Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పెద్ద వయసున్న మగాళ్లను మహిళలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా...
యంగ్ లేడీస్ ఎందుకని ఎక్కువ వయసు ఉండే మగాళ్లను కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఎవరితో రిలేషన్ ఉన్నా.. ప్రేమలో నిజాయితీ ఉన్నా.. వారి వయసు లేదా ఇతర అంశాలేవీ పెద్దగా బాధించవు. అయితే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా మంది అబ్బాయిలు తమ తక్కువ వయసు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటు ఉంటారు.

అయితే ఈ వయసు మధ్య అంతరం రెండు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. చాలా కామన్ గా జరిగిపోతూ ఉంటుంది. అయితే భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువగా ఉంటే సమాజం అంగీకరించడం మరియు కుటుంబం అంగీకరించడం చాలా కష్టం.

ఇటీవలి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వయసులో పెద్దగా తేడా కనిపించడం లేదు. ఇందుకు కారణం తాము జీవితాంతం కలిసి జీవించబోయే వ్యక్తి వయసు గురించి మగవారికి, ఆడవారికి, వారి పేరేంట్స్ ఓ క్లారిటీ ఉండటం ఓ కారణమే. కానీ కొందరి పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఏజ్ గ్యాప్ మరీ 10 నుండి 15 సంవత్సరాలకు తగ్గకుండా వయసు తేడా ఉంటోంది.

మరీ ముఖ్యంగా కొందరు మహిళలు తమ కంటే పెద్ద వారిని అంటే వయసు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రేమిస్తున్నారు.. కొందరైతే పెళ్లి కూడా చేసుకుటున్నారు. మహిళలు ఇలా పెద్ద వయసు ఉన్న పురుషులను ఎందుకని ఇష్టపడతారు.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తక్కువ ఇబ్బందులు..
తమ కంటే వయసు ఎక్కువగా ఉండే వారికి రిలేషన్ షిప్ మరియు లైఫ్ పై మంచి అవగాహన ఉంటుంది. ఈ రకమైన మగాళ్లు తమ అనుభవంతో జీవితంలోని సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. ఈ కారణంగా వీరు రిలేషన్ షిప్ లో ఏవైనా సమస్యలొస్తే.. అవి మరోసారి రాకుండా జాగ్రత్త పడతారు. అంతేకాదు అనవసరంగా కోపం కూడా తెచ్చుకోరు.

ఆర్థిక స్థిరత్వం..
ఈరోజుల్లో మహిళలు ఆర్థిక పరమైన విషయాల్లో స్వతంత్రంగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క అమ్మాయి కూడా తన భాగస్వామి ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఒకవేళ ఇది లేకపోయినప్పటికీ మంచి జాబ్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ ఏజ్ ఉండేవారు ఉద్యోగాల విషయంలో లేదా ఆర్థిక పరమైన స్థితిలో బలపడతారు. దీని వల్ల కుటుంబం మరియు వివాహం యొక్క భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు.

లైంగిక పరిపక్వత..
సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం, మహిళలు తమ కంటే పెద్ద వయసు వారిని, మరీ ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వారిని ఇష్టపడేందుకు ప్రధాన కారణం వారికి లైంగిక సాన్నిహిత్యం గురించి బాగా అనుభవం ఉండటం. అంతేకాదు రతి కార్యాల పట్ల మంచి అవగాహన ఉండటం, ఈ కారణంగా తమ శారీరక అవసరాలను తీర్చడం మరియు పడకగదిలో మంచి ఎలా నడుచుకోవాలో.. ఏ సందర్భంలో రతి మన్మథుడిలా రెచ్చిపోవాలో ఐడియా ఉండటం వల్ల తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ఎక్కువ కేరింగ్..
సాధారణంగా ప్రతి ఒక్క మహిళ ఎవరినుండైనా ప్రేమను, ప్రత్యేక శ్రద్ధ మరియు సంరక్షణ పొందాలని కోరుకుంటారు. అయితే అనుభవం ఉన్న మగవారికి ఇలాంటి వాటిలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు తమ వివాహ బంధాన్ని మరింత సులభతరం చేస్తారు. అంతేకాదు రిలేషన్ షిప్ లో పాల్గొన్న వ్యక్తులను ప్రత్యేకంగా భావించేలా చేస్తారు. వారికి మానసిక భద్రతను కూడా అందించగలరు.

ఏజ్ ఒక నెంబర్ మాత్రమే..
భార్యభర్తల మధ్య బంధం అనేది అసలు సమస్యే కాదని చాలా మంది జంటలు నిరూపించారు. ఎందుకంటే వయసు తేడా ఉన్నప్పటికీ.. ఇద్దరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసి సంతోషంగా గడుపుతూ.. ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకుంటే వయసు అనేది పెద్ద అడ్డంకి కానే కాదు.



Click it and Unblock the Notifications