Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
దంపతులకు ఒకేరకమైన లక్ష్యాలు, కోరికలు ఉంటే, ఆ బంధం సూపర్ హిట్ అవుతుంది
సంబంధాన్ని దీర్ఘకాలం పాటు సంతోషంగా, ఆనందంగా కొనసాగించడంలో కొన్ని ప్రాథమిక లక్ష్యాలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంపతుల మధ్య ప్రేమ ఉంటే చాలని ఆ బంధం విజయవంతం అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన సంబంధాలకు ప్రేమ, నిబద్ధత రెండూ చాలా అవసరం. దంపతులు ఇద్దరికి ఒకేరకమైన కోరికలు, ఆశలు, లక్ష్యాలు ఉంటే ఆ సంబంధం దీర్ఘకాలం కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ కోరికలు, లక్ష్యాలు నెరవేర్చుకునే దిశలో దంపతులు ఇద్దరూ అడుగులు వేస్తారు. ఈ ప్రయాణం వారిని లక్ష్యాలు చేరుకునేలా చేయడంతో పాటు వారి మధ్య బంధాన్ని, సాన్నిహిత్యాన్ని బలోపేతం చేస్తుంది.

అందుకే దాంపత్య బంధంలో ఆలుమగలకు ఒకేరకమైన లక్ష్యాలు ఉండటం చాలా అవసరమని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
సంబంధాన్ని దీర్ఘకాలం పాటు సంతోషంగా, ఆనందంగా కొనసాగించడంలో కొన్ని ప్రాథమిక లక్ష్యాలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీకేది కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కోవడం
దంపతుల మధ్య కొన్ని కామన్ అలవాట్లు ఉంటే అవి ఆ బంధాన్ని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లడం, సాయంత్రం వాకింగ్, వీకెండ్స్‌లో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి దంపతుల మధ్య బంధాన్ని పెంచుతాయి.

2. శృంగారం విషయంలో..
దంపతుల మధ్య శృంగారం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. దాని నుండి ఏం ఆశిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారో పార్ట్‌నర్‌కు చెప్పడం కూడా చాలా ముఖ్యం. దంపతులు ఇద్దరి మధ్య శృంగారం సంబంధిత కమ్యూనికేషన్ తప్పక ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
వారానికి ఎన్ని సార్లు శృంగారం కావాలనుకుంటున్నారో ఒకరు మరొకరికి కచ్చితంగా చెప్పి తీరాలి. ఇలాంటి సన్నిహిత చర్యల గురించి అసంతృప్తి, అపోహలు, అవమానాలు లేకుండా చూసుకోవాలి.

3. వ్యక్తిగత లక్ష్యాల సాధనలో సాయం
వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో దంపతులు ఇద్దరికీ ఒకే రకమైన లక్ష్యాలు ఉండాల్సిన అవసరం లేదు. భాగస్వామి వారి లక్ష్యం గురించి కష్టపడుతుంటే వారికి సాయం చేయడం వల్ల వారి ఆనందానికి మీరు కారణం కావొచ్చు. ఒకరికొకరు సాయం చేసుకోవడమే నిజమైన బంధానికి ప్రతీక.

4. స్పష్టమైన బౌండరీలు ఉండటం
ఎలాంటి సంబంధంలో అయినా కొన్ని సరిహద్దులు ఉండాలి. అది దాంపత్య బంధం అయినా సరే వ్యక్తిగత పరిమితి పాటించి తీరాలి. పూర్తిగా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడానికి ఎదుటివారి అనుమతి తప్పక అడగాలి. ఏ సంబంధంలో అయినా లిమిట్ అనేది పాటించాల్సిన ఒక నియమం.

5. ఆర్థిక లక్ష్యాల గురించి స్పష్టంగా చెప్పాలి
డబ్బు ఏ సంబంధంలో అయినా చిచ్చు పెట్టగలదు. కాబట్టి ఆర్థిక విషయాల గురించి దంపతులు ఇద్దరు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక లక్ష్యాల గురించి ఒకరికొకరు స్పష్టంగా, అర్థమయ్యేలా చెప్పాలి. దంపతులకు కూడా వ్యక్తిగత ఖాతాలు, పొదుపు తప్పనిసరిగా ఉండాలి.



Click it and Unblock the Notifications