For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సరైన వ్యక్తినే సెలెక్ట్ చేసుకున్నారా? ఎలా తెలుసుకోవాలంటే...

|

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే ఘట్టం ఎంతో కీలకం. ఎందుకంటే జీవితంలో ఒక్కసారే వచ్చే గొప్ప అవకాశం. అయితే పెళ్లికి ముందు తమ భాగస్వామి అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.

అలాంటి వారితో కలిసి జీవితమంతా ఆనందంగా గడపాలని భావిస్తారు. నచ్చిన వ్యక్తితో జీవితాంతం ఆనందంగా ఉండిపోవాలనే ఆలోచన రావడం అత్యంత సర్వసాధారణమే. అలా మీరు కోరుకున్నవన్నీ జరగాలంటే.. మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తులు సరైన వారయ్యుండాలి.

లేదంటే మీ మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంతో మీ ఫ్యామిలీలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ నేపథ్యంలో మీరు వివాహం విషయంలో సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోండిలా...

'నేను కన్యను కాదని.. నాకు కాబోయే భర్తకు చెప్పొచ్చా..'

నిజాయితీగా ఉంటారు..

నిజాయితీగా ఉంటారు..

మీరు సరైన వ్యక్తిని వివాహం చేసుకున్నారా లేదా తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామి పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటే.. మీపై ప్రేమ, ద్వేషం, కోపం, జాలి వంటి వాటిని ఏ మాత్రం మొహమాటం లేకుండా.. ఎలాంటి నాటకాలు ప్రదర్శించకుండా ఉంటే.. ఏ విషయంలోనూ మిమ్మల్ని జడ్జ్ చేయకుండా నిజాయితీగా ఉంటే.. తను సరైన వ్యక్తి అని మీరు డిసైడ్ కావొచ్చు.

ప్రతిదీ పంచుకోవడం..

ప్రతిదీ పంచుకోవడం..

పెళ్లి తర్వాత మీరు ఏమనుకుంటున్నారో అనే అనుమానం ఏ మాత్రం లేకుండా ప్రతి విషయాన్నీ మీరు పంచుకోవడం వంటివి చేస్తే.. ఇప్పటివరకు తన లైఫ్ లో జరిగిన తప్పులను.. తాను పడిన కష్టాలు.. అలాంటివి మీరు ఎన్నటికీ పడకూడదని భావించేవారు.. మీరు ఇష్టపడని విషయాలేవైనా ఉంటే.. వాటి గురించి ఎక్కువగా మాట్లాకపోవడం చేస్తారు. అంతేకాదు మీరంటే ఇష్టం చూపుతూ.. మీరు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సహనంతో వింటారు. మీరు మాట్లాడేటప్పుడు అస్సలు కలుగజేసుకోరు. అక్కడితో ఆగకుండా మీరు చెప్పే విషయం సరైందే అయితే మీకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు.

అన్ని కలిసి చేయడం..

అన్ని కలిసి చేయడం..

మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ప్రతి పనినీ కలిసి చేసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా మీకు ఎలాంటి విషయాల్లో అయితే ఆనందం కలుగుతుందో.. అలాంటి వాటిని ఎక్కువగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇద్దరూ కలిసి లాంగ్ జర్నీ చేయడం.. కలిసి సినిమాలు చూడటం.. ఏకాంతంగా గడపడం.. కలిసి భోజనం చేయడం.. క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయడం.. సరదాగా నవ్వుకోవడం.. నవ్వించడం.. వంటివి చేస్తుంటే.. మీ భాగస్వామికి మీరంటే ఎంతో ఇష్టమున్నట్టే.. అంతేకాదు మీరు పర్ఫెక్ట్ పార్ట్ నర్ ను పొందినట్టే.

పడకగదిలో ఆ పని చేయాలంటే భయమేస్తోందా... అయితే ఇలా ట్రై చేయండి...

పిల్లల విషయంలో..

పిల్లల విషయంలో..

పెళ్లి అయిన వెంటనే పిల్లల విషయంలో తొందర పెట్టకుండా.. మీకు ఎప్పుడు కంఫర్ట్ అంటే.. అప్పుడే ఆ కార్యంలో పాల్గొందామని.. అంతవరకు పైపై రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పేవారిని.. మీరు పొందారంటే.. తనకు మీపై ప్రేమ ఉన్నట్టే.. మరోవైపు మీకు పిల్లలంటే ఇష్టమైతే, తను కూడా వెంటనే ఓకే అంటాడు. ఎందుకంటే తన మనసులో కూడా ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా.. తాను తండ్రి ఎప్పుడు అవుదామా అని అబ్బాయి ఆలోచిస్తుంటాడు. మరోవైపు అమ్మాయిలు కూడా తాము ఎప్పుడెప్పుడు అమ్మా అనిపించుకుందామా అని ఆరాటపడుతుంటారు.

ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా..

ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా..

కొందరు పెళ్లైన కొత్తలో చాలా మూడీగా ఉంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంకా కొందరు తాము అనవసరంగా బంధం అనే చట్రంలో చిక్కుకున్నామని ఫీలవుతుంటారు. ముఖ్యంగా కొత్త వారితో కలిసిపోవడం అంత సులభం కాదు. అయితే కొందరు తమ రిలేషన్ షిప్ విషయంలో చాలా సులభంగా కలిసిపోతారు. మీ భాగస్వామి ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా మీతో సంబంధంలో సాన్నిహిత్యంగా ఉన్నారంటే.. మీరు సరైన పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు.

మీరు పొరపాటు చేస్తే..

మీరు పొరపాటు చేస్తే..

మీరు ఏదైనా విషయంలో పొరపాటు చేసినా.. మీరు చిన్న విషయాలకే గొడవ పెట్టుకుంటున్నా.. తాను వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం... అంతేకాదు అలాంటి పరిస్థితులు మరోసారి జరగకుండా చూసుకోమని.. మీకు సలహా చెప్పినప్పుడు, తను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో.. మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీరు రిలేషన్ విషయంలో ఎన్ని షరతులు విధించినా.. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అన్నింటికీ ఓకే చెబితే.. మీరు సరైన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారని డిసైడ్ అవ్వొచ్చు.

ఇలా జరిగితే..

ఇలా జరిగితే..

మీ వివాహ జీవితంలో పై విషయాలతో పాటు మీరు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు కలిసికట్టుగా ఎదుర్కోవడం.. మీరు ఏ పని చేసినా సాధ్యమైనంత వరకూ కలిసే చేయడం వంటివి చేస్తే మీ మ్యారేజ్ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీ వివాహ జీవితంలో మీరు కోరుకున్నట్టు లేదా ఊహించుకున్నట్టు సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నట్టే.

English summary

Signs You Married the Right Person in Telugu

Check out the signs which tells you married the right person. Read on.
Story first published: Wednesday, May 12, 2021, 16:30 [IST]