For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో!పెళ్లయ్యాక అతనికి 47 మంది పిల్లలని తెలిసిందట... ఆ తర్వాత ఏమి జరిగిందంటే...

|

ప్రస్తుత తరం వారిలో చాలా మంది పెళ్లికి ముందు డేటింగులో ఉంటున్నారు. చాలా కాలం కలిసి జర్నీ చేసిన తర్వాత వారి బంధం బలపడుతుందని భావిస్తే పెళ్లి దాకా వెళ్తున్నారు.

లేకపోతే మధ్యలోనే తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పేస్తున్నారు. అయితే పెళ్లికి ముందు ప్రతి ఒక్కరికీ రిలేషన్ కు సంబంధించి ఏవో కొన్ని మరచిపోలేని విషయాలు లేదా విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి.

ఓ వివాహిత మహిళకు కూడా అలాగే జరిగింది. తన ప్రియుడితో జీవితాంతం హాయిగా ఉండొచ్చని ఆశించిన ఆమెకు.. పెళ్లయిన తర్వాత భర్త షాకింగ్ మ్యాటర్ చెప్పాడు. దీంతో ఆమె విడాకులు తీసుకోవాలనుకుంటుందట.. ఇంతకీ తను ఆమెకు ఏమి చెప్పాడు.. ఆమె ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంది.. అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Kissing Day: ఇలా కిస్ చేస్తే కిక్ గ్యారంటీ... మీరూ ఓసారి ట్రై చేయండి...!

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

తన ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా గడపొచ్చని ఎన్నెన్నో కలలు కంది. భవిష్యత్తు గురించి ఏవేవో ఊహించుకుంది. అయితే పెళ్లి తర్వాత తన భర్త చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాకైంది. ఇంతకీ ఆమెను అంతలా బాధించిన విషయం ఏంటంటే.. తన భర్తకు 47 మంది పిల్లలని చెప్పడం..

తన తప్పు లేదట..

తన తప్పు లేదట..

వామ్మో.. తను అంతమంది పిల్లలకు ఎలా జన్మనిచ్చాడు. ఇంతకీ తనకు ఎంత మంది భార్యలు ఉన్నారు.. లేదా తను ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఏమైనా కంటిన్యూ చేస్తున్నాడా? అనే సందేహం అందరిలాగే ఆమెకు వచ్చింది. అయితే అందులో తన తప్పు లేదట..

మహిళల కోరిక..

మహిళల కోరిక..

తను చేసిన ఆ పనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే అతను సంతానం కోసం పరితపిస్తున్న మహిళల కోరిక మాత్రమే తీర్చాడు. ముఖ్యంగా తన వీర్యాన్ని దానం ఇచ్చి అంతమంది పిల్లలకు తండ్రిగా మారిపోయాడట. అయితే ఇదే విషయాన్ని తన భార్య జీర్ణించుకోలేకపోతోంది.

తనువు దాహం తీర్చుకోవాలంటే.. తగ్గాల్సిందేనా...!

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఆమె తన భర్తకు సంబంధించిన సంఘటన గురించి ఇటీవలే సోషల్ మీడియాలతో సైతం షేర్ చేసుకుంది. తన భర్త 47 మంది పిల్లలకు తండ్రిగా మారిపోయాడని.. ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని పోస్టు పెట్టింది.

భవిష్యత్తులో..

భవిష్యత్తులో..

ఆ పోస్టులో ఇలా పేర్కొంది. ‘నా భర్త వీర్యం దానం చేయడంలో ఎలాంటి తప్పు లేదని నేను ఒప్పుకుంటాను. అయితే భవిష్యత్తులో ఆ పిల్లలంతా ‘నువ్వే మా నాన్న' అని మా ఇంటికొస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడుతోంది. ఇలాంటి సమయంలో తనతో కలిసి లైఫ్ కంటిన్యూ చేయాలా? లేదా విడిపోవాలా అనే విషయంపై ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను' అని వివరించింది. దీనిపై స్నేహితులు, బంధువుల అభిప్రాయాన్ని సైతం కోరింది.

ముందు చెప్పలేదు..

ముందు చెప్పలేదు..

‘మాకు వివాహం జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. మా ఇద్దరికీ ఓ బేబీ కూడా ఉన్నాడు. మేమిద్దరం కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశాం. అయితే పెళ్లికి ముందు తను వీర్య దాత అని చెప్పలేదు. ఈ విషయాన్ని పెళ్లి తర్వాతే చెప్పాడు. అంతేకాదు ఎంతమందికి వీర్యదానం చేశాడనే విషయాన్ని చెప్పలేదు.

పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...

ఇటీవలే..

ఇటీవలే..

అప్పుడు ఆ నెంబరు తెలీదు కాబట్టి.. ఇక నుండి వీర్యదానం చేయకు అని చెప్పాను. కానీ ఇటీవల ఏదో మాటల్లో పడి వీర్యదానం ఎంతమందికి చేశావని అడిగితే.. ఏకంగా 47 మందికి అని చెప్పాడు. అంతే నాకు ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది' అని ఆమె వివరించింది.

ఏం అర్థం కావడం లేదు..

ఏం అర్థం కావడం లేదు..

‘తన సమాధానం వినగానే.. పెళ్లికి ఈ విషయం తెలిసి ఉంటే.. ఇప్పడు ఇంతలా బాధపడాల్సి వచ్చేది కాదు.. ఎందుకంటే ఫ్యూచర్లో డిఎన్ఏ ద్వారా ఆ పిల్లలు తనే మా తండ్రి అని ఇంటికొస్తే.. మా జీవితంలోకి వస్తే.. ఏం చేయాలి. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలా? లేక కలిసి ఉండాలా' అని ప్రశ్నించింది.

నెటిజన్ల సలహా..

నెటిజన్ల సలహా..

ఆమె పోస్టును చదివిన నెటిజన్లు తన భర్తను తప్పుపట్టాల్సిన అవసరం లేదని.. అతను వీర్యదానం మాత్రమే చేశాడు. అంతేగానీ ఎవరితోనూ నేరుగా ఆ కార్యంలో పాల్గొనలేదు. అతను ఇతరులకు మంచే చేశాడు. కాబట్టి.. అది మీ ఫ్యామిలీని ఎప్పటికీ కాపాడుతుంది.

ధైర్యంగా ఉండండి..

ధైర్యంగా ఉండండి..

అయితే వీర్యదానం చేసినప్పుడే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల మీకు భవిష్యత్తులో దాతలకు ఆ పిల్లల నుండి ఎలాంటి సమ్యలు రావు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అందుకే మీరు ఒక మంచి వ్యక్తిని వదులుకోవద్దు అని నెటిజన్లు సలహా ఇచ్చారు.

English summary

She wants to divorce her husband after she knows he has 47 kids

Here we are talking about the she wants to divorce her husband after she knows he has 47 kids. Have a look
Story first published: Tuesday, July 6, 2021, 15:35 [IST]