For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉమ్మడి కుటుంబంలో ఉంటే రతి క్రీడ కష్టమేనా?

|

ప్రస్తుతం కాలం వేగంగా పరుగెడుతోంది. దీంతో కాలం వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కుటుంబాలనేవి నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. చిన్న కుటుంబాల వ్యవస్థ వేగంగా వ్రుద్ధి చెందింది.

Nuclear Family vs Joint Family: What Is Better For Couples?

అయితే కొన్నిచోట్ల అరుదుగా ఉమ్మడి కుటుంబాలు కూడా ఇప్పటికీ హాయిగా.. ఆనందంగా జీవించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఉమ్మడి కుటుంబంలో అత్తింటి పోరు ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు.

Nuclear Family vs Joint Family: What Is Better For Couples?

అందుకే వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధపడిపోతుంటారు. అంతేకాదు పెళ్లైన కొత్తలో అత్తమామలతో కలిసి జీవించే కొందరు కొత్త జంటలు తమ కంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవడానికి ఇబ్బంది పడే విషయం వాస్తవమే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే లాభనష్టాలు.. వేరు కాపురంలో ఉండే లాభనష్టాల గురించి తెలుసుకుందాం...

పడకగదిలో ఈ వాస్తు చిట్కాలను ఫాలో అయితే.. 'ఆ'కార్యంతో పాటు అన్నింటా విజయాలే...!పడకగదిలో ఈ వాస్తు చిట్కాలను ఫాలో అయితే.. 'ఆ'కార్యంతో పాటు అన్నింటా విజయాలే...!

రాత్రిళ్లు ఏకాంతంగా..

రాత్రిళ్లు ఏకాంతంగా..

ఉమ్మడి కుటుంబంలో ఉండే వారికి రాత్రి వేళల్లో తప్ప.. మిగిలిన సమయంలో భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడిపే వీలుండదు. అంతేకాదు జాయింట్ ఫ్యామిలీలో రాత్రి వేళ ఎవరు ఎప్పుడొచ్చి డోర్ బెల్ కొడతారో తెలీదు. ఇంత ఆలస్యమేంటని అని అడిగితే అలకలు.. చిరాకు పడటం వంటివి జరుగుతుంటాయి.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు మీరిద్దరూ ఎంత స్వేచ్ఛగా ఉన్నా.. ఉమ్మడి కుటుంబంలో మాత్రం అది దాదాపు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పెళ్లి తర్వాత కొన్ని హద్దులు, నియమాలు, పద్ధతులు ఉంటాయి. అత్తమామలతో అనునిత్యం కలిసి ఉండటం వల్ల పగటి పూట రొమాన్స్ చేయడం అస్సలు కుదరదు. ఇక డ్రస్సుల విషయంలోనూ చాలా కండిషన్సే ఉంటాయి.

అవి వేసుకోలేను..

అవి వేసుకోలేను..

చాలా మంది జంటలు పెళ్లి తర్వాత కూడా చీర కట్టుకోవడానికి ఇష్టపడరు. సాధారణ డ్రస్సులు వేసుకోవడానికే ఆసక్తి చూపుతారు. మరికొందరు చక్కటి సెక్సీ డ్రస్సు వేసుకొని కట్టుకున్న వారిని ఇంప్రెస్ చేయాలని.. సడెన్ గా వారిని సర్ ప్రైజ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కట్టుకున్న భర్తతో మంచి రొమాన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ఉమ్మడి కుటుంబంలో ఇవేవీ సాధ్యపడవు.

స్త్రీలు తెలియకుండా చేసే తప్పులతో మగవారికి దూరమవ్వాల్సిందే...!స్త్రీలు తెలియకుండా చేసే తప్పులతో మగవారికి దూరమవ్వాల్సిందే...!

లైంగిక జీవితంపై..

లైంగిక జీవితంపై..

ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు సాధారణంగా లైంగిక జీవితంపై పెను ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రాత్రి పూట ఏ మాత్రం శబ్దం చేయకుండా.. కేవలం ఒక గదిలోనే ఆ కార్యాన్ని కానిచ్చేయాలి. అంతేకాదు మిగిలిన వాళ్లందరూ నిద్రపోయాకే లైంగిక కార్యంలో పాల్గొనాల్సి ఉంటుంది. అంతేకాదు ఆలుమగల బంధాన్ని కేవలం పడకగదికే పరిమితం చేయాల్సి ఉంటుంది.

అనుకోని సంఘటనలు..

అనుకోని సంఘటనలు..

అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారంటే.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నా అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు డోర్ గడియ పెట్టుకోవడం మరిచిపోతుంటారు. అలాంటి సమయాల్లో ఎవరైనా గదిలోకి వస్తే అంతే సంగతులు..

ఇంకొంత మంది..

ఇంకొంత మంది..

అయితే మరికొందరు మాత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండే వారు కొందరు ఆ కార్యాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారట. వారు అత్తమామలతో కలిసి ఉన్నా.. వారికి పెద్దగా ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదట. వారి గదికి అత్తమామల గది దగ్గరగా ఉంటే... వారి రూమ్ లో టివి చూస్తూ కొంచెం సౌండ్ ఎక్కువగా పెట్టి.. పడకగదిలో ఆ పని కానిచ్చేస్తున్నారట. దీంతో వారికి లైంగిక కార్యంలో ఎలాంటి ఇబ్బంది లేదట.

English summary

Nuclear Family vs Joint Family: What Is Better For Couples?

Here we are talking about the nuclear family vs joint family:what is better for couples. Have a look
Story first published:Tuesday, August 10, 2021, 17:27 [IST]
Desktop Bottom Promotion