Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Tips: కొత్తగా పెళ్లయిందా? ఈ గొడవలు కామన్, హైరానా పడాల్సిన అవసరం లేదు
కొత్తగా పెళ్లయిన తర్వాత మొదటి 6 నెలల పాటు కొన్ని గొడవలు చాలా కామన్ గా ప్రతి దంపతుల మధ్య జరుగుతుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాంపత్య బంధం చాలా మధురమైనది. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే అతి పెద్ద పండగ వివాహం. వివాహ బంధంతో ఒక్కటైన వారి మధ్య ఎప్పుడూ ప్రేమ, సాన్నిహిత్యం, అండర్‌స్టాండింగ్ మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. పెళ్లయ్యాక దంపతుల మధ్య కలహాలు మొదలవుతాయి. అవి ప్రతి భార్యాభర్త మధ్య ఉండేవే.

పెళ్లయిన కొత్తలో దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగానే ఉంటారు. కానీ క్రమంగా సాన్నిహిత్యం కొద్దిగా తగ్గి అలకలు మొదలవుతాయి. అవి కాస్త గొడవలుగా మారతాయి. కొత్తగా పెళ్లయిన తర్వాత మొదటి 6 నెలల పాటు కొన్ని గొడవలు చాలా కామన్ గా ప్రతి దంపతుల మధ్య జరుగుతుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెప్పకుండానే అర్థం చేసుకోవాలని అనుకోవడం:
ఈ రోజుల్లో పెళ్లికి మందు ఒకరినొకరు బాగా తెలుసుకుంటున్నారు. అందుకే పెళ్లయ్యాక భాగస్వామి మాట్లాడకుండా మనసులో ఉన్నదంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు. కానీ అలా ఏదీ చెప్పకుండా అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. కొన్ని సార్లు అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతీసారి అలా అర్థం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
ఇలా మాటలు, చేతల ద్వారా చెప్పకుండానే అర్థం చేసుకోవాలని అనుకోవడం నుండే గొడవలు మొదలవుతాయి. అయితే ఇది కొన్ని రోజుల్లో పరిష్కారమవుతాయి.

ఒకరిలా ఒకరు మారాలనుకోవడం:
మార్పు మానవ సహజం. పెళ్లయిన తర్వాత వ్యక్తులు తమ భాగస్వాములతో కూడా అదే పని చేయడం ప్రారంభిస్తారు. దీని కారణంగా పరస్పర విభేదాలు మొదలవుతాయి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీకు ఇష్టాయిష్టాలు ఉన్నట్లే వారికి కూడా ఉంటాయి. ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలను గౌరవించాలి. వాటిని అంగీకరించాలి కానీ మార్చుకోవాలని ఒత్తిడి చేయకూడదు.

రొటీన్ గా ఉండటం:
చాలా మంది కొత్త జంటలు చేసే తప్పు అది. పెళ్లయిన కొత్తలో కొన్ని అలవాటు అవుతాయి. అవి ఇద్దరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ బోర్ కొట్టేస్తుంది. దాంపత్యబంధం అంటే ఇదేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
అందుకే కొత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. పాత విషయాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాలి. కొత్త ఎప్పుడూ కొత్తగా, ఎగ్జైటింగ్‌గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. రొటీన్ గా ఉండటం వల్ల బోర్ ఫీల్ వచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి.

భాగస్వామి నుండి వ్యక్తిగత స్థలం కోరుకోవడం:
సంబంధంలో వ్యక్తిగత స్థలం చాలా ముఖ్యం. ప్రైవసీ లేకపోవడం వల్ల సంబంధం విషపూరితం అవుతుంది. భాగస్వామికి శృంగారభరితంగా కాకుండా తలనొప్పిగా అనిపిస్తుంది. దాని వల్ల ఎటువంటి కారణం లేకుండా గొడవలు మొదలవుతాయి.
అటువంటి పరిస్థితిలో, ప్రతి భాగస్వామి అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, మీకంటూ వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది. దాంట్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు.



Click it and Unblock the Notifications