Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పెళ్లయిన వ్యక్తులనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు...
ఏ పాపురల్ హీరోయిన్లు పెళ్లయిన వ్యక్తులను మళ్లీ పెళ్లి చేసుకున్నారో ఇక్కడ చూసెయ్యండి.
మూవీ అంటేనే ఓ కలర్ ఫుల్ వరల్డ్. ఇక్కడ చేరుకుంటే తమ లైఫ్ కలర్ ఫుల్ గా మారిపోతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే ఈ రంగంలో దీపం ఆరిపోయేలోపే ఇంటిని చక్కబెట్టుకోవాలి.

లేదంటో ఏ హీరోయిన్ పరిస్థితి అయినా ఘోరంగా ఉంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే చాలా మంది హీరోయిన్లు తాము కెరీర్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ప్రేమ పెళ్లి చేసుకోవడమో లేదా ఏదైనా బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకుంటూ ఉంటారు.

అయితే సినీ రంగంలో ప్రేమలు.. బ్రేకప్ లు.. పెళ్లిళ్లు.. విడాకులు తీసుకుని విడిపోవడాలు చాలా కామన్. అయితే ఒకసారి పెళ్లి చేసుకుని విడిపోయినంత మాత్రాన ఒంటరిగా ఉండేందుకు చాలా మంది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో తమ జీవితానికి మరో తోడు కావాలని కోరుకుంటారు. అలా టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా చాలా మంది స్టార్ హీరోయిన్లు తమ జీవితాన్ని మరో వ్యక్తితో పంచుకున్నారు. అది కూడా ఇదివరకే పెళ్లై పిల్లలు పుట్టినా.. వారితో ప్రేమలో పడటం.. వారిని మళ్లీ పెళ్లి చేసుకోవడం.. మళ్లీ విడాకులు ఇవ్వడం వంటివి జరిగాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ఆ టాప్ స్టార్ హీరోయిన్ల ఎవరు? వారు మళ్లీ పెళ్లి ఎవరిని చేసుకున్నారు.. ఎందుకని అలా చేయాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రేణుదేశాయ్-పవన్..
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేణుదేశాయ్. అయితే అప్పటికే పవర్ స్టార్ కు నందిని అనే అమ్మాయితో పెళ్లి అయ్యింది. అయితే తనతో విడాకులు తీసుకున్నారు. దీంతో పవన్ ను రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. తాను కూడా అలానే హింట్ ఇచ్చింది. కానీ వివాహ వివరాలు వెల్లడించలేదు. అయితే పవన్ మాత్రం రష్యన్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తనకు ఓ బిడ్డ కూడా జన్మించింది.

అమల-నాగార్జున..
టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను అప్పటి స్టార్ హీరోయిన్ అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కినేని నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరితో పెళ్లి జరిగింది. కానీ వారిద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం అమలను నాగార్జున రెండోసారి పెళ్లి చేసుకున్నారు. నాగార్జునకు ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ ఉన్నారు. వీరిలో నాగచైతన్యకు వివాహం జరగ్గా.. అఖిల్ ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

శ్రీదేవి-బోణీ కపూర్..
స్వర్గస్తురాలైన అతిలోక సుందరి శ్రీదేవి కూడా బాలీవుడ్ నిర్మాత అయిన బోణీ కపూర్ ను 1996వ సంవత్సరంలో జూన్ రెండో తేదీన రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్ పుట్టారు. అయితే తనకు అప్పటికే మరో నటుడితో వివాహం జరిగినట్లు సమాచారం.

విద్యాబాలన్ - సిద్ధార్థ రాయ్..
డర్టీ పిక్చర్ తో కుర్రకారుకు పిచ్చెక్కించిన బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ విద్యా బాలన్ కూడా సిద్ధార్థ్ రాయ్ కపూర్ అనే వ్యక్తిని 2012లో రెండో వివామం చేసుకున్నారు. అయితే తనకు అప్పటికే ఆర్తి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. కానీ వారిద్దరూ అప్పటికే విడాకులు తీసుకున్నారు.

కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్..
బాలీవుడ్ జిరో సైజ్ భామ కరీనా కపూర్ కూడా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వీరిద్దరూ ఇప్పటికీ హాయిగా కలసిమెలసి జీవిస్తున్నారు. అయితే అప్పటికే సైఫ్ అలీఖాన్ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. సైఫ్ తన అమ్రుత సింగ్ అనే అమ్మాయిని తొలిసారిగా 1991లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2004 సంవల్సరంలో విడిపోయారు.

శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా..
టాలీవుడ్ లో వెంకటేష్ తో కలిసి నటించిన ఈ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి కూడా రాజ్ కుంద్రా అనే వ్యక్తిని ప్రేమించి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా 2012 మరియు 2020 సంవత్సరంలో పిల్లలు పుట్టారు. అయితే రాజ్ కుంద్రాకు అప్పటికే కవితా కుంద్రా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. వారికి ఓ కూతురు కూడా పుట్టింది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

రాణి ముఖర్జీ-ఆదిత్య చోప్రా
బాలీవుడ్ లో మరో అందాల ముద్దుగుమ్మ రాణి ముఖర్జీ. ఈ అమ్మడు కూడా పెళ్లైన వ్యక్తినే ప్రేమించి 2014 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య చోప్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ముందుగానే తనకు పాయల్ కన్నా అనే అమ్మాయితో 2001లో వివాహం జరిగింది. అయితే వీరిద్దరూ ఎనిమిదేళ్లు కాపురం చేసిన తర్వాత 2009 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం ఐదేళ్ల తర్వాత రాణిముఖర్జీ ఆదిత్యను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.

తేజస్విని - దిల్ రాజు
తేజస్విని అనే అమ్మాయికి సినీ రంగంతో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ.. టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజును కరోనా కాలంలో అంటే 2020 సంవత్సరంలో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి పెద్ద తన కూతురే కావడం మరో విశేషం. దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యం కారణంగా చనిపోవడంతో తనను ఇష్టపడి తేజస్విని అనే ఎయిర్ హోస్టెస్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంది.
వీరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే లారా దత్త, బిపాసా బాసు, అమ్రుత అరోరా వంటి ప్రముఖలు కూడా పెళ్లైన వ్యక్తులనే మళ్లీ పెళ్లి చేసుకున్నారు.



Click it and Unblock the Notifications











