For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! ఎనిమిదేళ్ల కాపురం తర్వాత ఆమె అతడని తేలింది..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...

|

ఆలుమగల దాంపత్య జీవితానికి ఆదర్శంగా ఉండేది ఆ జంట. అందుకే ఆ జంట ఎనిమిదేళ్ల పాటు ఎంతో హాయిగా.. సంతోషంగా గడిపింది. అయితే ఆ తర్వాతే వారిద్దరి మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ మొదలైంది.

సాధారణంగా ఏ జంట అయినా పెళ్లి తర్వాత ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక విషయానికి సంబంధించి ఘర్షణ పడటం సాధారణమే. అయితే వారు పగలు ఎంత గొడవపడినా.. చీకటిపడేలోపు ఇద్దరూ సర్దుకుపోతుంటారు.

అయితే కొంతమంది జంటలు మాత్రం తీవ్రంగా గొడవ పడతారు. అది ఎంతలా అంటే ఇద్దరి చనిపోయేంతలా.. అలా ఆ జంట కూడా పంతానికి పోయింది. భర్త అన్న మాటలను తట్టుకోలేక ఆ భార్య అతని కళ్లెదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే తన భార్యను కాపాడే ప్రయత్నం చేసిన ఆ భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భార్య చనిపోయిన నాలుగు రోజుల తర్వాతే ఆ భర్త కూడా చనిపోయాడు. దీంతో వారి బిడ్డ అనాథగా మిగిలాడు. ఇదిలా ఉండగా అతని భార్యకు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆమె మహిళ కాదు, మగాడని తెలిసి అవాక్కయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆరా తీయగా అసలు విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇదంతా ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఎక్కడ.. ఎప్పుడు జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారట...! మీ రాశి ఉందేమో చూడండి...ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారట...! మీ రాశి ఉందేమో చూడండి...

2012లో పెళ్లి..

2012లో పెళ్లి..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహరోలో 2012లో వారిద్దరూ పంచభూతాల సాక్షిగా.. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి అనే తంతుతో ఒక్కటయ్యారు. రెండు సంవత్సరాల తర్వాత ఓ బిడ్డను కూడా దత్తత తీసుకుని పెంచుకోవడం ప్రారంభించారు. అలా ఎనిమిదేళ్ల వరకు వీరి కాపురం ఎలాంటి కలహాలు లేకుండా సాఫీగా సాగింది.

ఇటీవలే గొడవలు..

ఇటీవలే గొడవలు..

ఎనిమిదేళ్లు అంతా బాగానే జరిగినా.. ఇటీవలే ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య ఆగస్టు నెలలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని తన తనువు చాలించింది. ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన తన భర్తకు కూడా ఆ మంటలు అంటుకోవడంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి.

భర్త మరణం..

భర్త మరణం..

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే భర్త కూడా చనిపోయాడు. అయితే వీరిని శవపరీక్ష చేసిన వైద్యాధికారులు అవాక్కయ్యారు. ఈ రిపోర్టును చూసిన పోలీసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...

ఆమె కాదు అతడు..

ఆమె కాదు అతడు..

అతడి భార్య ఆమె కాదు.. అతడని తేలింది. ఈ రిపోర్టు నిజమా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబసభ్యులను విచారించారు. అయితే మొదట్లో నిజం చెప్పేందుకు తటాపటాయించారు కుటుంబసభ్యులు. ఈ నేపథ్యంలో భర్త సోదరుడు పోలీసులకు అసలు విషయం చెప్పేశారు.

సమాజం అంగీకరించదని..

సమాజం అంగీకరించదని..

వాస్తవానికి వారిద్దరూ స్వలింగ సంపర్కులని, వారి వివాహాన్ని మన సమాజం ఒప్పుకోదనే ఉద్దేశ్యంతో ఒకరు మహిళగా వేషం మార్చుకుని భార్యభర్తల్లాగా జీవించడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఆమెను భార్యగానే చూసేవారు. అయితే చివరికి పోస్టుమార్టం రిపోర్టు వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇండోనేషియాలో కూడా..

ఇండోనేషియాలో కూడా..

అయితే దీనికంటే ముందే ఇండోనేషియాలో కూడా ఓ వ్యక్తి 25 ఏళ్ల యువతిని ఫేస్ బుక్ లో చూసి స్నేహం చూశాడు. అది కాస్త ప్రేమగా మారడంతో, వారిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజే అసలు విషయం బయటపడింది. తాను పెళ్లి చేసుకున్నది యువతిని కాదు.. యువకుడినని..

శోభనం గదిలో భార్య మగాడిగా మారిపోతే... వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం...!శోభనం గదిలో భార్య మగాడిగా మారిపోతే... వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం...!

బెంగాల్ లోనూ..

బెంగాల్ లోనూ..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్ భూమ్ లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ.. ఓ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగి పదేళ్లు కూడా పూర్తయ్యాయి. అయితే, ఆమెకు చికిత్స చేసిన వైద్యులు కూడా ఆమె మగాడని తేలడంతో షాక్ తిన్నారు. అంతేకాదు ఆమె సోదరీ సైతం మగడానే తేలింది. అక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. వైద్య పరీక్షలు జరిగేంత వరకు వారు మగాళ్లమని వారికి కూడా తెలియదట.

తస్మాత్ జాగ్రత్త..

తస్మాత్ జాగ్రత్త..

చూశారు కదా కలికాలంలో ఎన్నో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరు కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇలాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త...

English summary

Same-sex couple lived as heterosexuals for 8 years reveals autopsy

Here we talking about same sex couple lived as heterosexuals for 8 years reveals autopsy. Read on