For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దలు కుదర్చిన పెళ్లి సక్సెస్ అయ్యేందుకు గల కారణాలేంటో తెలుసా...

|

ఈరోజుల్లో ఎక్కువ మంది జంటలు పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్లంటేనే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఈ కాలంలో ఎవరైనా అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నిస్తూ ఉంటారు.

పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లలో ముక్కు, మొహం తెలియని వారిని ఎలా పెళ్లి చేసుకుంటారని.. వారితో జీవితాంతం ఆనందంగా ఎలా గడుపుతారని, అందుకే తమకు తెలిసిన వ్యక్తులను ప్రేమించడం.. వారిని పెళ్లాడటం మంచిదని మరీ చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా తల్లిదండ్రుల ఇష్టానికి తగ్గట్టు పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. కొంతమంది యువత పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

కానీ ఆ బంధానికి మధ్యలోనే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకునే యువత ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. ప్రేమ పెళ్లి అయినా.. కపుల్స్ మధ్య సాన్నిహిత్యం, అర్థం చేసుకునేతత్వం, వారిద్దరి మధ్య ఉండే అనురాగమే ఆ బంధాన్ని జీవితాంతం ఆనందంగా ఉండేలా చేస్తాయి. అంటే మన పార్ట్నర్ ను ఎలా ఎంచుకున్నామని కాదు.. వారితో మన బంధం ఎంత బలంగా ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఈ సందర్భంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎందుకు సక్సెస్ అవుతాయి.. వారు సెట్ చేసిన మ్యాచ్ లో ఉండే ప్రత్యేకతలేంటి.. పెద్దలు చేసే పెళ్లిళ్ల వల్ల వచ్చే లాభాలేంటి అనే ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆన్ లైనులో ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు ఇవి మరిస్తే అంతే సంగతులు..!

మనకంటే ఎక్కువగా..

మనకంటే ఎక్కువగా..

మన దేశంలో పూర్వ కాలం నుండి కుటుంబంలోని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మన పూర్వీకులు పెళ్లి విషయంలో కొన్ని బలమైన పునాదులు ఏర్పాటు చేసి వెళ్లారు. దీంతో కొన్ని యుగాలు, తరాల వారు అదే ఆనవాయితీని, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇది పిత్రుస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తుందని కొందరు అభ్యర్థనలు చెబుతున్నప్పటికీ, వివాహ సంప్రదాయాలు అలాగే కొనసాగుతున్నాయి.

మనకంటే ఎక్కువగా..

మనకంటే ఎక్కువగా..

పెద్దలు ఏదైనా పెళ్లి చేసే ముందు మీ ఇష్టాలకు, అభిరుచులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అందుకు అనుగుణంగానే మీకు పార్ట్నర్ ను అన్వేషిస్తారు. ఇందుకోసం మీ తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.. తెలిసిన వ్యక్తులతో మరియు తెలియని వ్యక్తులతో చాలా విషయాలను ఆరా తీస్తారు. అన్నింటికంటే ముందు మనం వారితో హ్యాపీగా ఉంటామా లేదా అని మన కంటే ఎక్కువగా ఆలోచిస్తారు.

కుటుంబ నేపథ్యం..

కుటుంబ నేపథ్యం..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో వధూవరులిద్దరికీ దాదాపు కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలకు దగ్గరగా ఉండేవారినే మీకు భాగస్వామిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీంతో మీ భాగస్వామి చాలా త్వరగా అందరితో కలిసిపోతారు. ఈ విషయాన్ని మీరే నమ్మలేకపోతారు. అంతేకాదు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటికి అడ్జస్ట్ అవుతారు.

ఇలా చేస్తే ఆ కార్యంలో ఆందోళన అనేదే ఉండదట...!

అంచనాలు ఉండవు..

అంచనాలు ఉండవు..

పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకునే వారు చాలా సహనంతో ఉంటారు. వీరు తమ భాగస్వామి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరికి తమ పార్ట్నర్ విషయంలో పెద్దగా అంచనాలేవీ ఉండవు. ఎందుకంటే వీరికి పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి పెద్దగా పరిచయం ఉండదు. అందుకే వీరు తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకునే పనిలో మునిగిపోతారు. దీంతో వీరికి బోర్ అనేదే కొట్టదు. అందుకే వీరిద్దరూ అంచనాలు పెంచుకోరు. కాబట్టి ప్రతి పెళ్లి తర్వాత ఆనందంగా గడిపేస్తారు.

చాలా విషయాల్లో క్లారిటీ..

చాలా విషయాల్లో క్లారిటీ..

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వ్యక్తులకు చాలా విషయాల్లో క్లారిటీ ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ నుండి ఏం కోరుకుంటున్నారు.. మీరు తన నుండి ఏమి ఆశిస్తున్నారనే విషయాలపై కచ్చితంగా క్లారిటీ వస్తుంది. అప్పుడే మీరు ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతారు. దీంతో పెళ్లి తర్వాత వాదనలు, గొడవలు, మనస్పర్దలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ముందే అన్ని విషయాలు..

ముందే అన్ని విషయాలు..

పెద్దలు కుదర్చి పెళ్లిళ్లో ముందుగానే రెండు ఫ్యామిలీల వారు వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. వారి ఎలాంటి వారు.. వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి.. వారి జీవనోపాధి.. ప్రవర్తనతో పాటు ఇంకా చాలా విషయాలను ఆరా తీస్తారు. అందుకే పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా పెద్దలు ఆ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు.

English summary

Reasons Why Arranged Marriages Are Still Successful in India

Here we are discussing about the reasons why arranged marriages are still successful in India. Have a look