ఆయనకు ఆరోది.. ఆమెకు ఐదోది.. అయితే ఇద్దరికీ 12 రోజుల్లోనే చెడింది.. అంతే ఆ పెళ్లి పెటాకులయ్యింది..

హాలీవుడ్ లో అయితే పెళ్లి విషయమైనా.. ప్రేమ విషయమైనా.. ప్రతి సంవత్సరం ఏదో ఒక వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది.

ప్రస్తుత జనరేషన్ లో ప్రతి సంవత్సరం లేదా ఏ ఆరు మాసాలకో కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తుంటాయి. కొత్త ఫోన్ వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త ఫీచర్లతో వచ్చేసరికి జనాలు వాటి పట్ల ఆకర్షితులు అవుతుంటారు. దీంతో ప్రతి ఆరు నెలలకో.. సంవత్సరానికో ఫోన్లు మారుస్తూ ఉంటారు.

Pamela Anderson and Jon Peters

కానీ పెళ్లి విషయంలో మాత్రం చాలా నిబద్ధతగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే పెళ్లి అంటే ఏడెడు జన్మల బంధంగా భావిస్తారు. అయితే ఇక్కడ పెళ్లికి.. స్మార్ట్ ఫోన్లకు లింకేటి అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లను ఎలా మారుస్తున్నారో తమ భర్తలను, భార్యలను కూడా అలాగే మార్చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఒక పెళ్లి అయి విడిపోయి మరో పెళ్లిని కూడా అంతే ఘనంగా చేసుకునేందుకు ఎవ్వరూ వెనుకాడటం లేదు. అయితే ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఆరు పెళ్లిళ్లు.. ఐదు పెళ్లిళ్లు వంటివి చేసుకోలేదని చెప్పాలి. ఇలాంటివి మనకు హాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించవు. అయితే పెళ్లి చేసుకుని ఒక్కటైతే పర్వాలేదు కానీ.. మళ్లీ విడిపోతున్నారు.

Pamela Anderson and Jon Peters

అలా తాజాగా హాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలలో ఒకరైన ఆయనకు అది ఆరో పెళ్లి.. ఆమెకు ఏమో ఐదో పెళ్లి.. ఇద్దరు ఇటీవలే అందరి సమక్షంగా ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టాలన్నీ కూడా హాయిగా ముగించేశారు. అయితే అంతలోనే ఏమయిందో తెలియదు కాని 12 రోజుల్లోనే విడిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా వారే వెల్లడించారు.

ఫొటోలు మార్చినంత సులభంగా..

ఫొటోలు మార్చినంత సులభంగా..

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి పెళ్లి అంటే ముణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ముఖ్యంగా ఈ కల్చర్ సెలబ్రెటీస్ లో రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫొటోలను చించివేసినంత తేలికగా.. ఫొటోలను మార్చేంత సులభంగా భర్తలు భర్యాల్ని, భార్యలు భర్తల్ని మార్చేస్తున్నారు.

హాలీవుడ్ లో వింతలు..

హాలీవుడ్ లో వింతలు..

హాలీవుడ్ లో అయితే పెళ్లి విషయమైనా.. ప్రేమ విషయమైనా.. ప్రతి సంవత్సరం ఏదో ఒక వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే ఈసారి హాలీవుడ్ రీల్ కాకుండా రియల్ లైఫ్ లో వింత ఘటన చోటు చేసుకుంది.

సెలబ్రిటీల మధ్య..

సెలబ్రిటీల మధ్య..

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు సెలబ్రిటీల మధ్య ప్రేమ లేదా పెళ్లికి సంబంధించి ఏదైనా చిన్న సంఘటన జరిగితే చాలు ఆ విషయాలు వెంటనే వైరల్ అయిపోతాయి. అయితే ప్రస్తుతం ఓ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి హాట్ టాపిక్ తో ఆగకుండా.. అంతకుమించి అనేలా మారిపోయింది.

ఇప్పటికే ఎన్ని పెళ్లిళ్లంటే..

ఇప్పటికే ఎన్ని పెళ్లిళ్లంటే..

హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్ కు ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక పమేలా అండర్సన్ కూడా పెళ్లి విషయంలో తక్కువేమీ తినలేదు. తనకు కూడా ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి.

వయసుతో సంబంధం లేకుండా..

వయసుతో సంబంధం లేకుండా..

అయితే వీరిద్దరికీ వయసులో చాలా అంతరం ఉన్నప్పటికీ వీరు వయసుతో సంబంధం లేకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యారు. అతనికి ఇది ఆరో పెళ్లి కాగా.. ఆమెకు ఐదో పెళ్లి..

12 రోజుల్లోనే విడాకులు..

12 రోజుల్లోనే విడాకులు..

తొలుత వీరిద్దరి మధ్య ఉన్నసంబంధంలో వారం లోపే మనస్పర్దలు వచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు పదిరోజుల్లోపే వారి సంబంధానికి సంబంధించి పమేలా చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలం చేకూర్చాయి.

వీరి రిలేషన్ పై విమర్శలు..

వీరి రిలేషన్ పై విమర్శలు..

వీరిద్దరూ కలిసి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వారు స్పష్టం చేయడంతో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. వీరు దూరంగా ఉండాలనుకునప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేది అని కూడా తేల్చేస్తున్నారు.

మ్యారేజ్ సర్టిఫికెట్ రాకముందే..

మ్యారేజ్ సర్టిఫికెట్ రాకముందే..

వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ఇంకా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా రాలేదు. అయితే అంతలోనే వీరిద్దరూ విడిపోవటం.. వీరి మధ్య మనస్పర్దలు రావడం అనేది చకచకా జరిగిపోయాయి. దీంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Desktop Bottom Promotion