Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Relationship Tips: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదా.. అయితే ఈ పనులు చేయండి
మీ భర్త మిమ్మల్ని పట్టుకోవడం లేదని మీరు అనుకుంటున్నారా.. అలా జరగడానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అయితే ఆ కారణాలు ఏంటి, అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఆ సమస్య పెరిగి పెద్దది అవకుండా పరిష్కరించవచ్చ
ప్రతి బంధంలో గొడవలు సాధారణం. కలహాలు లేని కాపురాలు ఉండవు. ఇద్దరు దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో వాగ్వాదాలు, తీవ్రమైన చర్చలు, అలకలు ఉండనే ఉంటాయి. ఒక స్థాయి వరకు జరిగే గొడవల వల్ల ఇద్దరు దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. అయితే ఆ కలహాల వల్ల దంపతులు దూరంగా ఉండటమే అసలైన సమస్య. గొడవ జరిగినప్పుడు లేదా సాధారణ రోజుల్లో మీ భర్త మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధిస్తుంది. అది నిరాశకు దారితీస్తుంది. దాని వల్ల బంధంలో చీలికలు ఏర్పడి విడిపోయే వరకూ వెళ్తుంది.

మీ భర్త మిమ్మల్ని పట్టుకోవడం లేదని మీరు అనుకుంటున్నారా.. అలా జరగడానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అయితే ఆ కారణాలు ఏంటి, అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఆ సమస్య పెరిగి పెద్దది అవకుండా పరిష్కరించవచ్చు.

భర్తలు భార్యలను నిర్లక్ష్యం చేయడానికి కొన్ని కారణాలు:
- తరచూ గొడవలు జరగడం
- చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారడం
- పని ఒత్తిడి
- సంబంధంలో బోరింగ్
- ఆర్థిక సమస్యలు
- అపార్థాలు
కారణం ఏదైనా మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తుంటే.. మీరు ఏం చేయాలి, ఎలాంటి పనుల వల్ల తిరిగి సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవచ్చు, ఎలాంటి చర్యలు మీకు సహాయం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సమయం ఇవ్వాలి:
ఏదైనా సంబంధంలో భాగస్వామికి అవసరమైన సమయాన్ని, ప్రైవసీని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వ్యక్తిగత అభిరుచులు ఉంటాయి. వాటితో కాలక్షేపం చేయడానికి కొంత సమయం వెచ్చించాలనుకుంటారు. అలాంటి వారికి కొంత సమయం ఇవ్వాలి.
పని ఒత్తిడి, వ్యాపార ఒత్తిడి, ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టినప్పుడు కొంత సమయం గడపనివ్వాలి. వారు ఒక సమస్యతో సతమతం అవుతున్నప్పుడు మీ సమస్య వారి ముందు పెడితే వారు ఇంకా ఒత్తిడికి గురవుతారు. అందుకే కొంత సమయం ఇచ్చి చూడండి. ఆ సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది. చాలా గాయాలను సమయమే మంచి ఔషధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి

ధైర్యంగా ఉండాలి:
మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం వెనక అసలు కారణం మీకు తెలియకపోవచ్చు. ఎన్నో కారణాలు ఉండొచ్చు. వారు ఒత్తిడిలో అలా ప్రవర్తిస్తుంటే మీరు ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం.
వారికి అవసరమైన సహాయం చేయడానికి ప్రయత్నించాలి. మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి సమస్య అయినా త్వరలో పరిష్కారమవుతుంది అనే భరోసా కల్పించాలి. సానుకూల ఆలోచనలు పంచుకోవాలి.

మాట్లాడాలి:
చాలా సమస్యలు మాట్లాడటం ద్వారా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా దాంపత్య బంధంలో కమ్యూనికేషన్ చాలా చాలా కీలకం. మీ భావాలను, భయాలను, భావోద్వేగాలను భాగస్వామితో పంచుకోవాలి. మనసు విప్పి మాట్లాడాలి. అలా మాట్లాడితేనే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

వారిలా ఆలోచించడానికి ప్రయత్నించాలి:
ఎవరైనా ఒకరు సమస్య ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం చాలా కీలకం. మానసికమైన, భావోద్వేగమైన సమస్యను కనుక్కోవడానికి వారిలా ఆలోచించడానికి ప్రయత్నించాలి.
వారి అవసరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారి భయాలు ఏమిటో, వారు ఎలా ఫీలవుతున్నారో తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications











