For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా భర్త చేసేది నచ్చట్లేదు.. తనకు దూరంగా వెళ్దామనుకుంటున్నా... కానీ’

|

ఒక వివాహం జీవితంలో జరిగే వివాదాలకు మీరే ఒక కారణమైతే అది గుర్తించడం కాస్త కష్టమే. మీ భర్తను నిందించడం మరియు ఏ అపరాధ భావమూ లేకుండా దూరంగా వెళ్ళిపోవటం మీకు చాలా తేలిక. కానీ, ఈ చిన్న విషయాలే జీవితంలోకి రావడం మొదలైతే, రాను రానూ నిందలు వెయ్యడం అలవాటుగా మారిపోతుంది.

కానీ ఇక్కడ మలుపు ఏమిటంటే, మీ వివాహ జీవితాన్ని నాశనం చేసేది ప్రధానంగా మీరే అయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే అలాటు మీ భాగస్వామికి కూడా ఉంటే.. అలాంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తనతో కలిసి ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మీరు మీ భర్త నుండి విడిపోవాలనిస్తే.. మాత్రం నష్టపోయేది మీతో పాటు మీ పిల్లలు కూడా. కాబట్టి మీరు భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకోకూడదు.

ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారి ఆలోచించి.. మంచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.. ఓ వివాహితకు తన భర్తతో రిలేషన్ షిప్ లో చాలా ప్రాబ్లమ్ గా ఉందని చెప్పుకొచ్చింది.. ఇంతకీ తనకు అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది.. తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి ముందు 'ఆ'విషయాల గురించి అడగడం అస్సలు మరువకండి...!

హాయ్ 'నా పేరు ప్రియ(పేరు మార్చాం). నేను గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. నాకు పెళ్లై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే పెళ్లి జరిగిన నాటి నుండే మా ఇద్దరి మధ్య సంబంధం సాన్నిహిత్యంగా లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తన ప్రవర్తన మరింత చిరాకు తెప్పిస్తోంది. దీంతో నేను తనతో ఆనందంగా గడపలేకపోతున్నాను.

బాబు పుట్టాడు..

బాబు పుట్టాడు..

మా రెండు సంవత్సరాల కాపురానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. బాబు కోసం ఇన్నాళ్లు అన్ని భరించినా.. ఇక నుండి తనతో కలిసి ఉండాలంటేనే నాకు చాలా ఆందోళన కలుగుతోంది. దీంతో నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.

విడిపోదామంటే..

విడిపోదామంటే..

నేను విడాకులు తీసుకుని తన నుండి దూరంగా వెళ్దామంటే.. నాకు పిల్లాడి గురించి చాలా బెంగగా ఉంది. పైగా నా పిల్లాడు మా ఇద్దరి మధ్య గొడవలు చూసి ఎంతగా భయపడతాడో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటివరకు ఇంట్లో మేము ముగ్గురమే ఎక్కువగా ఉండేవాళ్లం. మా పిల్లాడికి మా ఇద్దరితో రిలేషన్ బాగుంది. కానీ మేమిద్దరం విడిపోతే బాబు ఎవరో ఒకరి వద్దే ఉండాల్సి వస్తుంది. కానీ నేను అలా చేయలేను.

పిల్లాడిని వదులుకుంటే..

పిల్లాడిని వదులుకుంటే..

ఒకవేళ నేను పిల్లాడిని వదులుకుంటే.. నా బాబ ప్రవర్తన, ఆలోచనా విధానం అన్ని మారిపోతాయి. తను పెరిగి పెద్దయిన తర్వాత అచ్చం నా భర్తలా మారితే బాగుండదు. కాబట్టి నేను మంచి సలహా కోసం ఎదురుచూస్తున్నాను. పిల్లాడు ఉన్నాడు నేను తీసుకునే నిర్ణయం బెస్ట్ గా ఉండాలి. నా నిర్ణయం ఎవరినీ బాధ పెట్టకూడదంటే.. నేనేం చేయాలి. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు' అంటూ ఓ వివాహిత తన బాధను చెప్పుకుంది.

Relationship Problems: పెళ్లైన వారు‘ఆ కార్యం'లో ఆందోళనలను అధిగమించాలంటే...

చాలా కష్టమే..

చాలా కష్టమే..

మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టమైనదే. నేటి కాలంలో చాలా మంది మహిళలు తమ భాగస్వామితో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మీరు ఉత్తమ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.. మీ బాబు భవిష్యత్తు కోసం ఆలోచించడం కూడా మంచిగానే ఉంది.

మంచి వాతావరణంలో..

మంచి వాతావరణంలో..

అయితే మీరు ఇప్పుడు భావోద్వేగంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అది మీ బాబుపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. పైగా మీ పిల్లాడు చాలా ఎదగాలి. ఇలాంటి సమస్యల వల్ల తన భవిష్యత్తు నాశనం కాకూడదు. మీ పిల్లాడు మంచి వాతావరణంలో పెరగాలి. అలా చేయడం మీ బాధ్యత.

ఒకటికి రెండుసార్లు..

ఒకటికి రెండుసార్లు..

కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీ పిల్లాడి భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరు మీ స్నేహితులతో, పెద్దలతో ఒకసారి దీని గురించి మాట్లాడండి. మీరిద్దరూ మీ బాబు ముందు అరచుకోవడం.. గొడవపడటం వంటివిచేయకండి. ఒకవేళ మీ ఇద్దరు గొడవలు పడినా మీ బాబుకు దూరంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోండి.

మనసు పాడు చేసుకోవద్దు..

మనసు పాడు చేసుకోవద్దు..

అంతేగానీ ఎక్కువగా ఆలోచించి మీ మనసును పాడు చేసుకోకండి. మీ బాబు జీవితాన్ని ప్రశాంతంగా ఉండేలా చూడండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్లో సఖ్యత కోసం మంచి మానసిక నిపుణులను సంప్రదించండి. అప్పుడు మీకు కచ్చితంగా మంచి పరిష్కారం లభించొచ్చు.

English summary

Things You Must Know Before Separating From Your Husband

Here are these things you must know before separting from your husband. Take a look
Story first published: Monday, May 10, 2021, 17:01 [IST]