For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...

ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న తెలుగు ప్రముఖులెవరో తెలుసుకుందాం.

|

మన సమాజంలో సెలబ్రిటీలు ఏం చేసినా అది పాపులర్ అవుతూ ఉంటుంది. వారి సినిమాల నుండి పర్సనల్ లైఫ్ వరకూ ప్రతి విషయాన్ని అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.

Telugu Celebrities Who Married More Than Once

అదే సెలబ్రిటీల ఎంగేజ్ మెంట్, వెడ్డింగ్ వంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరి ఫోకస్ వారిపైనే ఉంటుంది. కొందరు ప్రముఖులు ఎంత ఘనంగా పెళ్లి చేసుకుంటారో.. అంతే త్వరగా విడిపోవడం వంటివి జరుగుతుంటాయి.

Telugu Celebrities Who Married More Than Once

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో కూడా ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నా.. వారి వైవాహిక బంధం విఫలమయ్యాయి. మరో విచిత్రం ఏంటంటే.. వారు ఎంత వేగంగా విడిపోయారో.. అంతే వేగంగా రెండోసారి వివాహం చేసుకున్నారు. అలా ఒకటి కంటే ఎక్కువసార్లు వివాహం చేసుకున్న జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

పెద్దలు సెట్ చేసినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ హీరోలది...!పెద్దలు సెట్ చేసినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ హీరోలది...!

నాగార్జున

నాగార్జున

టాలీవుడ్ మన్మథుడిగా పిలుచుకునే అక్కినేని నాగార్జున 1984 సంవత్సరంలో డి.రామానాయుడు కుమార్తె, విక్టరీ వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ దగ్గుబాటిని మొదటిసారి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరిద్దరికీ అప్పటికే నాగచైతన్య కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత నాగార్జున శివ సినిమా హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు. అంతే వెంకటేష్ చెల్లెలు లక్ష్మీకి విడాకులు ఇచ్చేశాడు. 1992లో అమలను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అఖిల్ అనే కుమారుడు జన్మించాడు. వీరంతా ఇప్పుడు కలిసి ఆనందంగా జీవిస్తున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఈ యంగ్ హీరో 1997లో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరు రెండేళ్ల తర్వాత విడిపోయారు. అయితే బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణుదేశాయ్ ను 2009 సంవత్సరంలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి అకిరా నందన్ అనే కుమారుడు, ఆధ్యా అనే కుమార్తె ఉన్నారు. అయితే వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. నివేదికల ప్రకారం, వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ, తామిద్దరం ఆ పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటామని వివరించారు. విడిపోయినప్పటికీ, తాము స్నేహితులుగా ఉంటామన్నారు. ప్రతిరోజూ మాట్లాడుకుంటామన్నారు. అయితే పవన్ జీవితంలో ఏమి జరుగుతుందో తనకు తెలుసని రేణు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ 2013 డిసెంబరు నెలలో రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కూతురు పుట్టింది.

ఎన్టీఆర్..

ఎన్టీఆర్..

తెలుగు సినీ చరిత్రలో క్రిష్ణుడిగా, తెలుగు జాతి ఖ్యాతి పెంచిన మహానుభావుడిగా పేరు గడించిన నందమూరి తారక రామారావు(NTR) 1942 సంవత్సరంలో 20 ఏళ్ల వయసులో బసవ తారకమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తులు జన్మించారు. అయితే బసవతారకమ్మ మరణించిన తర్వాత, 1993 సంవత్సరంలో ఎన్టీఆదర్ 70 సంవత్సరాల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బయోగ్రఫీ రాసేందుకు వెళ్లిన లక్ష్మీపార్వతినని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే 1996 సంవత్సరంలో జనవరి 18వ తేదీన 72 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.

పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...

శ్రీజ..

శ్రీజ..

