Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ లైఫ్ పార్ట్‌నర్ గురించి ఈ విషయాలు తెలుసా? లేదంటే వెంటనే తెలుసుకోండి
నమ్మకం, ప్రేమ, కమ్యూనికేషన్, ఇష్టాలు, విశ్వాసాలు ఇలా జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అసలు జీవితభాగస్వామి గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకుంటే బంధం బలోపేతం అవుతుందో ఇప్పుడ
చాలా మంది పెళ్లై ఏళ్లు గడుస్తున్నా తమ జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. వారు సైగలతో చెప్పేవి అర్థం చేసుకోలేక బ్లాంక్ ఫేస్ పెట్టేస్తారు. ఇంకొందరైతే తమ జీవిత భాగస్వామి బాడీ లాంగ్వేజీని కూడా తెలుసుకోలేరు. కేవలం వారి మాటలు, భావోద్వేగాలే కాదు. ఇంకా భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి.

నమ్మకం, ప్రేమ, కమ్యూనికేషన్, ఇష్టాలు, విశ్వాసాలు ఇలా జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అసలు జీవితభాగస్వామి గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకుంటే బంధం బలోపేతం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ భాష:
ప్రతి ఒక్కరికి తమ సొంత ప్రేమ భాష ఉంటుంది. కొందరు శారీరక స్పర్శ ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు మాటల ద్వారా వారి ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ భాష ఒక్కోలా ఉంటుంది. అందుకే మీ లైఫ్ పార్ట్‌నర్ యొక్క ప్రేమ భాష ఏమిటో తెలుసుకోవాలి.
పరిణామం:
సంబంధం మొదట్లో ఉన్నట్లుగా జీవితాంతం ఉండదు. కాలక్రమేణా ఇది పరివర్తన చెందుతుంది. పరిణామం చెందుతూ వస్తుంది. సంబంధంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ వాటిని అంగీకరిస్తూ ముందుకు సాగాలి.
కెమిస్ట్రీ:
దంపతుల మధ్య కెమిస్ట్రీ అంటే అది మానసికమైనది, భావోద్వేగమైనది. శారీరకంగా దగ్గరగా ఉండటం వేరు మానసికంగా దగ్గరగా ఉండటం వేరు. సంబంధంలో ఇద్దరు దంపతుల మధ్య కెమిస్ట్రీ బాగుండటం అంటే మానసికంగా ఒక్కటవ్వడం. ఒకరి శారీరక భాషను మరొకరు అర్థం చేసుకోవాలి.
విలువలు:
ప్రతి మనిషి కొన్ని విలువలు ఉంటాయి. వాటిని మరొకరు గౌరవించాలి. వాటిని అంగీకరించాలి. ముఖ్యంగా దాంపత్య బంధంలో ఇద్దరికి వేర్వేరుగా ఉండే విలువలను ఎవరూ అవమానపరచకూడదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి విలువలను మరొకరు అంగీకరించాలి. జీవిత భాగస్వామికి అవి ఎంత ప్రాధాన్యమైనవో అర్థం చేసుకుని మెలగాలి.
సంఘర్షణ:
దాంపత్య బంధంలో గొడవలు కామన్. ఇద్దరు పూర్తిగా వేర్వేరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉండే సమయంలో ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి రాకుండా పోదు. ఆ అసంతృప్తే గొడవలకు దారి తీస్తుంది. అయితే గొడవల వేళ మీ భాగస్వామి ఎలా స్పందిస్తారు, ఎలాంటి పదాలు వాడతారో ఒక అవగాహన ఉండాలి. వారి స్పందన ఎలా ఉంటుందో ముందే ఒక అంచనా ఉంటే అది చూపే ప్రభావం తక్కువగా ఉంటుంది.
గత గాయాలు:
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. ఆ గతం నిండా ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలన్నీ పాజిటివ్ గానే ఉండాలని లేదు. కొన్ని మనస్సును గాయం చేసేవి కూడా ఉండొచ్చు. అయితే దాంపత్య బంధంలో ఉన్నప్పుడు వాటిని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఏదైనా గొడవ జరిగినప్పుడు వాటిని తవ్వి విమర్శలు చేయడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఇద్దరి మధ్య నమ్మకం, విశ్వాసం లేకుండా పోతుంది. ఇది సంబంధానికి బీటలు వారేలా చేస్తుంది. అందుకే గత గాయాలను తవ్వకూడదని రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తుంటారు.



Click it and Unblock the Notifications