For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తనను తాకనివ్వడు.. నేను టచ్ చేసినా తట్టుకోలేకపోతున్నాడు’ ఎందుకిలా?

‘నా భర్త నన్ను తాకనివ్వడం లేదు.. అందుకు గల కారణాలేంటి’ అని ఓ వివాహిత అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికిందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇటీవలి కాలంలో కొందరికి లైంగిక కోరికలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. అందుకు మారుతున్న జీవనశైలే ప్రధాన కారణమని చెప్పొచ్చు.

Reasons My Husband Wont Touch Me in Telugu

అయితే మీ లైఫ్ స్టైల్ లో మార్పు వల్ల వచ్చే మార్పులు చిన్నవిగానే అనిపించినా అవి లైంగిక పరమైన జీవితాన్ని(Sex Life) ప్రభావితం చేయడంలో ముందుంటాయని గుర్తుంచుకోవాలి. ఇదిలా ఉండగా.. ఓ వివాహిత తన భర్త వింతగా ప్రవర్తిస్తున్నాడని.. తనకు పెళ్లి జరిగి సంవత్సర కాలం ముగిసినా.. కనీసం తనను తాకనివ్వడం లేదని బాధపడుతోంది.

Reasons My Husband Wont Touch Me in Telugu

పైగా తన కంటే తన చెల్లి ఇంకా అందంగా ఉందని.. తనలాగా ఎందుకు లేవని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. నాకే ఇలా ఎందుకు జరుగుతుందని.. తన సమస్యకు పరిష్కారం చూపగలరని నిపుణులను సంప్రదించింది ఓ మహిళ. తన భర్తతో తాను ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. తనకు ఎలాంటి పరిష్కారం దొరికిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'పక్కింటి ఆంటీకి నా వల్ల అమ్మాయి పుట్టింది.. ఇప్పుడేమో అబ్బాయి కావాలంటున్నరు''పక్కింటి ఆంటీకి నా వల్ల అమ్మాయి పుట్టింది.. ఇప్పుడేమో అబ్బాయి కావాలంటున్నరు'

పెళ్లి చూపుల్లో..

పెళ్లి చూపుల్లో..

హాయ్! నా పేరు గిరిజా(పేరు మార్చాం). నేను హైదరాబాద్ సిటీలోని మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నాను. నేను ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు పెళ్లి జరిగి ఏడాది కాలం కావస్తోంది. అయితే పెళ్లి జరిగిన కొత్తలో నా భర్తలో వింత ప్రవర్తన కనిపిస్తోంది. పెళ్లి చూపుల్లో నచ్చిన తర్వాతే నన్ను వివాహం చేసుకున్నాడు.

దాంపత్య జీవితానికి దూరంగా..

దాంపత్య జీవితానికి దూరంగా..

అయితే పెళ్లి తర్వాత తనలో చాలా మార్పు వచ్చేసింది. నాతో లైంగిక జీవితానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకు.. ఏమైంది అని అడిగితే.. ‘నీ ముఖం మీద పింపుల్స్ పెరిగాయని.. నీ స్కిన్ పై జిడ్డు ఎక్కువగా ఉందని.. ముందు వాటిని తగ్గించుకో' అన్నాడు. అక్కడితే ఆగకుండా నా కళ్లద్దాలను బలవంతంతగా తీసేశాడు.

ఇబ్బంది ఉందన్నా..

ఇబ్బంది ఉందన్నా..

నేను కళ్లజోడు లేకుండా కంప్యూర్ మీద పని చేయాలంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుందన్నా కూడా వినిపించుకోవడం లేదు. అంతేకాదు ఇతరులతో పోల్చి చూస్తున్నాడు. అలా ఉండు.. ఇలా ఉండు.. నీ కన్నా నీ చెల్లెలే బ్యూటిఫుల్ గా ఉంది. నువ్వేందుకు అలా కనబడటం లేదు. నిన్ను చూస్తుంటే మూడే రావడం లేదు' అంటూ తన మాటలతో ఇబ్బంది పెడుతున్నాడు.

‘నా భర్త ఆంటీతో.. ఆమె భర్త ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నాడు..'‘నా భర్త ఆంటీతో.. ఆమె భర్త ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నాడు..'

టచ్ కూడా చేయనివ్వడు..

టచ్ కూడా చేయనివ్వడు..

తను ఎన్ని మాటలన్నా.. కట్టుకున్న భర్త కాబట్టి.. ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చాను. అయితే తన వింత ప్రవర్తన ఇప్పుడు మరీ పీక్ స్టేజీకి వెళ్లింది. అది ఎంతలా అంటే.. కనీసం నన్ను తాకడం లేదు.. నేను టచ్ చేసినా దూరంగా వెళ్తున్నాడు. తను ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడే నేనేం చేయాలి' అని గిరీజ అనే వివాహిత నిపుణులను సంప్రదించింది. దీనికి నిపుణులు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైనది కాదు..

సరైనది కాదు..

‘నీతో లైంగిక జీవితానికి దూరంగా ఉండేందుకు నీ భర్త చెప్పే కారణాలేవీ నిజం కావు. నీతో ఆ కార్యంలో పాల్గొనేందుకు తప్పించుకోవడానికి మాత్రమే అలా చెబుతున్నాడు. ఎందుకంటే పెళ్లికి ముందు నువ్వు కళ్లజోడు వాడేదానివి.. పింపుల్స్ కూడా ఉండేవి కదా.. ఇప్పుడు నిన్ను అవమానిస్తూ.. అందులోనూ ఇతరులతో పోల్చడం అనేది సరైనది కాదు.

మానసిక ఆందోళనలు..

మానసిక ఆందోళనలు..

తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే.. అతనిలో సెక్స్ కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. సెక్స్ గురించి ఏమైనా మానసిక ఆందోళనలు కూడా రీజన్ కావొచ్చు. తన లోపం ఎక్కడ బయటపడుతుందో అని, ఇలా రివర్స్ గేమ్ ప్లాన్ చేసిండొచ్చు. కాబట్టి ముందుగా ఒకసారి తనతో కూర్చొని మాట్లాడండి. ఒకవేళ మీ మాట వినకపోతే ఇరు కుటుంబాల్లోని పెద్దొళ్లను కూర్చొబెట్టి అన్ని విషయాలు చెప్పండి.

మూడ్ రాకపోవడానికి..

మూడ్ రాకపోవడానికి..

మిమ్మల్ని మూడ్ రాకపోవడానికి, మీ ఫేసుపై ఉండే పింపుల్స్, కళ్లజోడు కారణం కానే కాదని, అతనిలోని సెక్స్ లోపమేనని కచ్చితంగా చెప్పండి. ఇంకోసారి ఇతరులతో పోల్చి చూసి.. అవమానిస్తే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పండి.

వైద్య పరీక్షల తర్వాత..

వైద్య పరీక్షల తర్వాత..

ముందు మంచి సెక్సాలజిస్టును సంప్రదించి, తనలో ఏదైనా లోపాలుంటే వాటిని తగ్గించుకుంటేనే కలిసి ఉంటానని చెప్పండి. మెడికల్ టెస్టుల్లో ఏం తేలుతుందో.. దాన్ని బట్టి ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా తనలో తీవ్రమైన లేదా చికిత్సకు కూడా నయం కాని సమస్య ఉంటే నిర్మోహమాటంగా విడాకులు ఇచ్చేసి, ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవచ్చని నిపుణులు వివరించారు.

English summary

Reasons My Husband Won't Touch Me in Telugu

Here are the reasons my husband won't touch me in Telugu. Have a look
Desktop Bottom Promotion