Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్త్రీలకు పడకగదిలో సుఖం లేకపోవడానికి కారణాలేంటి... వాటిని అధిగమించేందుకు గల మార్గాలేంటో చూసెయ్యండి..
అమ్మాయిలు పడకగదిలో సంతృప్తి పొందకపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి సంతృప్తి అనేది దక్కాలంటే చాలా కష్టం. అందులోనూ ఆ కార్యానికి సంబంధించిన పడకగదిలో సుఖం కావాలంటే.. అందరికీ అది సాధ్యం కాదు.

ఎందుకంటే రతి క్రీడల విషయంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు రకరకాల ఆలోచనలు, ఫ్యాంటసీలు, ఐడియాలు, అంచనాలు ఉంటాయి. అయితే మగవారైనా మరియు ఆడవారైనా.. ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే.

అయితే మీరిద్దరూ ఆ కార్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే దానిపై చాలా మందికి చాలా అపొహలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ అధ్యయనంలో ఆ కార్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా మంది అమ్మాయిలు శ్రుంగారంలో పాల్గొంటున్నప్పటికీ, ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అమ్మాయిలు తమ కలయికను ఆస్వాదించలేకపోవడానికి.. పడకగదిలో సంతృప్తి పొందలేకపోవడానికి గల కారణాలేంటో ఈ అధ్యయనంలో తేలిందట. ఈ నేపథ్యంలో అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అబ్బాయిలతో సమానంగా..
ఒకప్పటి రొమాన్స్ కు.. ప్రస్తుత తరం జంటలు చేసే రొమాన్స్ కు చాలా తేడా ఉంది. అప్పట్లో ఆ కార్యాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. దాని గురించి చాలా రహస్యంగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం వీటి గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆడ, మగ అనే తేడా లేకుండా సమానమనే భావన ఎక్కువవుతోంది. ఎందుకంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు తమ ఉద్యోగం లేదా వ్యాపారం ఇంకేదైనా రంగంలో ఉండే వారు వారి రంగంలో ఒత్తిడిని.. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేక బాగా ఇబ్బంది పడుతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు బెడ్ రూమ్ లో ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారట. ఇలాంటి వారికి భాగస్వామి నుండి పూర్తి మద్దతు, ప్రేమ లభిస్తే మాత్రం అలాంటి వాటి నుండి బయటపడొచ్చట.

ఆసక్తి లేకపోవడం..
ప్రస్తుత జీవనశైలి కూడా కొందరికి ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో జంటలిద్దరూ ఏకాంతంగా కాసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి, రొమాంటిక్ గా గడపడానికి పెద్దగా అవకాశం దొరకడం లేదు. దీంతో వారిలో డిప్రెషన్ పెరిగిపోయి.. ఆ కార్యంలో పాల్గొనడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎప్పుడైతే కపుల్స్ కలయికలో పాల్గొంటారో.. వారిలో కోరికలు ఎప్పుడు పెరుగుతాయో.. అప్పుడు వారిలో ఒత్తిడి తగ్గిపోయి.. ఆ కార్యాన్ని అందరి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.

పెయిన్స్ వస్తే..
కొందరికి కలయికలో పాల్గొన్నప్పుడు ఆ భాగంలో కొంత నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా తొలిసారి కలయికలో పాల్గొనే వారికి నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఈ కారణంగా కూడా వారు ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మంచి సెక్సాలజిస్టును సంప్రదించడం బెటర్.

బద్ధకం వల్ల..
మనలో చాలా మందికి బద్ధకం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇంట్లో నుండే పనులు చేస్తున్నారు. దీంతో చాలా మందికి బద్ధకం మరింత పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షకాలం, చలికాలంలో బద్ధకం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మీరు కలయికలో పాల్గొని, ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. మాత్రం బద్ధకాన్ని పక్కన పెట్టాల్సిందే. లేదంటే మీరు ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయలేరు.

మూడ్ లేకపోవడం..
చాలా మంది కపుల్స్ పడకగదిలో ఏకాంతంగా కలిసి గడిపేందుకు మరియు కలయికను ఆస్వాదించేందుకు ఇద్దరూ మానసికంగా సిద్ధమై ఉండాలి. మీరు ఇద్దరూ మూడ్ లో ఉన్నప్పుడే ఆ కార్యాన్ని ఆస్వాదించగలరు. ఇందుకోసం మీరు మీ భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయాలి. వారితో ప్రేమగా మాట్లాడటం వల్ల మీ ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గా సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే.. అమ్మాయిలతో పడకగదిలో ఆ కార్యంలో అద్భుతంగా ఆస్వాదించొచ్చు.



Click it and Unblock the Notifications