For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 4 రాశుల వారికి భార్య మాటే శాసనం.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

ఈ రాశుల వారు భార్య మాటే శాసనంగా భావిస్తారు. ఎందుకో మీరే చూడండి.

|

పెళ్లికి ముందు చాలా మంది మగవారు కింగ్ లాగా ఉంటారు. పెద్ద పెద్ద రాజ్యాలకు రాజులా భావించే వారంతా పెళ్లి తర్వాత మాత్రం కట్టుబానిసలుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రపంచంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. అయితే కాలం మారుతున్నకొద్దీ.. పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పురుషులు, స్త్రీలు సమానమనే భావనే వచ్చేసింది.

People are who listen to wife based on your zodiac sign

అయితే ప్రస్తుతం మగవారి కన్నా ఆడవారే ఎక్కువ అనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారో వారిలో చాలా మంది ఆడవారి మాటల్నే వింటుంటారు. వినడమే వారి మాటే శాసనంగా మారుతోంది.

People are who listen to wife based on your zodiac sign

ఒకప్పుడంటే భర్త మాటే వేదంగా.. భర్త అడుగుజాడల్లో నడిచేవారు భార్యలు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం చాలా మంది కపుల్స్ లో ఎక్కువ మంది భర్తలు తమ భార్యల మాటలే వింటున్నారు.

People are who listen to wife based on your zodiac sign

వారి మాటలు వినడమే కాదు.. వారి చెప్పిందల్లా చేసేస్తూ.. వారి మాటను శాసనంలా భావిస్తున్నారు. వారి మాటలకు తెగ గౌరవం ఇస్తున్నారు. ఒకవేళ వారి మాట వినకపోతే అంతే సంగతులు.. సరిగ్గా అదును చూసుకుని.. తమ మాట వినేలా చేసుకుంటున్నారు చాలా మంది భార్యలు. ప్రస్తుతం భార్యల మాట వినే వారి సంఖ్య రోజురోజుకు అమాంతం పెరుగుతూనే ఉంది. అలా భార్య మాటలనే శాసనంలా భావించే వారిని మనం జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారో లేదో ఇప్పుడే చూసెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం మీ రాశిచక్రాన్ని బట్టి భార్యల మాటలు వినే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశిని బట్టి మీరెలాంటి భార్యను పొందుతారో తెలుసా...!మీ రాశిని బట్టి మీరెలాంటి భార్యను పొందుతారో తెలుసా...!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. వీరు తమ భార్యకు చాలా విషయాల్లో ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఈ రాశి వారు తమ భార్య ఏది చెప్పినా తూచ తప్పకుండా పాటిస్తారు. తమ పార్ట్ నర్ వీరిని ఇష్టపడకపోయినప్పటికీ.. వీరు మాత్రం తమ భార్యను లవ్ చేస్తూనే ఉంటారు. కట్టుకున్న భార్యను ఎక్కువగా ప్రేమించే ఈ రాశి వారు పక్కచూపులు.. గోడదూకడం వంటి వాటిని ఇష్టపడరు. అందుకే వీరిని పలు సినిమాల్లో చూపించినట్టుగా భార్యకు కట్టుబానిసలు అని పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ఈ రాశి వారు పెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. తమ భాగస్వామిని ఎక్కువగా గౌరవిస్తారు.

మకరం..

మకరం..

ఈ రాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉండటం వల్ల వీరు చాలా విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. వీరు తమ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమకు నచ్చిన విధంగా జీవించడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే వీరు పెళ్లి చేసుకుంటారో.. వీరు తమ లైఫ్ స్టైల్ ను ఒక్కసారిగా ఛేంజ్ చేసుకుంటారు. తమ పార్ట్ నర్ తో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. మరో విశేషమేమిటంటే.. తమ లైఫ్ పార్ట్ నర్ ఏది చెప్పినా దానికి ఏ మాత్రం ఎదురు చెప్పకుండా ఓకే చెప్పేస్తుంటారు. ఈ రాశి వారు కూడా రిలేషన్ షిప్ కు ఎక్కువ విలువ ఇస్తారు. అంతేకాదు వివాహం తర్వాత తమ కుటుంబ సభ్యుల సంబంధాలను మెరుగుపరచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అందరితో కలిసి జీవించాలని అనుకుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఏడడుగుల బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. పెళ్లి అనే పవిత్రమైన బంధానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణాల వల్ల వీరు పెళ్లయిన తర్వాత, వీరు తమ జీవిత భాగస్వామితో బంధాన్ని బలపరచుకోవడానికి వారితో తగిన సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. అయితే వీరు తమ లైఫ్ పార్ట్ నర్ కు అందరితో సమానంగా చూడాలని భావిస్తారు. ఏదైనా సందర్భంలో తమ భాగస్వామి అలిగినప్పుడు.. బుంగ మూతి పెట్టుకున్నప్పుడు.. ఆమె కోపాన్ని తగ్గించేందుకు ఆమె మాట వింటున్నట్లు నటిస్తారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు చాలా విషయాల్లో ఓపికగా వ్యవహరిస్తారు. ఎందుకంటే వీరు నీటికి సంకేతం కాబట్టి. వీరు ఎక్కువగా ఇతరులతో మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ వీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో.. వీరి లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటారు. వీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచడానికి ఇష్టపడరు. ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. వీరి వివాహ జీవితంలో తమ భాగస్వామి యొక్క ప్రతి కోరికను నెరవేర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఫ్యామిలీలో లైఫ్ పార్ట్ నర్ సరిగ్గా ఉండకపోతే వీరు చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకంటే వీరు తమ భార్యకు ఎక్కువ గౌరవం ఇస్తారు. అందుకే వీరి పార్ట్ నర్ మాటలను ఎక్కువగా వింటారు.

English summary

People are who listen to wife based on your zodiac sign

Here we talking about the people are who listen to wife based on your zodiac sign. Read on
Story first published:Friday, November 6, 2020, 12:40 [IST]
Desktop Bottom Promotion