For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!

పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి కారణాలేంటో తెలుసా...

|

మన సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే ఘట్టం ఎంతో కీలకం. యవ్వనంలో వచ్చిన వారందరిలో ఆటోమేటిక్ గా పెళ్లి గురించి ఆలోచనలు మొదలవుతాయి.

Reasons why marriage is not passe yet in Telugu

తమ బ్రహ్మాచార్యం, ఒంటరి జీవితానికి ఎప్పుడెప్పుడు వీడ్కోలు పలుకుదామా? తమ జీవితంలో ఇంకొకరు వస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం పెళ్లి పేరు చెబితే భయపడిపోతూ ఉంటారు. ఏవేవో కారణాలు చెప్పి పెళ్లి నుండి తప్పించుకుంటూ ఉంటారు. ఇంకా కొందరికి అనుకున్న సమయానికి పెళ్లి జరగక ఓ సమస్యగా మారిపోతుంది.

Reasons why marriage is not passe yet in Telugu

ఇంకా కొంతమందికి పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం ఉండకపోవచ్చు. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహం విషయంలో తమ ప్రమేయం లేకుండా.. తల్లిదండ్రుల ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవడానికి ఇష్టం ఉండదు. మరి కొందరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలాంటి కారణాలతో పాటు మరికొన్ని విషయాల వల్ల పెళ్లి ఆలస్యమవుతుందట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అలాంటోళ్లు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!అలాంటోళ్లు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!

పవిత్ర బంధం..

పవిత్ర బంధం..

వివాహం అనేది ఇద్దరు కొత్త వ్యక్తులు ఊపిరి ఉన్నంత వరకు కలిసి ఉంటామనే చేసే వాగ్ధానం. అందుకే మన సమాజంలో వివాహ బంధాన్ని పవిత్ర బంధంగా పరిగణిస్తారు. మన దేశంలో ఇలాంటి వివాహానికి సంబంధించి దేవుని ఆశీర్వాదం ఉండాలని, అప్పుడే వివాహం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. వీటితో పాటు అనేక ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల నియమాల వల్ల కొందరు వ్యక్తుల వివాహం ఆలస్యం కావొచ్చు.

అంత ఈజీ కాదు..

అంత ఈజీ కాదు..

స్నేహం అనేది ప్రేమకు నాంది పలికే విషయం. చాలా మంది ప్రేమించడానికి తొలి మెట్టుగా స్నేహం ఉపయోగపడుతుందని చెబుతుంటారు. ఇలాంటి బంధం ఉంటే వివాహ బంధం చాలా బలంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే కొత్త వ్యక్తితో ఇలా స్వేచ్ఛగా కనెక్ట్ అవ్వడం అంత సులభం కాదు. వారిని పూర్తిగా విశ్వసించడం అంత తేలికైన పని కాదు. కానీ పెళ్లి అనే బంధంలో చేరాక మీకు ఇష్టం లేకపోయినా వారితో జీవితాంతం కలిసి అనివార్యంగా జీవించాల్సి ఉంటుంది. అందుకే కొత్త వ్యక్తులపై నమ్మకం కుదిరేంత వరకు వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఈ కారణంగా పెళ్లి ఆలస్యం కావొచ్చు.

కుటుంబాల గురించి..

కుటుంబాల గురించి..

మనలో ఒకప్పుడు పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పడన్నీ చూడకపోయినా.. కనీసం రెండు మూడు తరాల గురించి తెలుసుకుంటున్నారు. తమ పిల్లలకు పెళ్లి చేయాలనుకునే పెద్దలు తమ కుటుంబానికి వియ్యంకుల వారి కుటుంబం సరితూగుతుందా.. వారి ఆస్తి, పాస్తులు, కట్న కానుకలు ఇంకా ఏవేవో లెక్కలేసుకుంటూ ఉంటారు. దీని వల్లే తమకు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుందని భావిస్తారు. అంతేకాదు మంచి కుటుంబంలో తమ పిల్లలు సుదీర్ఘకాలం హాయిగా ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. ఇలాంటివన్నీ కుదరాలంటే కాస్త టైం పడుతుంది.

సెక్యూరిటీ..

సెక్యూరిటీ..

ఈరోజుల్లో అబ్బాయిలు పెళ్లి అంత ఈజీ కాదు. ముందుగా మగాడు ఏం చేస్తున్నాడు.. ఎంత సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉందనే వివరాలు ముందుగా అడుగుతున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ తమకు జీవితాంతం భద్రత మరియు బాధ్యతలు ఇస్తారో లేదోనని డౌట్ పడుతూ ఉంటారు. ఇక ఆర్థిక, ఉద్యోగ, ఆస్తిలో ఏ ఒక్కటి లేకున్నా ఆటోమేటిక్ వారి వివాహం ఆలస్యమవుతుంది.

అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

జాతకాలు కుదరకపోవడం..

జాతకాలు కుదరకపోవడం..

మన దేశంలో ఇద్దరు వ్యక్తుల వివాహ బంధం కుదరాలంటే ముందుగా జాతకాలు కలవాల్సిందే. పండితులు వధూవరుల జాతకాలను చూసి వారిరువురి మధ్య సాన్నిహిత్యం ఉంటుందా లేదా అనే విషయాలను అంచనా వేసి చెబుతారు. ఒకవేళ పెద్దలు కుదుర్చుకున్న సంబంధాల్లో జాతకాలు కలవకపోయినా వివాహాలు ఆలస్యమవుతాయి. అయితే కొందరు జాతకంలో ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసి ముందడుగు వేస్తారు.

కొన్ని భయాలు..

కొన్ని భయాలు..

పెళ్లికి ముందు చాలా మందికి ఏవేవో ఆలోచనలు ఉంటాయి. తాము పెళ్లి చేసుకునే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది. తను నన్ను సంతోషంగా ఉంచుతాడా లేదా అనే అనుమానం ఉంటుంది. ఇలాంటి విషయాలను వారి మాటలను బట్టి తెలుసుకుంటారు. వారి మాటల్లో ఏదైనా తేడా వస్తే కూడా వివాహం ఆలస్యమవుతుంది.

పెద్దలను కాదని..

పెద్దలను కాదని..

ఇప్పటి తరం అబ్బాయిలు, అమ్మాయిలు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. తమ లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటున్నారు. తమ మనసుకు నచ్చిన వారు దొరికేంత వరకు వెయిట్ చేస్తున్నారు. లేదంటే మ్యారేజ్ బ్రోకర్లు, మ్యాట్రిమోనీ, ఇతర సైట్లు, యాప్స్ ను సంప్రదిస్తున్నారు. ఈ కారణంగా కూడా పెళ్లి ఆలస్యమవుతోంది.

క్లారిటీ లేకపోవడం..

క్లారిటీ లేకపోవడం..

మరి కొందరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నా.. లేదా డేటింగ్ చేస్తున్నా.. వారికి పెళ్లి గురించి కొన్ని అనుమానాలుంటాయి. ‘మాకు పెళ్లవుతుందా?' ‘నన్ను మోసం చేసి వెళ్లిపోతారా' అనే సందేహాలు వేధిస్తూ ఉంటాయి. అంతేకాదు ‘నేను అందంగా లేను.. వారు నన్ను ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు కూడా వేధిస్తాయి. ఇలాంటి అపొహల వల్ల తమ పెళ్లిని ఆలస్యం చేసుకుంటూ ఉంటారు కొందరు యువత.

English summary

Reasons why marriage is not passe yet in Telugu

Here are the reasons why marriage is not passe yet in telugu. Have a look
Story first published:Thursday, June 17, 2021, 14:08 [IST]
Desktop Bottom Promotion