Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
Relationship Tips: మీ భాగస్వామితో రొటీన్‌గా ఉండొద్దు, ఈ మార్పులతో సుఖం డబుల్ అవుతుంది
సంబంధం రొటీన్ గా సాగడం వల్ల బోర్ కొడుతుంది. కొత్తగా ట్రై చేస్తే భాగస్వామిపై ఇష్టం, వ్యామోహం పెరుగుతాయి. శృంగార కోరికలు కూడా మెరుగవుతాయి.
పెళ్లైన కొత్తలో బాగుంటుంది. బాగుండటం కాదు సూపర్ గా ఉంటుంది. కొత్తలో ఎప్పుడూ మీ భాగస్వామితో సమయం గడపాలనుకుంటారు. వారి వెంటే తిరుగుతుంటారు. రొమాంటిక్‌గా ప్రవర్తిస్తుంటారు. వెనక నుండి వాటేసుకోవడం, గిలిగింతలు పెట్టడం, బాత్రూములోకి లాగడం, చీర లాగడం లాంటివి చేస్తుంటారు. అయితే ఆ కొత్తదనం రోజులు గడిచే కొద్ది పాతబడుతుంది. రొమాన్స్ చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు భాగస్వామి వెంటే తిరిగిన వారు ఇప్పుడు తప్పించుకు తిరుగుతుంటారు. శృంగారం కూడా బోర్ కొడుతుంది. సాన్నిహిత్యం తగ్గిపోతుంది. శృంగార కోరికలూ మొదట్లో ఉన్నంతగా ఉండవు.

సంబంధం రొటీన్ గా సాగడం వల్లే ఇలా అవుతుంది. ఆ రొటీన్ ను వదిలేసి కొత్తగా ప్రయత్నిస్తుంటే బోర్ ఫీలింగ్ రాదు. భాగస్వామిపై ఇష్టం, వ్యామోహం పెరుగుతాయి. శృంగార కోరికలు కూడా మెరుగవుతాయి. అందుకే రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ కూడా సంబంధంలో కొన్ని మార్పులు చేసుకోవాలని, వాటి వల్ల దాంపత్య బంధంలో సాన్నిహిత్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారానికి ఒక సమయం పెట్టుకోండి:
పెళ్లైన కొత్తలో శృంగారం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. భాగస్వామితో రతిక్రీడలో పాల్గొనడాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ శృంగారం జరిగే సమయం, సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి చాలా మంది చెప్పే రీజన్. సమయం దొరకడం లేదని.. ఉద్యోగంతో, వ్యాపారంతో బిజీగా ఉన్నామని.
అందుకే శృంగారానికి ఒక సమయం పెట్టుకోవాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇది కొద్దిగా అన్‌రొమాంటిక్‌గా అనిపించొచ్చు. కానీ మీ ఇద్దరి మధ్య తిరిగి సాన్నిహిత్యాన్ని తీసుకురావడానికి ఇలా చేయకతప్పదు. ఇలా వారంలో ఏదో ఒక సమయం, కొంత సమయం పాటు శృంగారానికి కేటాయించడం వల్ల ఇద్దరి మధ్య తిరిగి సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే టైం లేదు అనే సాకుకు సరైన పరిష్కారం కూడా లభిస్తుంది.

శృంగారం కోసం వెంపర్లాడొద్దు:
శృంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే మూడ్ లేకపోవడం వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల, ఇతర చాలా కారణాల వల్ల శృంగారం అంటే ఆసక్తి లేకపోవచ్చు.
మీరు రొమాన్స్ కావాలంటూ చేతలో ద్వారా చూపించినా, మాటల ద్వారా చెప్పినా మీ భాగస్వామి వద్దని వారించవచ్చు. అలాంటి సమయంలో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కానీ మీ సుఖం కోసం వారి పరిస్థితి అర్థం చేసుకోకుండా ప్రవర్తించవద్దు. ఇలా చేయడం వల్ల వారిని మీరు అర్థం చేసుకుంటున్నారని, వారి కోసం మీ కోరికలను అణచివేసుకుంటున్నారని వారు భావిస్తారు. వారికి మీపై పాజిటివ్ ఓపినియన్ పెరుగుతుంది.

శృంగారంలో ఇదొక్కటి చేర్చండి:
శృంగారం అంటే ఇద్దరు భాగస్వాములకు సంబంధించినది. ఒకరు సంతృప్తి చెందే వరకు ఇంకొకరు శృంగారాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. మీకు మూడ్ వస్తే మీద పడిపోవడం కావాల్సిన సంతృప్తి రాగానే పక్కకు తిరిగి పడుకోవడం మంచి శృంగారం అనిపించుకోదు.
శృంగారంలో మీరు సంతృప్తి చెందడం ఎంత ముఖ్యమో మీ భాగస్వామి సంతృప్తి చెందడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. అందుకే అసలు కార్యం మొదలు పెట్టడానికి కొసరు కార్యం కూడా చేయాలని సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. అదే ఫోర్ ప్లే. తాకడంతో మొదలై.. మీ భాగస్వామి ప్రైవేటు పార్ట్స్ ను నిమరడం, మసాజ్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం, మీటడం, జననేంద్రియాలను స్పృశించడం, ఇలాంటి ఫోర్ ప్లేలో భాగం. ఓరల్ శృంగారం కూడా ఫోర్ ప్లేలో భాగం చేయాలి.
ఈ చర్యతో మీ భాగస్వామిని స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్లండి. ఆ తర్వాత అసలు కార్యం మొదలు పెడితే మీకు, వారికీ శృంగార తృప్తి పొందుతారు. ఇలాంటి చర్యల వల్ల శృంగారం అంటే మరోసారి కావాలని మనసు కోరుకుంటుంది.

అన్నింటి కంటే ఇదే ముఖ్యం:
దాంపత్యంలో అతి ముఖ్యమైనది, అవసరమైనది ప్రేమ. మీరు ప్రేమిస్తే సరిపోదు.. దానిని వ్యక్తం చేయాలి. మీ చేతల ద్వారా మీరెంత ప్రేమిస్తున్నారో వారికి చూపించాలి. మీ మాటల ద్వారా మీ లవ్ సైజ్ ఎంతో వారికి చెప్పాలి.



Click it and Unblock the Notifications