శ్రీజ.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు. తన పెళ్లి వ్యవహారం గురించి తెలుగువారందరికీ బాగా తెలుసు. అప్పట్లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్ లో బహిరంగంగా పెళ్లి చేసుకుంది. నివ్రుతి అనే పండంటి పాపకు కూడా జన్మనిచ్చింది. కానీ పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం చిరంజీవి బెంగళూరు ప్యాలెస్ లో శ్రీజ రెండో వివాహాన్ని కళ్యాణ్ దేవ్ తో ఘనంగా జరిపించారు. పెళ్లి సమయానికి కళ్యాణ్ బిజినెస్ చేస్తుండేవాడు. ఆ తర్వాత తను సినిమా పరిశ్రమలోకి సైతం అడుగు పెట్టాడు. 2017 సంవత్సరంలో మార్చి నెలలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరిద్దరికీ నవిష్క అనే పాప కూడా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. వీరిద్దరూ పెళ్లికి ముందు క్లాస్ మేట్స్ అంట.

ప్రకాష్ రాజ్..

ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ 1994లో లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ పూజా మరియు మేఘన అనే కూతుళ్లు మరియు సిద్ధు అనే కుమారుడు ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని విషయాల మధ్య గొడవలు రావడంతో 2009లో విడిపోయారు. అనంతరం 2010 సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య కూడా గొడవలు వచ్చాయని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి.

కమల్ హాసన్..

కమల్ హాసన్..

సీనియర్ హీరో కమల్ హాసన్ కూడా ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే రెండోసారి కూడా విడిపోయారు. ముందుగా 1978 సంవత్సరంలో డ్యాన్సర్ వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత తనకు విడాకులు ఇచ్చేశారు. అనంతరం మరో హీరోయిన్ సారికతో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ శ్రుతిహాసన్ పుట్టింది. అయితే వీరిద్దరూ కూడా 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో మరో నటి గౌతమిని వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆమెతో పొరపచ్చాలు వచ్చాయి.

నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...

ప్రభుదేవా..

ప్రభుదేవా..

ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. తను మొదట రామలత అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్టార్ హీరోయిన్ నయనతారతో సహజీవనం చేశారు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటారని రూమర్స్ గట్టిగా వినిపించాయి. అయితే 2012 సంవత్సరంల నయనతారతో బ్రేకప్ కావడంతో మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

యాంకర్ జాన్సీ..

యాంకర్ జాన్సీ..

తెలుగు సినిమాల్లో కోకాపేట ఆంటీ మరియు యాంకర్ జాన్సీ అంటే ఎంతో ఫేమస్. ఈ నటి జోగి నాయుడును తొలిసారి పెళ్లి చేసుకుంది. అయితే తనతో గొడవలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. చాలా కాలం తర్వాత ఈ యాంకర్ ఓ కుర్రాడితో సంబంధాన్ని స్టార్ట్ చేసింది. తనను పెళ్లి చేసుకున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.

రాధిక..

రాధిక..

ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిన రాధిక ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి వివాహం డైరెక్టర్ ప్రతాప్ పోతాన్ ను 1985 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డీని రెండోసారి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కూడా విడిపోవడంతో 2001 సంవత్సరంలో తమిళ హీరో ఆర్ శరత్ కుమార్ ను మరోసారి వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే తను చాయ అనే మహిళకు విడాకులు ఇచ్చారు.

సునీత..

సునీత..

సింగర్ సునీత కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత కొద్ది కాలంలోనే తొలి భర్తతో విడిపోయారు. ఇటీవలే కరోనా కాలంలో బిజినెస్ మ్యాన్ రామ్ ను రెండో వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 2021లో జనవరి 9వ తేదన హిందూ సంప్రదాయం ప్రకారం సీతారాముల గుడిలో వివాహం చేసుకున్నారు.

English summary

Telugu Celebrities Who Married More Than Once

Here are the telugu celebrities who married more than once. Take a look
Story first published:Saturday, July 3, 2021, 14:39 [IST]
Desktop Bottom Promotion