For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి రెఢీగా ఉండేవారికి.. ఈ వధువులిచ్చే సలహాలేంటో చూసెయ్యండి...

|

'పెళ్లి అంటే నూరేళ్ల పంట' అనే నానుడి ఎప్పటి నుండో ఉంది. 'పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి' అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వివాహ జీవితంలోకి అడుగు పెట్టేందుకు వయసులో ఉండే వారు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు.

పెళ్లి అనేది ప్రతి ఒక్క అమ్మాయికి ఎంతో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో వివాహ ఆచారాలు, పద్థతులు, సంప్రదాయాలు కట్టుబాట్లు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అందుకే పెళ్లంటే ప్రతి ఒక్కరూ కొంత విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు.

అయితే పెళ్లికి ముందుగా కొన్ని నెలలు, వారాలు ముందు నుంచి ఎంత బాగా ప్లాన్ వేసినా ఆఖరి క్షణంలో కొన్ని గుర్తుకు రావడం.. అకస్మాత్తుగా మనం ఇబ్బందులు ఎదుర్కోవడం అనేవి జరగడం అత్యంత సహజం. అందుకే పెళ్లికి ముందే పక్కా ప్లానింగ్ చేసుకోవాలి. అందుకోసం అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కొందరు నవ వధువులు పెళ్లి సందర్భంగా తాము ఎదుర్కొన్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని.. మీకు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మీ వివాహ వేడుకల్లో వీటిని పాటించండి.. మీ పెళ్లిని ఘనంగా జరుపుకోండి...

పెళ్లైన తర్వాత పండుగ వేళ నవ వధువులు అలానే ఆలోచిస్తారా?

ముహుర్తం సమయంలో..

ముహుర్తం సమయంలో..

మన దేశంలో పెళ్లిళ్ల సమయంలో ఎన్ని చీరలు మారుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పెళ్లి రోజున ముహుర్త సమయానికి మాత్రం తప్పనిసరిగా తలంబ్రాల చీర సపరేటుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ చీరతో పాటు జ్యువెలరీ, ఆభరణాలు, ఇతర వస్తువులన్నీ ఒకే దగ్గర ఉంచుకోవాలి. దీని వల్ల ముహుర్త సమయానికి ఆలస్యం కాకుండా జాగ్రత్త పడొచ్చు.

కొత్తగా ట్రై చేయొద్దు..

కొత్తగా ట్రై చేయొద్దు..

పెళ్లి వేడుకల్లో కొత్త వాటిని దేన్నీ ప్రయత్నించకండి. ముఖ్యంగా మేకప్, హెయిర్ స్టైల్ వంటివి మీకు సెట్ అవుతాయా? లేదా? అనే విషయాలపై ముందుగానే ఓ అవగాహన తెచ్చుకోవాలి. ఇందుకోసం వాటిని ముందే ఓసారి ప్రయత్నించాలి. అంతా సరిపోతుందనుకుంటేనే.. అలాంటి మేకప్, స్టైల్ మీకు బాగుంది అనిపిస్తేనే.. పెళ్లి సమయంలో వాటిని వేసుకోవాలి. అంతేకానీ పెళ్లి వేడుకలో కొత్త మేకప్ ఉత్పత్తులను వాడటం వంటివి చేయకండి. ఇదంతా పెళ్లికి ముందుగానే అంటే కనీసం వారం ముందు ఓసారి వేసుకొని చెక్ చేసుకోవాలి. అప్పుడే అవి మీ చర్మానికి చక్కగా ఉంటాయో లేదో తెలుస్తుంది.

ఓ జాబితా సిద్ధం చేసుకోండి..

ఓ జాబితా సిద్ధం చేసుకోండి..

వివాహ వేడుక సమయంలో మీకు అవసరమయ్యే చీరలు, నగలు, ఇతర ఆభరణలు, మేకప్ ఉత్పత్తుల గురించి ఓ జాబితా సిద్ధం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా పెళ్లి రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ముహుర్తం సమయం వరకు మీరు వాడాల్సిన ప్రతి ఐటమ్ ను ఆ జాబితాలో చేర్చండి. లోదుస్తుల నుండి విలువైన ఆభరణాల వరకూ.. బ్రష్ నుండి సేఫ్టీ పిన్ వరకూ.. మేకప్ కిట్ నుండి తలలో పెట్టుకునే పూల వరకూ ప్రతిదీ జాబితాలో చేర్చుకుని.. అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వాటినన్నింటినీ ఒకేచోట భద్రపరచుకోవాలి.

