Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా అలాంటి మెసెజ్ వస్తే...!
మీ మాజీ లవర్ అనుకోకుండా మెసెజ్ చేస్తే మీరు చేయాల్సిన పనులేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
ప్రేమ అనే ఫీలింగ్ చాలా అద్భుతమైనది. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడు.. ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ప్రేమ అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదరు. అందరకీ ఇది ఆస్వాదించే క్షణాలను ఇవ్వదు. కొందరికే మాత్రమే ఇస్తుంది.

అందుకే ప్రేమ విషయంలో కేవలం కొందరు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. మనలో చాలా మంది ప్రేమ విషయంలో నిజాయితీగా ఉండాలని ఆశపడతారు. కానీ అందరూ అలా ఉండలేరు. కొందరు ప్రేమలో పడటం.. అనుకోని కారణాల విడిపోవడం.. ఆ తర్వాత తప్పు చేశామా అని బాధపడటం అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి.

అయితే బ్రేకప్ బాధ నుండి బయట పడటం చాలా కష్టం. కానీ అందుకు తీవ్రంగా ప్రయత్నించాలి. అప్పుడే మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మీరు ఎంతో నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలి అకస్మాత్తుగా వెళ్లిపోవడం.. కొంత కాలం తర్వాత తిరిగి మళ్లీ కాంటాక్ట్ లోకి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఫోన్లు, మెసెజెస్, సోషల్ మీడియా ద్వారా ఇలాంటివి జరగడం చాలా సహజమే. ఈ నేపథ్యంలో మీ మాజీ లవర్ నుండి మీకు అనుకోకుండా అలాంటి మెసెజ్ వేస్తే ఏం చేయాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

మళ్లీ మీ జీవితంలోకి..
మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడి నుండి మీకు చాలా కాలం తర్వాత ఓ మెసెజ్ వచ్చిందంటే మీరు బాగా ఆలోచించుకోవాలి. తిరిగి మీరు వారిని మీ లైఫ్ లోకి రావిస్తున్నారంటే.. కచ్చితంగా ఇది బాగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మీరు వారికి మళ్లీ అవకాశమివ్వాలని భావిస్తే.. అప్పుడు వారు వారికి ఎలాంటి అంచనాలు పెట్టుకోకూడదు.

కాస్త ఆలోచించి..
మీరు ఎంతో నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి నుండి చాలా కాలం తర్వాత మీకు మెసెజ్ వస్తే.. వారికి వెంటనే రిప్లై ఇవ్వడం వంటివి చేయకండి. ముందుగా కాస్త ఆలోచించండి. సడెన్ గా ఎందుకు మెసెజ్ చేశాడు.. తను మీ గురించి ఏం ఆశిస్తున్నాడు.. అనే విషయాల గురించి మదనం చేసుకోండి. వారిని మీ లైఫ్ లోకి మళ్లీ రానివ్వాలంటే.. మీరు అన్ని రకాలుగా ఆలోచించాలి. బాగా ఆలోచించిన తర్వాత వారికి ప్రశాంతంగా రిప్లై ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పొచ్చు.

మరో రిలేషన్ లో..
ఇప్పటి తరం వారిలో చాలా మంది ప్రేమలో బ్రేకప్ అయితే చాలు పెళ్లి చేసుకోవడం.. లేదా ఆ ఆలోచనలను మరచిపోవడానికి ఇంకొకరితో రిలేషన్ షిప్ మెయింటెన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్న సమయంలో.. మీ మాజీ లవర్ నుండి మెసెజ్ వస్తే.. మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు మాజీ ప్రేయసి లేదా ప్రియుడికే మద్దతు ఇవ్వాలనుకుంటే.. ప్రస్తుతం ఉన్న రిలేషన్ షిప్ గురించి మరచిపోవాల్సి ఉంటుంది.

సీక్రెట్స్ వద్దు..
మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా ఏదైనా మెసెజ్ వస్తే.. వెంటనే మీరు రిప్లై ఇచ్చి.. అన్ని విషయాలను వారితో షేర్ చేసుకోవడం వంటివి చేయొద్దు. ముందుగా వారి హావాభావాల గురించి ఆలోచించండి. మీరు ప్రస్తుతం ఏదైనా రిలేషన్ షిప్ లో ఉంటే.. వారికి ఆ సంబంధాల గురించి మాత్రం చెప్పొచ్చు. అయినా కూడా తనకు అభ్యంతరం లేదంటే.. తను ఎలాంటి కండిషన్లు పెట్టకపోతే.. మీరు అది సమ్మతమైతే.. మీరు ముందుకు వెళ్లడానికి ఆసక్తి చూపోచ్చు. అయితే మీరు చేసిన తప్పులు.. వారు చేసిన తప్పులను ఇద్దరూ కలిసి షేర్ చేసుకోండి. మీ ఇద్దరికీ మళ్లీ రిలేషన్ గురించి కంఫర్ట్ అయితేనే ముందుకెళ్లండి.

ఇవి తెలుసుకోండి..
మీరంటే వద్దనుకుని వెళ్లిపోయిన వారు మళ్లీ తిరిగి మీ జీవితంలోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. అయితే అంతకుముందు మీరు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారనే విషయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకు గల కారణాలేంటో తెలుసుకోండి. ఇప్పుడు మళ్లీ కలవాలనుకుంటున్నారు.. దీనికి గల రీజన్స్ ఏంటో ఆలోచించండి. ఇలా చేస్తే మరోసారి మీరు మీ మాజీ లవర్ కి అవకాశం ఇవ్వొచ్చు. అప్పుడు దాదాపు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అయితే ప్రేమలో కోపం, చిరాకు, ఆనందం, సంతోషం అనేవి సాధారణంగా ఉంటాయి.

రెండు మనసులకు..
ప్రేమ బంధం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందినది కాదు.. ఇద్దరి మనసులకి చెందినది. కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవాలి. జీవితాంతం ఇద్దరూ కలిసి మెలసి జీవించాలి.. కొన్ని సందర్భాల్లో మీరు ఆధిపత్యం చెలాయించాలి.. మరికొన్నిసార్లు తను నెగ్గేలా మీరే సహాయం చేయాలి. ఇలా చేస్తేనే మీ బంధం మరింత బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.



Click it and Unblock the Notifications