Latest Updates
-
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి! -
అక్షయ తృతీయ ఏప్రిల్ 19నా? 20నా? పూజకు, గోల్డ్ షాపింగ్ ముహూర్తాలు ఇవిగో! -
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు: తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారా?
ఇవి అలవాటు చేసుకుంటే.. పార్ట్నర్ తో ప్రతిరోజూ పండగే..!
Relationship Tips: వివాహం లేదా ప్రేమ.. రెండింటిలో ఏ బంధం మొదలైనా.. ప్రారంభంలో అంతా ఆనందంగా ఉంటుంది. కానీ అలాంటి సంతోషం కాలం మారుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది.
ముఖ్యంగా హనీమూన్ పూర్తయిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడే ఆలుమగల మధ్య చిన్నగా గొడవలు, అలకలు, బుజ్జగింపులు పెరిగిపోతూ ఉంటాయి. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఇవి మరింత దూరం పెరిగేలా చేస్తుంటాయి.

కానీ ఎన్ని గొడవలు జరిగినా.. ఎంత చిరాకుగా ఉన్నా మీ భాగస్వామితో బంధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలంటే కొన్ని పనులు చేయాలి. ఎందుకంటే అనుబంధం అనేది ఒక అందమైన ఇల్లు లాంటిది. మీ ఇద్దరి మధ్య కలహాలు అనేవి ఇంట్లోని ఓ చిన్న లైటు లాంటివి.. బల్బు పాడైపోతే కొత్తది ఎలా అయితె తెచ్చిపెట్టుకుంటాం.

అంతేకానీ అందమైన ఇంటిని మాత్రం అస్సలు మార్చం కదా.. అలాగే రిలేషన్ షిప్ లో కూడా ఏమైనా బాధకరమైన సంఘటనలు, గొడవలు, అలకలు వచ్చినప్పుడు వాటి నుండి బయటపడే మార్గాలను వెతుక్కోవాలి. అప్పుడే ప్రారంభంలో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కంటే.. చివరి వరకూ ఆ ప్రేమను కొనసాగించడం ద్వారా మీ ఇద్దరి మధ్య అనుబంధం అనునిత్యం బలంగా, విడదీయరానిదిగా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక సంబంధాలను అనుభవించాలంటే కొన్ని అలవాట్లను చేసుకోవాలి. వాటికి కొంత సమయం పడుతుంది. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామితో మీరు ప్రతిరోజూ పండుగ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మీ రిలేషన్ షిప్ లో ఎలాంటి అలవాట్లు చేసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భావోద్వేగాలు దాచుకోవద్దు..
సంబంధం చాలా కాలం పాటు సంతోషంగా కొనసాగాలంటే, భాగస్వాములిద్దరూ సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోవాలి. వారు తమలో తాము ఎటువంటి భావోద్వేగాలను దాచుకోకూడదు. ఎందుకంటే కాలక్రమేణా ఈ భావాలు భరించలేనివిగా మారతాయి. దీర్ఘ-కాల సంబంధాలను కోరుకునే జంటలు తమ భావాలను ఒకరికొకరు ఎల్లప్పుడూ తెలియజేయడం అనేది చాలా ముఖ్యం.

సంఘర్షణ మరియు తీర్మానాలు
ఏ రిలేషన్ షిప్ లో అయినా గొడవలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. దీర్ఘకాలిక సంబంధంలో ఉండేవారు గొడవలను కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక జంట తమ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు అనేది ముఖ్యం. పరిపక్వత మరియు అవగాహనతో సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. అందువల్ల, మీ భాగస్వామి దంపతులిద్దరూ ఎల్లప్పుడూ ఒకరు చెప్పేది మరొకరు కచ్చితంగా వినండి. అదే సమయంలో మీ మధ్య జరిగిన గొడవలను బయటకు చెప్పకండి. దీని వల్ల మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లే అవకాశం పెరగొచ్చు.

మారుతున్న కాలంలో..
దీర్ఘకాల సంబంధాలలో ఉన్న జంటలు బహిరంగ చేతులతో మార్పును స్వీకరిస్తారు. సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడానికి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం చాలా ముఖ్యం అని వారికి తెలుసు. అదే సమయంలో మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరి మధ్య దూరం ఎలా తొలగిపోతుందనేది చూడాలి కానీ.. దూరం చేసే కోపాన్ని పెంచుకోకూడదు. వీలైతే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక అడుగు వెనుకేయండి. అప్పుడే మీ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి..
భార్యభర్తల సంబంధంలో ఆర్థిక పరమైన విషయాలు అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి. భార్యాభర్తల మధ్య ఆర్థిక పరిస్థితి కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయి. సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవడానికి డబ్బు అవసరం. కాబట్టి, వాటి గురించి గొడవ పడటం చాలా వికారంగా ఉంటుంది. సంబంధంలో నిజాయితీకి దారి తీస్తుంది. కాబట్టి ఇలా సందర్భాలలో గతం గురించి గుర్తు చేసుకోవడం అనవసరం. కాబట్టి ఇక దాని గురించి మరచిపోయే ప్రయత్నం చేయండి. నీ వల్లే నష్టం వచ్చింది.. కాదు నీ వల్లే వచ్చిందంటూ గొడవను పెద్దది చేయడం వంటి వాటిని మానుకోండి.

ఇలాంటివి రెగ్యులర్ గా చేయండి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది జంటలు తాము ఆనందంగా గడిపిన క్షణాలను, నవ్వుకునే సందర్భాలను తమ కెమెరా, ఫోన్లలో బందించడం మాత్రం ఎప్పటికీ మరచిపోరు. ఇలాంటివి చూసినప్పుడు ఒకరికొకరు మంచి అనుభూతిని కచ్చితంగా పొందుతారు. అంతేకాదు వీటి ద్వారా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అప్పుడే మీకు సంతోషాన్ని కలిగించవలసిన అవసరాన్ని వారు అర్థం చేసుకుంటారు.

వారంలో ఎన్నిసార్లంటే..
భార్యభర్తల బంధాన్ని బలంగా మార్చడంలో.. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేసేది కేవలం ఒక్క రొమాన్స్ మాత్రమే. కాబట్టి వారంలో కనీసం రెండు మూడు సార్లయినా కలయికలో పాల్గొనండి. ఎప్పుడూ ఒకేలా పాల్గొనకుండా, విభిన్నమైన భంగిమలను ప్రయత్నించండి. మీకు ఏవీ గుర్తు రాకపోతే.. ఆన్ లైనులో అన్వేషించండి. ముఖ్యంగా మస్త్ రామ్ వంటి వాటిని చూడండి. మీలో ఉప్పొంగే ఉత్సాహం ఉరకలేస్తుంది.



Click it and Unblock the Notifications











