Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ట్రెండింగ్! కోహ్లీ-అనుష్కశర్మకు పుట్టబోయేది పండంటి పాపాయేనంట...!
విరాట్, అనుష్కలకు పుట్టేది పండంటి పాపాయేనట... అది ఎలా తెలిసిందంటే...
టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల భామ అనుష్కశర్మ త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సంతోషకరమైన సమయంలో ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి కోహ్లీ చిన్న వేడుక కూడా చేసుకున్నారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయిన విషయం విధితమే.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు కలగబోయే సంతానం గురించి రకరకాల మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వచ్చేశాయ్. అబ్బో.. లాక్ డౌన్ టైమ్ లో కోహ్లీ బ్యాటింగు అదిరిపోయిందిగా అని ఒకరు.. లాక్ డౌన్ రిజల్ట్ అని మరొకరు.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జంట కూడా తమకు బిడ్డ పుట్టబోతున్నది అని చేసిన ప్రకటనతో పోలుస్తూ ఇంకొకరు.. ఇంకా కొందరైతే ప్రియాంక చోప్రాను ఉద్దేశించి మరి నువ్వెప్పుడు చెబుతావ్ అంటూ తెగ కామెంట్లు చేశారు. అంతేకాదు ఇన్నిరోజులు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్ ఖాన్ సోషల్ మీడియాలో పాపులర్ గా ఉండేవాడని.. ఇక విరుష్కకు పుట్టబోయే బిడ్డతో ఆ పాపులారిటీ కాస్త ఖతం అవుతుందని, ఇలా ఎవరికిష్టమొచ్చినట్టు వారు రకరకాలుగా స్పందిస్తూనే ఉన్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే... తాజాగా విరుష్క జంటకు పుట్టబోయేది పండంటి పాపాయా లేక పిల్లాడా అనే విషయాన్ని కూడా కన్ఫార్మ్ చేశారట ప్రముఖ శాస్త్రవేత్త. అంతేకాదు ఇది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో అభిమానులు.. నెటిజన్లు మళ్లీ తమదైన శైలిలో కామెంట్లు చేయడం మొదలెట్టారు. అది కూడా పండంటి పాపాయి పుడుతుందని చెప్పిన ఆ జ్యోతిష్యుడి మాటలను వైరల్ చేసేస్తున్నారు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు? అతను చెప్పింది అక్షరాల నిజమవుతుందా? లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ట్రెండింగ్
ఇండియన్ మీడియా.. సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ కపుల్ గా నిలిచారు విరుష్క జంట. వీరి సంతానం ఇంకా పుట్టకముందే.. అనుష్క గర్భం దశలోనే ఉన్నప్పటికీ ఇంత పాపులారిటీని సంపాదించిన శిశువు మరొకరు ఉండరేమో...

మేఘాల్లో తేలిపోయాడట..
ఈ విషయం గురించి కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే తాను మేఘాల్లో తేలిపోయానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో అనుష్కతో కలిసి ఎలా గడిపాననే విషయాలను గుర్తు చేసుకున్నాడు.

‘అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ వార్తను అందరితో పంచుకున్న తర్వాత అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేను. మాపై మీరు చూపే ప్రేమ వెలకట్టలేనిదన్నాడు. తమ మధ్యలోకి మూడో వ్యక్తి రాక కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

అభిమానుల అత్యుత్సాహం..
అయితే వీరి జీవితంలోకి కొడుకు రాబోతున్నాడా? లేదా కూతురు అడుగు పెడుతుందా? అని అభిమానులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. వీరికి ఎవరు పుడతారనే విషయం తెలుసుకోవాలని తహతహ లాడుతున్నారు.

ఓ ప్రముఖ జ్యోతిష్యుడు..
ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు.. వారి జాతకం ప్రకారం వారికి ఎవరు పుడతారనే విషయంపై స్పష్టత ఇచ్చారు. వారి జాతకం ప్రకారం వారికి పండంటి పాపాయి ఎక్కువగా పుట్టే అవకాశం ఉందని చెప్పేశాడు.

దేవుడి ప్రసాదంగా..
అయితే వీరి జంటకు కొడుకు పుట్టినా.. కూతురు పుట్టినా.. దేవుడి ప్రసాదంగానే భావించాలని పండితులు చెప్పారు. ఆ జ్యోతిష్యుని పేరు పండిట్ జగన్నాథ్. ఈయన తెలిపిన వివరాల మేరకు వీరికి కచ్చితంగా ఆడపిల్ల పుట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈయన గత పాతికేళ్లుగా ఇదే రంగంలో ఉన్నారు.

దుబాయ్ లో విరుష్క..
ఇదిలా ఉండగా.. కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 19వ తేదీ నుండి ఈ టోర్నీ ప్రారంభం కాబోతుంది.

మూడేళ్ల క్రితం..
అనుష్కశర్మ, విరాట్ కోహ్లీలు 2017 డిసెంబరు నెలలో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల తర్వాత తమకు పుట్టబోయే బిడ్డ గురించి అభిమానులకు శుభవార్త చెప్పారు.



Click it and Unblock the Notifications