Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
ఈ గుణాలున్న పురుషులు లైఫ్ పార్ట్‌నర్స్‌ను చక్కగా హ్యాండిల్ చేస్తారు
సంబంధాన్ని ప్రారంభించడం అనేది పురుషులు, మహిళలు ఇద్దరికీ అన్ని విధాలుగా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సంబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత దానిని కొనసాగించడం అంత సులభం మాత్రం కాదు. బంధాన్ని నిలుపుకోవడానికి ఇద్దరు భాగస్వాముల నుండి ఎంతో ప్రయత్నం అవసరం. కొన్ని విషయాల్లో భర్త, కొన్ని విషయాల్లో భార్య రాజీ పడాల్సి వస్తుంది.

అయితే కొందరు పురుషులు మాత్రం సంబంధాన్ని, భాగస్వామిని చక్కగా హ్యాండిల్ చేస్తారు. ప్రేమ పంచుతారు, గౌరవం ఇస్తారు, మద్దతుగా నిలబడతారు, భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. సంబంధంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో వాటి నుండి సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా ముందుకు సాగాలో వారికి బాగా తెలిసి ఉంటుంది. అలాంటి పురుషుల్లో ఎలాంటి గుణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అతను మద్దతునిస్తాడు
తన భాగస్వామి ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ మద్దతునిస్తాడు. అతను తన భాగస్వామి తమ లక్ష్యాలను సాధించలేరనే అభిప్రాయాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. జీవితంలోని అన్ని దశల్లో అతను మద్దతుగా, అండగా నిలబడతాడు. ప్రోత్సహిస్తాడు, జాగ్రత్తలు చెబుతాడు.

2. అతను గౌరవిస్తాడు
ప్రతి బంధానికి మూలస్తంభం గౌరవం. ఒక వ్యక్తి తన భాగస్వామిని గౌరవించాలి అలాగే అభినందించాలి. అలాగే తాను కూడా తిరిగి గౌరవం పొందాలి. సున్నితంగా వ్యవహరించాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. నైతికతకు ఎక్కువ విలువ ఇవ్వాలి.

3. అతన్ని నమ్మొచ్చు
భాగస్వామికి సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగించడం, వారు స్వేచ్ఛగా ఉండటానికి వీలు కల్పించడం విశ్వసనీయతను సూచిస్తాయి. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు, ప్రేమ లేకుండా బంధం ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే నమ్మకం వస్తుంది.

4. మాటలతో కాదు చేతలతో చెబుతాడు
కొందరు మాటలతో కోటలు కట్టేస్తారు. కానీ సంబంధాన్ని సాఫీగా నిర్వహించడానికి ప్రయత్నించే వ్యక్తి మాటలతో కంటే ఎక్కువగా తన చేతలతోనే మాట్లాడతాడు. ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే ప్రేమ చూపిస్తాడు. నిన్ను కేరింగ్‌గా చూసుకుంటానని చెప్పడు, చూసుకుంటాడు. అయితే వారి ప్రేమను, నమ్మకాన్ని, మద్దతును గ్రహించాల్సిన బాధ్యత భాగస్వామిపై ఉంటుంది. చేతలతో చెప్పే వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా పొదుపుగానే ఉంటాడు. మాట్లాడేది కాసేపే అయినా మనసులో ఉన్నది చెప్పేస్తారు.

5. భావోద్వేగాలను వ్యక్తపరుస్తాడు
మనసులో మాట మాట్లాడటం వల్ల బంధం బలపడుతుంది. మనస్ఫూర్తిగా మాట్లాడటం ఏ సంబంధంలోనైనా అత్యంత కీలకం. సంకోచం లేకుండా ఏదీ దాచకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తులతో సంబంధం కలకాలం ఉంటుంది. లోపల ఒకటి ఉంచుకుని బయటికి మరొకటి చెప్పే వారితోనే అసలు సమస్య. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారితో ఎలాంటి సమస్య ఉండదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పినప్పుడే ఇద్దరు భాగస్వాములకు ఏది సరైనాదో ఆ నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుంది. మనస్సులో ఉన్నది చెప్పడానికి నిజాయితీ అవసరం.

6. అతనికి భాగస్వామి అవసరాలు తెలుసు
అవసరాలు శారీరక, మానసికానికి సంబంధించినవి. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వారి అవసరాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. వారి ఇష్టాలు తెలుసుకుంటాం. భాగస్వామి గురించి కనీస అవగాహన ఏర్పరచుకుంటాం. అలాంటి చర్యల ద్వారానే బంధం కలకాలం సాఫీగా సాగుతుంది.



Click it and Unblock the Notifications











