For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shikhar Dhawan Divorce;భార్యకు విడాకులిచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్.. 9 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు..

|

టీమిండియా స్టార్ ఓపెనర్, ఇటీవల సారథిగా పగ్గాలు చేపట్టి సక్సెస్ అయిన శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో వివాహ బంధానికి వీడ్కోలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

దీంతో తొమ్మిదేళ్ల వీరి వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. అప్పటికే అయేషాకు పెళ్లి జరిగి పిల్లలు ఉన్నా.. ఇద్దరి మధ్య పదేళ్లు వయసు తేడా ఉన్నప్పటికీ.. తనను ప్రేమించి.. పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్ తాజాగా ఆమెతో రిలేషన్ షిప్ కట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే గబ్బర్ మాత్రం ఇంకా స్పందించలేదు.

వీరిద్దరూ 2012 సంవత్సరంలో అక్టోబర్ నెలలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. అయితే అయేషాకు అంతకుముందు ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అయేషా చిన్నతనంలో అంటే ఎనిమిదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ కిక్ బాక్సర్ గా ఎదిగింది. అక్కడే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోగా.. వారి వివాహ బంధానికి కొద్ది కాలంలోనే తెరపడింది. అప్పుడు కామన్ ఫ్రెండ్ గా ధావన్, ఆయేషా కలిశారు.

ఇద్దరి మధ్య పదేళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ.. ఆమెని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు గబ్బర్. వీరి వివాహం తర్వాత ఈ జంటకు 2014 సంవత్సరంలో జోరావర్ పుట్టాడు. ఆ తర్వాత కూడా వీరంతా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించేవారు. అయితే సడెన్ గా ఏం జరిగిందో తెలీదు కానీ.. తాము విడిపోతున్నట్టు అయేషా అధికారికరంగా ప్రకటించింది. శిఖర్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఐపీఎల్ ఆడేందుకు UAE వెళ్లిన గబ్బర్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. 'రెండు సార్లు విడాకులు తీసుకునేంత వరకూ విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించింది' అని అయేషా తన పోస్టులో పేర్కొనడం గమనార్హం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చాలా మంది తమ వివాహ జీవితానికి ఎందుకని వీడ్కోలు చెబుతారు. విడాకుల పేరిట ఎందుకు విడిపోతారు.. అందుకు గల సాధారణ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Signs He Likes You :మీ ప్రియుడు మీ మనసును ఇష్టపడుతున్నాడా? లేదా మీ బాడీనా?

బ్రేకప్ ఆలోచనలు..

బ్రేకప్ ఆలోచనలు..

ఒకప్పుడు భార్యభర్తల బంధం అంటే.. జీవితాంతం బలంగా ఉండేవి. ఆలుమగలిద్దరూ కలకాలం ఆనందంగా జీవించేవారు. అయితే ప్రస్తుతం భార్యభర్తలు బంధాలు చాలా బలహీనంగా ఉంటున్నాయి. ఇవి చాలా సున్నితంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు మనకు నచ్చిన వ్యక్తి జోడిగా దొరికినట్టు అనిపిస్తుంది. కానీ కొంత కాలం గడిచాక, అదే వ్యక్తితో విభేదాలు పడాల్సి వస్తుంది. దీంతో విడిపోవాలనే ఆలోచనలు వస్తుంటాయి.

సాన్నిహిత్యం లేకపోవడం..

సాన్నిహిత్యం లేకపోవడం..

చాలా మంది జంటలు తమ మధ్య బంధం బలంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఆలుమగల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం. కొన్ని సందర్భాల్లో వారి బంధం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అది ఎంతలా అంటే చలనం లేని నీళ్ల మాదిరిగా మారిపోతుంది. దీంతో తామిద్దరం ఇక కలిసి జీవించలేమని భావిస్తారు. వెంటనే విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు.

తరచుగా గొడవలు..

తరచుగా గొడవలు..

భార్యభర్తలు అన్నాక ఏదో ఒక సందర్భంలో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి గొడవల వల్ల బంధం మరింత బలోపేతమవుతుంది. కానీ తరచుగా గొడవలు జరిగితే మాత్రం వారి మధ్య బంధం క్షీణించిందని అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాట మాట పెరిగి భౌతిక దాడులు కూడా చేసుకునేంత దూరం వెళ్తుంది. ఈ నేపథ్యంలో జంటలు తమ బంధానికి బ్రేకప్ చెప్పాలనుకుంటాయి.

ఈ వయసులో ఉండే మగువలు ఎక్కువ రొమాన్స్ కావాలని కోరుకుంటారట...!

ఆర్థిక ఇబ్బందులు..

ఆర్థిక ఇబ్బందులు..

కొందరు జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆవేశంలో అమ్మనాన్నలను ఎదిరించి.. పెద్దలను పట్టించుకోకుండా పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించొచ్చని భావిస్తారు. కానీ పెళ్లి చేసుకున్నాక అసలు సమస్య మొదలవుతుంది. ముందుగా ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఎంత సంపాదించినా.. ఏదో ఒక ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. ఖర్చులు, పొదుపు విషయంలోనూ భార్యభర్తల మధ్య గొడవలు రావొచ్చు. ఇలాంటి సమయంలో పంతాలకు పోయి తమ బంధానికి గుడ్ బై చెబుతుంటారు.

సుఖం దక్కకపోతే..

సుఖం దక్కకపోతే..

ఆలుమగల మధ్య అనుబంధం పెరగాలంటే.. పడకగదిలో ఆ కార్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరైతే తమ భాగస్వామిని పడకగదిలో సుఖపెడతారో అలాంటి వారి మధ్య బంధం బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైతే తమ భాగస్వామిని సుఖపెట్టడంలో విఫమలవుతారో.. అక్కడి నుండే అసలు సమస్య మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే తమ భాగస్వామి నుండి దూరం కావాలని భావిస్తారు.

ఇతరులపై ఆసక్తి..

ఇతరులపై ఆసక్తి..

భార్యభర్తల్లో చాలా మంది పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే పని ఒత్తిడి, ఇతర కారణాలు అనేకం ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొందరికి అనుకోకుండా ఇతరులపై ఆసక్తి పెరుగుతుంది. ఆ సమయంలో తమ భాగస్వామి దగ్గర లేకపోవడం.. ఇతరులపై మోజు పెరగడం వల్ల ప్రస్తుత భాగస్వామికి దూరంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి కారణాలతో తమ వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని భావిస్తారు.

శిఖర్ ధావన్, ఆయేషా మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? వీర

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ మధ్య ఏజె గ్యాప్ సరిగ్గా 10 సంవత్సరాలు.

English summary

Shikhar Dhawan Divorce; Here are Most Common Reasons People Get Divorced

Here we are talking about the shikar dhawan divorce;Here are the most common reasons people ge divorced. Have a look
Story first published: Wednesday, September 8, 2021, 12:22 [IST]