టెన్షన్ పడకండి..

టెన్షన్ పడకండి..

మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు.. నాలుగు అక్షింతలు.. భోజనాలు మాత్రమే కాదు.. అంతకుమించిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అన్ని తతంగాలు సవ్యంగా జరగాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు కొన్ని తప్పులు దొర్లడం అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఊహించుకున్నట్టు జరగకపోతే టెన్షన్ పడకండి. ముఖ్యంగా పెళ్లి రెండ్రోజులు ఉందనగా.. మీ బ్లౌజ్ టైట్ కావడమో లేదా ముఖంపై మొటిమలు వస్తే మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి.

నీళ్లు రాలేదు..

నీళ్లు రాలేదు..

కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ వివాహిత ఇలా చెబుతోంది. ‘నా పెళ్లి సమయంలో నేను రోజ్ వాటర్, పాలు పోసుకుని బాత్ టబ్ లో స్నానం చేశాను. ఆ తర్వాత కడుపు నిండా టిఫిన్ చేసి రెడీ అవ్వాలనేది నా ప్లాన్. కానీ మా మేనకోడలు నల్లా తిప్పేయడంతో ఆరోజు మా ఇంట్లో నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అయితే మేము ఏ మాత్రం టెన్షన్ పడలేదు. ప్రశాంతంగా నీళ్లు వచ్చేంత వరకూ వెయిట్ చేశామని చెప్పింది. నీళ్లొచ్చిన వెంటనే మేమంతా స్నానం చేసి రెడీ అయిపోయాం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ ఇలాంటి ఘటనలే మీరు ఆరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి.

రాత్రి నిద్రపోవాలి..

రాత్రి నిద్రపోవాలి..

పెళ్లి మరి కొద్ది క్షణాల్లో ఉదయాన్నే ముహుర్తం ఉందంటే.. రాత్రి వేళ చాలా మంది వచ్చి బంధువులతో, స్నేహితులతో ముచ్చట్లు పెడతారు. మెళకువగా ఉంటారు. కానీ పెళ్లి రోజు తాజాగా కనిపించాలంటే.. పెళ్లికి ముందు రోజు రాత్రి మంచిగా నిద్రపోవాలి. అలాగే ప్రతి విషయానికి మీరు కంగారు పడకుండా రిలాక్స్ అవ్వాలి. అప్పుడే మీ అద్భుతమైన ఆల్బమ్ రెడీ అవుతుంది.

అలా చేస్తే..

అలా చేస్తే..

పెళ్లి సమయంలో మీకు నచ్చిన వ్యక్తులు మరియు పిల్లలను దగ్గరగా ఉంచుకోండి. వారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తారు. ఏదైనా వేడుక అంటే వాళ్ల సందడి అంతా ఇంతా కాదు.. వాళ్లను చూస్తుంటేనే.. మీకు ఉత్సాహం పెరుగుతుంది. మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ‘నా పెళ్లిలో నా మేనల్లుడు, నా స్నేహితులు నా దగ్గరే ఉండేవారు. నన్ను వారు రాకుమారిలా భావించారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తినిపించడం, నీళ్లు తాగించడం, అద్భుతమైన క్యాండిడ్ ఫొటోలు తీయడం, నాకు ఒత్తిడి లేకుండా చూసుకోవడం వంటివి చేశారు' అని ఓ మరో నవ వధువు చెప్పారు.

అవి పట్టించుకోవద్దు..

అవి పట్టించుకోవద్దు..

కొందరు అమ్మాయిలు పెళ్లి పూర్తవ్వగానే శోభనం గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడతారు. కానీ వరుసగా పెళ్లి వేడుకలతో అలసిపోయి ఉంటారు కాబట్టి ఫస్ట్ నైట్ గురించి ఏ ఒకర్కరూ ఆలోచించరు. కాబట్టి మీరు ఏ మాత్రం కంగారు పడకండి.

English summary

Real Brides Share Their Wedding Day Advice in Telugu

Here are the real brides share their wedding day advice in Telugu. Have a look
Story first published: Thursday, September 16, 2021, 16:39 [IST]