ సందర్భంగా పెళ్లైన జంటలు తమ బంధానికి ఎందుకని గుడ్ బై చెప్పాలనుకుంటారు... అందుకు గల సాధారణ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మగాళ్లకు మాత్రమే.. ఇలా చేస్తే మహిళలకు అస్సలు నచ్చదట...! వారి మూడ్ ఆఫ్ అయిపోతుందట..

విభేదాలు-విడాకులు..

విభేదాలు-విడాకులు..

ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా.. నాగచైతన్య-సమంత విడాకుల టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రేమ.. పెళ్లి.. విడాకులు అనేవి చాలా కామన్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వారికి నచ్చినన్నటి రోజులు కలిసి ఉంటారు.. నచ్చనిరోజు విడిపోవడం ఇక్కడ సర్వసాధారణం. అయితే సెలబ్రిటీలు విడిపోయేటప్పుడు మాత్రం విభేదాలు, భరణం.. ఇంకా ఇతర పుకార్లు షికారు చేస్తుంటాయి.

అమ్మాయిలే ఎక్కువగా..

అమ్మాయిలే ఎక్కువగా..

అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులోనూ అబ్బాయిలే కంటే అమ్మాయిలే విడాకులు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. విడిపోవడం అనే టాపిక్ తీసుకొచ్చేదే అమ్మాయిలంట. ఇదే విషయం పలు సర్వేలలో కూడా నిరూపితమైంది. ఆస్ట్రేలియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందట.

ఆశించినది దక్కకపోతే..

ఆశించినది దక్కకపోతే..

చాలా మంది భార్యలు తమ భర్త నుండి ఏదైనా ఆశించినది దక్కకపోతే వారు చాలా సమస్యగా ఫీలవుతారట. అక్కడి నుండే అసలు గొడవ ప్రారంభమైతుందట. ఇంటి పని.. ఒంటి పని.. ఆఫీసు పని.. ప్రెగ్నెన్సీ, పిల్లలను చూసుకోవడంతో పాటు ఫ్యామిలీ మెయింటెయినెన్స్ ఇతర సమస్యలన్నీ తమ మీద పడ్డప్పుడు ఇలా విడాకుల గురించి ఆలోచిస్తారట.

రతిక్రీడలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటోందా? అయితే ఇలా ప్రయత్నించండి...

పెళ్లి చేసుకున్నాక..

పెళ్లి చేసుకున్నాక..

చాలా మంది మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత తమ జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని ఫీలింగ్ కలిగినప్పుడు, సొసైటీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు లభించకపోతే.. తరచుగా భాగస్వామితో వాదనలు జరిగినప్పుడు, మానసికంగా ఒత్తిడి పెరిగినప్పుడు, తమకు ప్రశాంతత కరువైనప్పుడూ తమ భర్త నుండి విడిపోవాలని ఆశిస్తారట.

బంధం బలహీనపడితే..

బంధం బలహీనపడితే..

చాలా మంది జంటలు తమ మధ్య బంధం బలంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఆలుమగల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం. కొన్ని సందర్భాల్లో వారి బంధం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అది ఎంతలా అంటే చలనం లేని నీళ్ల మాదిరిగా మారిపోతుంది. దీంతో తామిద్దరం ఇక కలిసి జీవించలేమని భావిస్తారు. వెంటనే విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు.

ఇంకొకరిపై మోజు..

ఇంకొకరిపై మోజు..

మరి కొందరు జంటలు పెళ్లయ్యాక కొన్నాళ్లకు తమ భర్తతో విడిపోవడానికి ప్రధాన కారణం.. వారికి ఇంకొకరిపై మోజు పెరగడం.. ప్రస్తుత భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోవడం కూడా ఓ కారణం కావొచ్చు. తమ భాగస్వామికి తమకు దగ్గరగా లేకపోతే.. అదే సమయంలో ఇతరులపై ఆసక్తి పెరిగితే.. తమ ప్రస్తుత బంధానికి గుడ్ బై చెప్పాలనుకుంటారట.

English summary

Naga Chaitanya- Samanatha Divorce: Common Reasons Why Marriages End in telugu

Here we are talking about the naga chaitanya-samantha divorce: common reasons why marriages end in Telugu. Have a look