For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొడుకుతో పెళ్లి కోసం కట్టుకున్న భర్తకు విడాకులిచ్చిన భార్య... విశ్వంలోనే విచిత్రమైన ప్రేమ..

|

కలియుగంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి.. జరుగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా బంధాలు.. అనుబంధాలు.. ప్రేమానురాగాల విషయాలు అనేక మార్పులు కనిపిస్తున్నాయి.

కొందరికి కామంతో కళ్లు మూసుకుపోవడంతో.. వావి వరసలు అనేవే లేకుండా కేవలం శారీరక సుఖం పొందేందుకు అడ్డమైన దారులన్నీ తొక్కుతున్నారు.

అయితే ఇటీవల ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. కట్టుకున్న భర్తను కాదని.. కన్న కొడుకుతో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. అంతేకాదు అందుకోసం స్వయాన తన భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది.

ఇక్కడ విచిత్రమేమిటంటే.. తన మాజీ భర్తకే కోడలిగా మారిపోయింది. అయితే తన కుమారుడిని అధికారికంగా వివాహమాడి అదే ఇంట్లో కోడలిగా మళ్లీ అడుగు పెట్టింది.

వినడానికి ఇది వింతగా అనిపిస్తున్నా... ఇది అందరూ ఔనన్నా.. కాదన్నా... నమ్మలేని నగ్న సత్యం.. అయినప్పటికీ మీకు నమ్మలేకపోతే ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్టులను చూస్తే మీరు కచ్చితంగా నమ్మి తీరుతారు. ఈ ఘనకార్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

పదేళ్ల క్రితమే వివాహం..

పదేళ్ల క్రితమే వివాహం..

రష్యా దేశానికి చెందిన క్రాస్నాదర్ క్రాయికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్ మరీనా బల్మాషేవా పది సంవత్సరాల క్రితం 45 ఏళ్ల వయసున్న ఆర్రేను వివాహం చేసుకుంది.

అప్పటికే తనకు కొడుకు..

అప్పటికే తనకు కొడుకు..

అయితే ఆర్రేకు అప్పటికే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆమె గొప్ప త్యాగం చేసిందని అందరూ అనుకున్నారు. ఎంతో పెద్ద మనసుతో తనను పెళ్లి చేసుకుందని అందరూ భావించారు.

మనస్పర్దలు రావడంతో..

మనస్పర్దలు రావడంతో..

ఆర్రేతో వివాహం అయినప్పటి నుండి తన కొడుకును కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. ఇది చూసి ఆ తండ్రి కూడా తెగ సంతోషించేవాడు. అయితే ఇటీవలే ఆ భార్యభర్తలిద్దరి మధ్య ఏదో విషయంలో కొన్ని మనస్పర్దలు వచ్చాయి. దీంతో మరీనా ఆర్రేకు విడాకులిచ్చింది.

OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...

ఒంటరిగా ఉంటున్న ఆమెతో..

ఒంటరిగా ఉంటున్న ఆమెతో..

అప్పటి నుండి ఒంటరిగా ఉండటం ప్రారంభించింది. అయితే, పదేళ్ల పాటు తన ఆలనా.. పాలనా చూసుకున్న తల్లి తనను వదిలి వెళ్లిపోవడాన్ని ఆ కొడుకు వ్లాడిమిర్ తట్టుకోలేకపోయాడు. తన తండ్రితో విడిపోయినప్పటికీ, వ్లాడిమిర్ తనను మాత్రం నిత్యం టచ్ లోనే ఉండేవాడు.

మనసులో మాటను..

మనసులో మాటను..

అలా ఓ రోజు మరీనా తాము ఇంకా ఎన్ని రోజులనీ చాటుగా కలుసుకోవడం.. అని తనను నమ్మించింది. అదే సమయంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. ఇందుకు వ్లాదిమీర్ కూడా అంగీకరించాడు. అలా వారిద్దరి మధ్య ఉన్న తల్లి కొడుకుల బంధాన్ని, భార్యభర్తల బంధంగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

మాజీ భర్త షాక్..

మాజీ భర్త షాక్..

ఈ వార్త విన్న తన మాజీ భర్తకు గుండె పగిలిపోయినంత పని అయ్యింది. తన మాజీ భార్యనే తన ఇంటికి కోడలిగా వస్తుందని చాలా బాధపడ్డాడు. కానీ కుమారుడి ఇష్టాన్ని కాదనలేక అయిష్టంగానే వారిద్దరి వివాహానికి అంగీకరించాడు.

అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?

అధికారికంగా వివాహం..

2020 సంవత్సరం ఆరంభంలోనే వీరిద్దరూ వివాహం చేసుకుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ కారణంగా వీరి కళ్యాణం వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని నెలలుగా విరహవేదనతో రగిలిపోతున్న వారిద్దరూ ఎట్టకేలకు రిజిస్ట్రర్ ఆఫీసుకు వెళ్లి రింగులు మార్చుకుని, అధికారికంగా పెళ్లి చేసున్నారు.

ఇప్పటినుండి తామొక్కటే..

ఇప్పటినుండి తామొక్కటే..

ఇక నుండి తామిద్దరు పినతల్లి.. కొడుకు కాదని.. భార్యభర్తలమని ప్రకటించారు. పెళ్లి తర్వాత వెడ్డింగ్ డ్రస్సులో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో సైతం పోస్టు చేశారు. వీరి పెళ్లిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

భిన్న స్పందనలు..

భిన్న స్పందనలు..

‘పది సంవత్సరాల పాటు తండ్రితో కాపురం చేసిన నీకు కుమారుడితో కాపురం చేయడానికి మనసు ఎలా వచ్చింది? తన తండ్రితో ప్రేమ లేకుండా పదేళ్ల పాటు కాపురం చేశావా?' అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వీరి ప్రేమకు మద్దతు తెలపడం గమనార్హం. మనసులో ఉన్న ప్రేమను ధైర్యంగా బయటపెట్టి.. అధికారికంగా పెళ్లి చేసుకున్నారని, కొందరు రహస్యంగా.. వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారని, వారితో పోల్చితే, ఇదే బెటర్ అని మెచ్చుకుంటున్నారు.

English summary

OMG : Influencer Marries Her 20-Year-Old Stepson After Splitting From His Dad

Here we talking about influencer marries her 20 year old stepson after splitting from his dad. Read on
Story first published: Saturday, July 18, 2020, 20:05 [IST]