For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమాన్స్ తర్వాత ఇలా మాట్లాడితే.. మీ బంధం మరింత బలపడుతుందట...!

|

రొమాన్స్ అంటే కేవలం రెండు శరీరాలు ఒక్కటవ్వడం.. కలయికలో పాల్గొనడం మాత్రమే కాదు.. అది రెండు మనసుల మధ్య అల్లుకుపోయే బంధానికీ ప్రతీక.

మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన లేదా మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి మిమ్మల్ని మీ కంటే ఎక్కువగా ప్రేమిస్తూ.. ఈ విశ్వంలోని ప్రేమనంతా తన కౌగిలిలో బంధించి మీకు అందిస్తున్నాడంటే.. అంతకంటే అద్రుష్టం మరొకటి ఉండదని చెప్పొచ్చు. అయితే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ఆనందంగా కలిసి ఉండేందుకు శారీరక కలయిక అవసరం అయినప్పటికీ.. దాని కంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే.. మీ ఇద్దరి మధ్య ప్రేమతో పాటు సాన్నిహిత్యం అనేది ఉండాలి. మీరు ఒకరినొకరు ఇష్టపడటమే కాదు.. మీరు ఒకరి విలువను మరొకరు తెలుసుకుని.. వారిని అనునిత్యం గౌరవిస్తూ.. పొగుడుతూ.. వారంటే మీకెంత ఇష్టమోనని.. మీ జీవితంలో వారి రాక వల్ల మీరు ఎంతో సంతోషాన్ని పొందుతున్నారని ఇలాంటి మాటలను అప్పుడప్పుడు మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తిని మీరు సులభంగా హ్యాపీగా మార్చేయొచ్చు.

దీంతో వారు మిమ్మల్ని మరింత గాఢంగా ప్రేమించొచ్చు. ఇలాంటి మాటలను సందర్భానుసారంగా మాట్లాడటం వల్ల మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు. అయితే అలాంటి మాటలను ఎప్పుడెప్పు మాట్లాడాలి.. రొమాన్స్ తర్వాత మాట్లాడొచ్చా.. పార్ట్నర్ ను పొగుడుతూ కొన్ని మాటలు చెప్పడం వల్ల ప్రతి రాత్రి సుఖరాత్రిగా మారుతుందట. ఇంతకీ రతి క్రీడలో పాల్గొన్న తర్వాత మాట్లాడాల్సిన ముఖ్యమైన మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి రెఢీగా ఉండేవారికి.. ఈ వధువులిచ్చే సలహాలేంటో చూసెయ్యండి...పెళ్లికి రెఢీగా ఉండేవారికి.. ఈ వధువులిచ్చే సలహాలేంటో చూసెయ్యండి...

నువ్వు నా పక్కనుంటే..

నువ్వు నా పక్కనుంటే..

మీ భాగస్వామితో బంధాన్ని మరింత పెంచుకోవడానికి.. సాన్నిహిత్యంగా ఉండేందుకు.. తనతో మీరు ఈ డైలాగ్ ను అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. ‘నువ్వు నా పక్కనుంటే.. నాకెంతో లక్కీ.. నిన్ను పార్ట్నర్ గా చేసుకోవడం నా లైఫ్ మారిపోయింది.. నేను ఏం చేస్తే హ్యాపీగా ఉంటానో నీకు బాగా తెలుసు' అనే డైలాగులతో వారు మిమ్మల్ని తప్పక ప్రేమిస్తారు.

రోజు రోజుకు హాట్ గా..

రోజు రోజుకు హాట్ గా..

‘నువ్వు రోజు రోజుకు చాలా హాట్ గా కనిపిస్తున్నావ్.. నన్ను కూడా చాలా హాట్ గా మార్చేస్తున్నావ్.. నీ చూపులు చురకత్తుల్లాగా నన్ను గుచ్చుకుంటున్నయ్.. నాలో మరింత సెగలు కక్కిస్తున్నాయ్' ఇలాంటి మాటలతో వారికి ఆటోమేటిక్ గా మూడ్ వచ్చేసింది. మీరిద్దరూ రతి క్రీడలో రెచ్చిపోవచ్చు.

చాలా మిస్సయ్యాను..

చాలా మిస్సయ్యాను..

‘ఇన్ని రోజులు నేను నిన్ను చాలా మిస్సయ్యాను. మనిద్దరం కలకాలం ఇలాగే కలిసి ఉంటే ఎంత మంచిగా ఉంటుందో కదా.. నువ్వు నన్ను చాలా చాలా క్రేజీగా మార్చేస్తున్నావ్.. ఇది చాలా అద్భుతమైన అనుభవం. ఇలాగే ప్రతిరోజూ ఉంటే ఎంత మంచిగుంటుందో' అనే మాటలతో మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారొచ్చు.

పెళ్లైన తర్వాత పండుగ వేళ నవ వధువులు అలానే ఆలోచిస్తారా?పెళ్లైన తర్వాత పండుగ వేళ నవ వధువులు అలానే ఆలోచిస్తారా?

నీ సెక్సీ సీక్రెట్..

నీ సెక్సీ సీక్రెట్..

‘నీ కళ్లలో ఏదో మత్తు ఉంది.. వాటిని చూస్తూ రోజంతా అలా గడిపేయొచ్చు. రోజురోజుకు నువ్వు ఇంత సెక్సీగా ఎలా మారుతున్నవ్.. నాక్కూడా ఆ సీక్రెట్ ఏంటో చెప్పేయవ్వా.. నువ్వు నన్ను అలా చూస్తే.. నేను అస్సలు తట్టుకోలేను.. నా గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది' ఇలాంటి డైలాగులకు మీ పార్ట్నర్ కచ్చితంగా ఫిదా అవుతారు.

నిన్ను హగ్ చేసుకుంటే..

నిన్ను హగ్ చేసుకుంటే..

‘నిన్ను మనసారా హగ్ చేసుకుంటే చాలు.. నాకు ఉన్న టెన్షన్లు, ఆందోళన అన్నీ ఒక్కసారిగా మాయమైనట్టు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఇంతకన్నా అద్భుతమైనది ఏది లేదనిపిస్తుంది. నాకు నిజంగా ఇలాంటిదే కావాలి. నువ్వు నా మనసును అలా చదివేశామో అనిపించింది తెలుసా' అంటే చాలు వారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.

నువ్వెందుకు స్పెషల్..

నువ్వెందుకు స్పెషల్..

‘నా లైఫ్ లో ఇప్పటివరకు నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. బహుశా చూడలేనేమో కూడా. ఎందుకంటే నువ్వు నాకు చాలా స్పెషల్ పర్సన్. నాకు నీతో రొమాన్స్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. నువ్వు కూడా అంతే ఆనందాన్ని ఆస్వాదించావని ఆశిస్తున్నా. నన్ను ఇలాగే పట్టుకుని ఉండిపో.. నువ్వు నన్ను హగ్ చేసుకు చాలా చాలా బాగుంటుంది' ఇలాంటి డైలాగులు మీరు పార్ట్నర్ తో సందర్భానుసారంగా వాడితే చాలు. మీ బంధం జీవితాంతం చాలా బలంగా ఉంటుంది. చూశారు కదా.. మీరు కూడా మీ పార్ట్నర్ తో ఇలాంటి మాటలను మాట్లాడి చూడండి.. రిజల్ట్ కచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది.

English summary

Things to Say to Your Spouse to Deepen Your Connection

Here are things to say to your spouse to deepen your connection. Have a look
Story first published: Friday, September 17, 2021, 17:12 [IST]