For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ వయసులోనూ ‘ఆ’కార్యంలో మజాను అనుభవించాలంటే...!

|

మన సమాజంలో భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే అత్యంత ముఖ్యమైన కార్యం శృంగార కార్యం. శృంగార జీవితం ఎంత బలంగా ఉంటే.. కపుల్స్ మధ్య సాన్నిహిత్యం అంత మంచిగా ఉంటుంది.

అయితే పెళ్లైన కొత్తలో ఉండే శృంగార కోరికలు రాను రాను తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత రొమాన్స్ పై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే వయసు పెరిగేకొద్దీ అమ్మాయిలు, అబ్బాయిలిద్దరిలోనూ శృంగార కోరికలు తగ్గిపోతూ ఉంటాయి.

అయితే కొన్నిసార్లు కోరికలు కలిగినప్పటికీ ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. మహిళలలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఒక కారణమైతే.. మగవారికి వయసు పెరగడం, అంగ స్తంభన వంటి సమస్యలతో వారికి ఆ కార్యంపై ఆసక్తి సన్నగిల్లుతుంది.

అయితే వయసు పెరిగే కొద్దీ శృంగారంలో పాల్గొంటూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మూడు పదుల వయసు దాటిన తర్వాత శృంగారంపై ఆసక్తి అమాంతం తగ్గిపోతూ ఉంటుంది. ఇక మహిళల్లో అయితే పీరియడ్స్ ఆగిపోయే క్రమంలో కూడా శృంగారంపై ఇంట్రస్ట్ తగ్గుతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే, భార్యభర్తలు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

అక్కడ శృంగారాన్ని ఓపెన్ గా చేసేస్తారట...! ఎందుకో తెలుసా...

ఇవి చేయండి..

ఇవి చేయండి..

మీరు శృంగారంలో రాణించాలంటే.. బిపి, షుగర్ వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాలి. దీని కోసం మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, మీ బరువును తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం అనేది చాలా ముఖ్యం. అధిక రక్తపోటు, డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ తో పాటు గుండె జబ్బులను నివారించడం వల్ల అంగ స్తంభన వంటి సమస్యలను తగ్గించొచ్చు.

మొదట ఇలా..

మొదట ఇలా..

శృంగారం చేసేందుకు భార్యభర్తలిద్దరికీ ఫోర్ ప్లే అనేది ఒక మంచి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ముఖ్యంగా కపుల్స్ మధ్య శారీరక సంబంధం వల్ల ప్రేమ మరియు సాన్నిహిత్యం మరింత పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. కపుల్స్ బాడీలో కామ ఉద్రేకాన్ని కలిగించే హార్మోన్ల విడుదలకు ఇది ఉపయోగపడుతుంది.

అలా చేయకండి..

అలా చేయకండి..

శృంగారంలో పాల్గొనేటప్పుడు కొందరు భయంతోనో లేదా సిగ్గుతోనో కళ్లు మూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మంది శృంగారాన్ని ఎక్కువగా చీకటి ప్రదేశంలో చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల సెక్స్ పై వయసు పెరిగేకొద్దీ ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది.

ఈ రాశుల వారు శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపుతారట...! మీ రాశి ఉందేమో చూసెయ్యండి..

కళ్లలో కళ్లు పెట్టి..

కళ్లలో కళ్లు పెట్టి..

అలా జరగకుండా ఉండాలంటే.. మీ పడకగదిలో మంచిగా లైట్ వేసుకుని.. ఆ వెలుతురులోనే మీరిద్దరూ ఒకరినొకరు కళ్లలోకి కళ్లు పెట్టి కళ్లతోనే మాట్లాడుకుంటే.. శృంగారంలో కొత్త అనుభవం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొంచెం కొత్తగా..

కొంచెం కొత్తగా..

చాలా మంది శృంగారంలో పాల్గొనేటప్పుడు తరచుగా ఒకే యాంగిల్ లో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా శృంగార కార్యంపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే, మీ శృంగార భంగిమలను కొంచెం కొత్తగా ప్రయత్నించాలి. అప్పుడే మీకు కొత్త అనుభవం కూడా కలుగుతుంది.

ఎన్నో రకాల భంగిమలు..

ఎన్నో రకాల భంగిమలు..

శృంగార భంగిమలకు సంబంధించి మన ప్రాచీన గ్రంథం కామసూత్రలో అందుకు తగినన్ని భంగిమలు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ప్రయత్నించండి. అంతేకానీ, వయసు మీద పడిందని.. వయగ్రా వంటి వాటి జోలికి వెళ్లకండి.

స్టడీ : శృంగారంలో స్వర్గం చూడొచ్చని.. కపుల్స్ అవే ఎక్కువగా చూసేస్తున్నారంట...!

అలా శృంగారం చేస్తే..

అలా శృంగారం చేస్తే..

అయితే మీరు రక్తపోటు(బిపి), షుగర్ (డయాబెటిస్), గుండె సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే.. వాటిని ముందుగా అదుపులో ఉంచుకుని శృంగారం చేస్తే మాత్రం ఆరోగ్యం హాయిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరో కారణం..

మరో కారణం..

లిబిడో మరియు అంగస్తంభన వంటి లైంగిక సమస్యలు భావోద్వేగ భాగాన్ని కలిగి ఉండొచ్చు. కాబట్టి మానసిక సలహా అనేది ఒక ఎంపిక. ‘మానసిక సమస్య మీ లైంగిక సమస్యలను కలిగించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా లైంగిక కోరికలు తగ్గిపోయేలా చేస్తాయి. ఇలాంటి సందర్భాలలో కౌన్సెలింగ్ సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

English summary

Simple Ways for Men Over 50 to Improve Their Sex Life

Here we talking about the simple ways for men over 50 to improve their sex life. Read on
Story first published: Wednesday, January 13, 2021, 11:26 [IST]