Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో నేరుగా నోటి మాటల ద్వారా చెప్పకపోవచ్చు. కానీ వారి చర్యలు, వ్యవహరించే తీరుతో తెలుసుకోవచ్చు.
కొందరు దంపతులు తరచూ పొట్లాడుతుంటారు. ఆమె ఒకటి మాట్లాడితే అతను ఇంకోటి మాట్లాడతాడు. ఇద్దరికీ పొంతన కుదరదు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా అంతగా ఉండదు. అయితే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలుసుకోవడం చాలా బాధగా ఉంటుంది. కానీ నిజాన్ని అంగీకరించాల్సిందే.

మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో నేరుగా నోటి మాటల ద్వారా చెప్పకపోవచ్చు. కానీ వారి చర్యలు, వ్యవహరించే తీరుతో తెలుసుకోవచ్చు. మీ వైఫ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో అనే అనుమానం మీక్కూడా ఉంటే ఈ సంకేతాల ద్వారా గుర్తించండి. ముందే తెలుసుకోవడం ద్వారా వారితో చర్చించి తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించి దానిని పరిష్కరించే అవకాశం ఉంటుంది.

ఆప్యాయత లేకపోవడం:
మీ భార్య మీపై ఆప్యాయత చూపకపోతే వారికి మీరంటే ఇష్టం లేదని, ప్రేమించడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఆప్యాయత అంటే అప్పుడప్పుడు ముట్టుకోవడం, పట్టుకోవడం, కౌగిలించుకోవడం, మీపై చేతులు వేసి మాట్లాడటం, చెక్కిలి గింతలు పెట్టడం లాంటివి కావొచ్చు. ఈ శారీరక ప్రేమ లేకపోతే ఆమెకు మీపై ప్రేమ లేదని అర్థం చేసుకోవచ్చు.

కమ్యూనికేషన్ లేకపోవడం:
ఏదైనా సంబంధంలో మంచి కమ్యూనికేషన్ చాలా కీలకం. ఆలుమగలు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం సంబంధంలో చాలా ముఖ్యం. ఇలా మాట్లాడుకోవడం ద్వారా ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి తెలుస్తుంది. అంతే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. దంపతుల మధ్య చర్చల ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే మీ భార్య మీతో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, మీరు మాట్లాడితే పట్టించుకోకపోయినా వారికి మీరంటే ఇష్టం లేదని అర్థం.

సాన్నిహిత్యం లేకపోవడం:
సాన్నిహిత్యం అనేది ప్రతి జంట మధ్య తప్పనిసరిగా ఉండాల్సి అతి ముఖ్యమైన అంశం. దంపతుల మధ్య సాన్నిహిత్యం లేకపోతే అది దాంపత్యమే కాదు. మీ భార్య మీతో సాన్నిహిత్యంగా మెలగకపోతే మీరంటే ఇష్టపడటం లేదని, మీతో ఉండేందుకు మొగ్గు చూపడం లేదని గుర్తించాలి.

కలిసి సమయం గడపకపోవడం:
మీరు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఆమె తప్పించుకోవడానికి సాకులు వెతుకుతుంటే ఆమె మీ నుండి మీ సాన్నిహిత్యం నుండి దూరంగా ఉండాలని కోరుకుంటుందని అర్థం. ఆమెతో సమయం గడపాలని మీరు చేసే ప్రయత్నాలకు ఆమె స్పందించకపోవడం ఆమె మనసులోని నిజాన్ని గుర్తించాలి.

విభేదాలు వస్తే పరిష్కరించడానికి ప్రయత్నించకపోవడం:
ప్రతి దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. కలహాలు లేని కాపురం ఉండదు. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు దానిని పరిష్కరించడానికి ఇద్దరూ ప్రయత్నించాలి. అంటే ఇద్దరూ రాజీ పడాలి. కానీ ఎప్పుడూ మీరొక్కరే రాజీ పడుతుంటే ఆమెకు మీరంటే లెక్క లేదని మీరంటే ఇష్టం లేదని, మీతో ఉండాలని కోరుకోవడం లేదని అర్థం.

మీ అవసరాలను పట్టించుకోకపోతే:
దంపతులు అంటే ఒకరి అవసరాలను, కోరికలు మరొకరు అర్థం చేసుకుని మెలగాలి. కానీ మీ భార్య మీ అవసరాలు తెలిసినా పట్టించుకోకపోతే, మీ కోరికలు తెలిసినా ఉదాసీనంగా ఉంటే ఆమెకు మీరంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థం.
మీరు మీ భార్యలో ఈ సంకేతాలు గుర్తించనట్లయితే మొదట వారితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనసు విప్పి నిజాయితీగా మాట్లాడండి. ఆమె సమస్య ఏమిటో తెలుసుకోండి. ఆమె ఏం కోరుకుంటుంది, మీరేం ఇవ్వలేకపోతున్నారో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా వ్యవహరించండి. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.



Click it and Unblock the Notifications