Latest Updates
-
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా!
కలియుగ కృష్ణుడు అంటే ఇతనే... ఒక ఇంట్లోనే 8 మంది భార్యలతో కాపురం పెట్టేశాడు...
కలియుగ కృష్ణుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Thai Man With 8 Wives : పురాణాల ప్రకారం శ్రీక్రిష్ణుడు ఎనిమిది మంది భార్యలను పెళ్లి చేసుుకన్నాడని మనలో చాలా మందికి తెలుసు. అయితే కలియుగంలో కూడా అలాంటి క్రిష్ణుడు ఒకరున్నారని మీకు తెలుసా..

ఎందుకంటే ఓ వ్యక్తి ఏకంగా ఎనిమిది మంది అమ్మాయిలను ప్రేమించాడు. అంతటితో ఆగకుండా వారందరినీ పెళ్లి కూడా చేసేసుకున్నాడు. అయితే ఎవ్వరికీ తెలియకుండా.. అందరు భార్యలను ఒప్పించి.. మెప్పించి.. మనువాడేశాడు.

అంతేకాదండోయ్.. ఎనిమిది మంది భార్యలతో ఎలాంటి గొడవలు లేకుండా ఒకే ఇంట్లో ఎంచక్కా కాపురం కూడా పెట్టేశాడు. వీరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాలేదట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు అనే ఆసక్తికరమైన విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి.

టాటూ ఆర్టిస్ట్..
సాధారణంగా మన దేశంలో ఒకరిద్దరిని పెళ్లి చేసుకుంటేనే భర్తలకు చుక్కలు కనిపిస్తుంటాయి. అసలు మనశ్శాంతి అనేదే ఉండదు. ఇద్దరు భార్యలను భరించలేక సాక్షాత్తు దేవుళ్లు సైతం ఇబ్బందిపడ్డారని పెద్దలు చెబుతుంటారు. అలాంటిది ఎనిమిది మంది భార్యలను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. ఒకే ఇంట్లో కాపురం పెట్టడం అనేవి మన దగ్గర కుదరని పని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 8 మంది భార్యలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరనుకుంటున్నారా? తనది మన దేశం కాదులెండి. ఎనిమిది మందిని పెళ్లాడిన కలియుగ క్రిష్ణుడు థాయ్ లాండ్ కి చెందిన వ్యక్తి. ఓంగ్ డామ్ సోరోట్ అనే టాటూ ఆర్టిస్ట్ తన 8 మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో హాయిగా జీవిస్తున్నాడట.

ఒక్కో గదిలో..
తన ఇంట్లో నాలుగు పడకగదులు ఉండగా.. ఒక్కో రూమ్ లో ఇద్దరు భార్యలను చొప్పున షేర్ చేసి.. వారందరితో ప్రతిరోజూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడట. ఇటీవలే తన మ్యారేజ్ లైఫ్ గురించి ఓ టీవీ షో లో మాట్లాడాడు. ఆ షో లో తన ఎనిమిది మంది భార్యలను పరిచయం కూడా చేసేశాడు.

ఎలా కలిశాడంటే..
తన ఎనిమిది మంది భార్యల్లో తొలి భార్యను ఫ్రెండ్ పెళ్లిలో చూసి మనసు పారేసుకున్నాడట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులోని ప్రేమను తనకు చెప్పేసి.. పెళ్లి చేసుకున్నాడట. ఇక రెండో భార్యను మార్కెట్లో చూసి.. మూడో భార్యను ఆసుపత్రిలో చూసి మనువాడేశాడట. ఇక నాలుగో నెంబరు, ఐదో నెంబరు, ఆరో నెంబర్ భార్యలను సోషల్ మీడియా ద్వారా అంటే ఒకరేమో ఇన్ స్టాగ్రామ్, మరొకరు ఫేస్ బుక్, టిక్ టాక్ లలో చూసి ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడట.

విహారయాత్రకు వెళ్లినప్పుడు..
ఇక ఏడో నెంబర్ భార్యను వాళ్ల అమ్మతో కలిసి గుడికి వెళ్లినప్పుడు చూశాడట. అంతే ఆమెను కూడా నేరుగా పెళ్లి చేసుకోమని అడిగితే.. తను కూడా ఓకే చెప్పడం విశేషం. ఇక ఎనిమిదో భార్యను అయితే నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు కలిశాడట. అంతే తనను కూడా ఇష్టపడటం.. తన ఇంటికి తీసుకెళ్లడం.. పెళ్లి చేసుకోవడం.. ఎంచక్కా కాపురం మొదలుపెట్టడం చకచకా జరిగిపోయాయట.

అందరూ సమానమేనట..
ఎనిమిది మంది భార్యలను పెళ్లి చేసుకున్న తనకు అందరితోనూ అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నానని.. తనకు అందరూ భార్యలు సమానమే అని, తన ప్రేమను అందరికీ ఒకే మాదిరిగా పంచుతానని చెబుతున్నాడు. తన భార్యలు ఎంతో అందంగా ఉంటారని.. వారు ఎంతో మంచివారని చెప్పేశాడు. వారు కూడా తనను ఎంతో అపురూపంగా.. ప్రేమగా చూసుకుంటారని చెబుతూ తెగ సంతోషపడ్డాడు ఓంగ్. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఓంగ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తను ఏకంగా ఇంటర్నేషనల్ సెలబ్రెటీగా మారిపోయాడు.

నెటిజన్ల సెటైర్లు..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంకేముంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒకరేమో ‘నువ్వు కలియుగ క్రిష్ణుడివి' అంటూ తనని ఆకాశానికెత్తేశారు. మరొకరు ఇప్పట్లో ఒక భార్యతో కాపురం చేయడమే కష్టమనుకుంటే.. ఏకంగా 8 మంది భార్యలతో.. అదీ ఒకే ఇంట్లో కాపురం ఎట్టా సామీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఎనిమిది మంది భార్యలను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. ఒకే ఇంట్లో కాపురం పెట్టడం అనేవి మన దగ్గర కుదరని పని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 8 మంది భార్యలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరనుకుంటున్నారా? తనది మన దేశం కాదులెండి. ఎనిమిది మందిని పెళ్లాడిన కలియుగ క్రిష్ణుడు థాయ్ లాండ్ కి చెందిన వ్యక్తి. ఓంగ్ డామ్ సోరోట్ అనే టాటూ ఆర్టిస్ట్ తన 8 మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో హాయిగా జీవిస్తున్నాడట.



Click it and Unblock the Notifications