For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్నర్ రెగ్యులర్ గా అబద్ధాలు చెబుతున్నారా? బహుశా ఇలాంటి కారణాల వల్లేనేమో...!

|

మనలో చాలా మంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. కొందరు అనివార్య పరిస్థితుల్లో అబద్ధం చెబితే.. మరికొందరు ఎవ్వరికీ నష్టం జరగకూడదనే అబద్ధాలు చెబుతూ ఉంటారు.

Reasons Why Your Partner Has Been Lying So Much Recently in Telugu

అయితే అవసరం ఉన్నా లేకున్నా ప్రతిసారీ అబద్ధం చెబితే మాత్రం చిక్కులు తప్పవు. అది ఎంత చిన్న అబద్ధమైనా.. ఎదుటివారికి మనపై నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.

Reasons Why Your Partner Has Been Lying So Much Recently in Telugu

ముఖ్యంగా వైవాహిక జీవితంలో తమ భాగస్వామి తమ మీద పెట్టుకున్న విశ్వాసం ఒక్క సెకనులో నాశనమయ్యేలా కూడా చేస్తుంది.

Reasons Why Your Partner Has Been Lying So Much Recently in Telugu

అయితే తమ పార్ట్నర్ తో ఏదో పెద్ద రహస్యాన్ని దాచాలని, తనను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో కాదు.. కేవలం పార్ట్నర్ ను హ్యాపీగా ఉంచాలనే కారణంతో కొందరు భర్తలు అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటారు. ఈ సందర్భంగా కొందరు భాగస్వాములు తరచుగా ఎలా ఎందుకు అబద్ధాలు చెబుతుంటారు.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లయినా తమ పార్ట్నర్ ను మోసం చేసేందుకు గల కారణాలివే...పెళ్లయినా తమ పార్ట్నర్ ను మోసం చేసేందుకు గల కారణాలివే...

5 నిమిషాల్లో వచ్చేస్తా..

5 నిమిషాల్లో వచ్చేస్తా..

మనలో చాలా మంది భర్తలు లేదా భార్యలు రెగ్యులర్ గా ఇలాంటి అబద్ధాలు చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఎన్ని గంటలకు వస్తున్నారని.. ఫోన్ చేసినా లేదా మెసెజ్ చేసినా.. ఐదంటే ఐదే నిమిషాల్లో నీ ముందు వాలిపోతా అని చెబుతుంటారు. కానీ ఏ రోజూ చెప్పిన సమయం కంటే ముందు ఇంటికి మాత్రం రారు.

మోసం చేసేందుకు..

మోసం చేసేందుకు..

ఇటీవలి కాలంలో మీ జీవిత భాగస్వామి మీతో చాలా అబద్ధాలు చెబుతుంటే, వారు బహుశా మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. వారికి మీపై ఆసక్తి తగిపోయి.. ఇతరులపై మోజు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. మీ భాగస్వామి మీకు దూరంగా ఉండటం.. రెగ్యులర్ గా అబద్ధాలు చెప్పడం వంటివి చేస్తుంటే ఇది నిజం కావొచ్చు.

ఈ 5 రాశుల వారిని పెళ్లి చేసుకోవడం మంచిదే... ఎందుకో తెలుసా?ఇందులో మీ రాశి ఉందా?ఈ 5 రాశుల వారిని పెళ్లి చేసుకోవడం మంచిదే... ఎందుకో తెలుసా?ఇందులో మీ రాశి ఉందా?

ఆర్థిక రహస్యాలు..

ఆర్థిక రహస్యాలు..

మీ భాగస్వామి మీ నుండి ఆర్థిక సమస్యలను దాచడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే వారు ఆర్థిక పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందుతూ ఉండొచ్చు. అయితే మీరు అలా ఆందోళన పడాలని వారు కోరుకోరు. వారు అప్పుగా తీసుకున్న డబ్బు లేదా జూదం అలవాట్లను మీరు కనుగొంటే, మీరు కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణం కూడా కావొచ్చు.

సొంత సమస్య..

సొంత సమస్య..

మీ భాగస్వామి గురించి మీరు తెలుసుకోవాలనుకునే విషయాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిలో చెడు వ్యాపారం, కుటుంబ సమస్యలు మరియు మీరు భాగస్వామ్యం చేయని అనేక ఇతర సమస్యలు ఉండొచ్చు. అందుకే మీతో తరచుగా మీతో అబద్ధం చెప్పొచ్చు. ఎందుకంటే తను సొంత సమస్యగా ఫీలవుతుంటారు. అంతేకాదు అలాంటి సమయంలో భాగస్వామిపై చిరాకు పడతారు.

ఎవ్వరినీ చూడటం లేదు..

ఎవ్వరినీ చూడటం లేదు..

మనలో ఈ ఇంగ్లీష్ సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ‘మెన్ విల్ బి మెన్' ఒక మగాడు తన భార్యను ఎంతలా లవ్ చేసినా.. ఇతర అమ్మాయిలెవరైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే చాలు వారిని అదే పని చూస్తుంటారు. ఆ సమయంలో తమ భాగస్వామి గమనిస్తుంటే.. వారు అడగకపోయినా సరే.. ‘నేను ఎవ్వరినీ చూడటం లేదు.. ముఖ్యంగా ఆ అమ్మాయిని అస్సలు చూడటం లేదు'అని బుకాయిస్తుంటారు.

నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి..

నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి..

చిన్న మరియు అరుదైన అబద్ధాలు కూడా అపనమ్మకం మరియు ఇతర సంబంధాల సమస్యలను కలిగిస్తాయి. మీ భాగస్వామి నిరంతరం మీకు అబద్ధాలు చెబితే, అది నమ్మకంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. వారు ఎంత ఎక్కువ అబద్ధాలు చెబితే అంతగా మీరు వాటిని నమ్ముతారు. ఇది సంబంధంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకని వీలైనంత వరకు సంబంధాలకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పేందుకు ప్రయత్నించండి. మీ సంసారాన్ని సంతోషంగా కొనసాగించండి.

English summary

Reasons Why Your Partner Has Been Lying So Much Recently in Telugu

Here are the Reasons why your partner has been lying so much recently in Telugu. Read on,
Story first published:Thursday, May 12, 2022, 17:25 [IST]
Desktop Bottom Promotion