Latest Updates
-
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
బోర్ కొట్టినా, సుఖం లేకపోయినా భార్యలు భర్తలను మోసం చేస్తారు.. ఇంకా చాలానే రీజన్స్ ఉంటాయి
భర్తల విషయాన్ని వదిలేస్తే భార్యలు వేరొకరితో అఫైర్ నడిపించడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అసలు ఏ కారణాల వల్ల మహిళలు భర్తలను వదిలేసి ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు, పెట్టుకోవాలని అనుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా మోసం చేస్తారని ఒకప్పుడు అనుకునే వారు. భార్యభర్తల్లో భర్తలే ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని చెప్పుకునే వారు. కానీ ఈకాలంలో వివాహేతర సంబంధాల్లో స్త్రీ, పురుషులు ఇద్దరిదీ సమాన స్థాయి. భర్త భార్యను మోసం చేయడానికి, భార్య భర్తను మోసం చేయడానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. కారణాలు ఏవైనా జీవిత భాగస్వామితో కాకుండా వేరొక వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడం మాత్రం ఈమధ్యకాలంలో పెరిగిపోయింది.

భర్తల విషయాన్ని వదిలేస్తే భార్యలు వేరొకరితో అఫైర్ నడిపించడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అసలు ఏ కారణాల వల్ల మహిళలు భర్తలను వదిలేసి ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు, పెట్టుకోవాలని అనుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాన్నిహిత్యం లేకపోవడం:
ఒక స్త్రీ తనను మానసికంగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించినా, భాగస్వామి తనకు మద్దతు ఇవ్వడం లేదని అనుకున్నా వేరొక వ్యక్తి దగ్గర అలాంటి మానసిక మద్దతును వెతుక్కుంటుంది. అలా మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.

బోరింగ్, రొటీన్:
ప్రతి సంబంధంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. రొటీన్ లైఫ్ ఏమాత్రం నచ్చదు. సంబంధంలో ఉత్సాహం లేదని భావిస్తే స్త్రీలు కొత్త అనుభవాలను, కొత్త భాగస్వాములను వెతుక్కోవచ్చు. తను ఉన్న సంబంధంలో లేని ఉత్సాహాన్ని తిరిగి పొందడం కోసం మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. అలా తను కొత్త స్పార్క్ ను వెతుక్కోవచ్చు.

శారీరక అవసరాలు తీరకపోతే:
దాంపత్య సంబంధంలో శృంగారం అత్యంత కీలకం. శృంగారం గురించి ఆడవారికి, మగవారికి అనేక కోరికలు ఉంటాయి. అయితే దాంపత్య బంధంలో అవి నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కొందరు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఓపికగా ఎదురుచూస్తారు. మరికొందరు శారీరక అవసరాల కోసం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారు.

శ్రద్ధ లేకపోవడం:
ఒక స్త్రీ తన భాగస్వామి తనకు అవసరమైన శ్రద్ధ మరియు ఆప్యాయత ఇవ్వడం లేదని భావిస్తే ఆమె మరింత శ్రద్ధ గల మరియు ప్రతిస్పందించే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. తన భాగస్వామి ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడని లేదా అతను తన పట్ల ఆసక్తి చూపడం లేదని ఆమె భావించినప్పుడు ఇలా చేయవచ్చు.

ఆత్మగౌరవం లేకపోతే:
సంబంధంలో ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు పురుషులు తమ భార్యలను చులకన చేస్తుంటారు. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. ఇలాంటి సందర్భాల్లో వారు వేరొక వ్యక్తితో తనకు గౌరవం ఇచ్చే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు.

టెంప్టేషన్:
కొందరు స్త్రీలు తమకు సంబంధంలో అన్ని ఉన్నప్పటికీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు. దీనికి టెంప్టేషనే కారణం. అంటే తప్పు చేయడానికి, మోసం చేయడానికి అవకాశం ఉంటే వేరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటారు. వారికి ఆకర్షణీయంగా కనిపించినా, లేదా కొత్తగా ట్రై చేయాలని అనిపించినా, కొత్త అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉన్నా వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు.



Click it and Unblock the Notifications