For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానా-మిహీకా వెడ్డింగ్: సెలబ్రెటీలకు పెళ్లిలో ఉన్న ఫీలింగ్ వచ్చేందుకు ఏ టెక్నాలజీ వాడారో తెలుసా...

కరోనా వేళ కళ్యాణం చేసుకున్న భళ్లాలదేవుడు.. ఈ వెడ్డింగ్ వేడుకను చూసేందుకు సెలబ్రెటీలు ఎలాంటి టెక్నాలజీ వాడారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన భళ్లాలదేవుడు కూడా ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులతో, పలువురు సన్నిహితుల నడుమ తన నెచ్చెలి మెడలో మూడు ముళ్లు వేశాడు.

Rana-mihika Wedding: Do you know which technology is used by celebrities to watch this wedding

కోవిద్ కారణంగా తన కుమారుడి పెళ్లికి ఎవ్వరినీ ఆహ్వానించలేదని, ఈ విషయంలో తను కూడా చాలా బాధపడుతున్నట్లు నిర్మాత సురేష్ బాబు కూడా చెప్పారు.

Rana-mihika Wedding: Do you know which technology is used by celebrities to watch this wedding

అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారట దగ్గుబాటి వారి కుటుంబసభ్యులు.

Rana-mihika Wedding: Do you know which technology is used by celebrities to watch this wedding

ఇదిలా ఉండగా రానా పెళ్లిలో హీరో రామ్ చరణ్, ఉపాసన సందడి చేశారు. కుటుంబసభ్యులు మినహా బయటి నుండి వచ్చిన వారిలో రామ్ చరణ్, శర్వానంద్ మాత్రమే ఉన్నారు.

నాగచైతన్య, సమంత పెళ్లి వేడుకలో కనిపించినప్పటికీ, అక్కినేని నాగార్జున కుటుంబం కూడా కనిపించలేదు. అయితే రానా చిన్ననాటి స్నేహితులిద్దరూ పెళ్లిలో బాగా గోల చేశారట. మరోవైపు తమ వివాహ వేడుకను సెలబ్రెటీలంతా కలిసి చూసేందుకు ప్రత్యేక టెక్నాలజీని వాడారట. ఇంతకీ అదేంటి? ఎవరెవరు అందులో వీక్షించారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ నలుగురే..

ఆ నలుగురే..

ఆగస్టు 8వ తేదీన రామానాయుడు స్టూడియోలో రానా-మిహీకా వివాహ వేడుకకు కేవలం నలుగురు సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. రామ్ చరణ్, శర్వానంద్, నాగచైతన్య, సమంత మాత్రమే కరోనా కళ్యాణంలో సందడి చేశారు.

వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ..

వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ..

అయితే దగ్గుబాటి వారి వివాహ వేడుకను హాజరు కాలేని సెలబ్రెటీల కోసం వర్చువల్ టెక్నాలజీని ఉపయోగించరాట. తాము ఎవరినైతే ఆహ్వానించాలనుకున్నామో.. వారందరికీ ఈ టెక్నాలజీలో వాడాల్సిన ఎక్విప్ మెంట్లను కూడా పంపించారట.

తొలి సెలబ్రెటీ..

తొలి సెలబ్రెటీ..

రానా పెళ్లికి రాని వారి కోసం.. ఇండస్ట్రీలో ఉన్న ఇతర ప్రముఖులు, స్నేహితుల కోసం వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ పంపి, పెళ్లి చేసుకున్న మొట్టమొదటి సెలబ్రెటీగా కొత్త రికార్డు నెలకొల్పడం విశేషం.

కరోనా తగ్గాక..

కరోనా తగ్గాక..

అయితే కరోనా మహమ్మారి కంట్రోల్ అయిన తర్వాత సినిమా రంగంలోని వారందరినీ పిలిచి.. అందరికి ఘనంగా పార్టీ ఇవ్వాలని దగ్గుబాటి కుటుసభ్యులు ప్రణాళిక రూపొందిస్తున్నారట.

రెండు సాంప్రదాయాల్లో..

రెండు సాంప్రదాయాల్లో..

దగ్గుబాటి రానా-మిహీకా బజాజ్ తెలుగు మరియు మార్వాడీ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక పనులను ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక టీమ్ నిర్వహించింది. పెళ్లికి వచ్చిన అతిథులకు తెలుగు వంటకాలతో పాటు.. రాజస్థానీ రుచులను వడ్డించారు.

ప్రత్యేక ఆకర్షణగా సమంత..

ప్రత్యేక ఆకర్షణగా సమంత..

రానా పెళ్లి వేడుకలో అతి తక్కువ మంది ప్రముఖులు హాజరైనప్పటికీ సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రానా చిన్నాన్న విక్టరీ వెంకటేష్ సైతం ఈ పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

కరోనా నేపథ్యంలో ఈ కళ్యాణ వేడుకలో అతిథులందరికీ ఎలాంటి ఇబ్బందీ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. బయో సెక్యూర్ పద్ధతిలో ఈ వివాహ వేడుకను నిర్వహించారు.

వివాహ వేడుకలో పాల్గొనే వారందరికీ..

వివాహ వేడుకలో పాల్గొనే వారందరికీ..

ఈ వివాహ వేడుకలో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరికీ ముందుగానే కరోనా పరీక్షలను చేశారు. అంతకుముందే వివాహ వేదికతో పాటు పరిసరాలను మొత్తం శానిటైజ్ చేశారు. పెళ్లిలో తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

Images Source : Twitter

English summary

Rana-mihika Wedding: Do you know which technology is used by celebrities to watch this wedding

Here we talking about Rana-mihika wedding:do you know whic technology is used by celebrities to watch this wedding. Read on
Desktop Bottom Promotion