Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా.. సరైన వ్యక్తిని ఇలా కనిపెట్టండి
ఈ లక్షణాలు కనుక మీరు పెళ్లి చేసుకోబోయే వారిలో ఉంటే నిస్సంకోచంగా వారిని పెళ్లి చేసుకోవచ్చు. జీవితాన్ని సుఖమయంగా మార్చుకొని రంగుల జీవితాన్ని గడపొచ్చు. అయితే ఆ నాలుగు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లంటే నూరేళ్ల పంట. సంబంధం చూస్తున్నామంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అమ్మాయి లేదా అబ్బాయి ఎంపికలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఇద్దరు మనుషుల జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇక వీరికి పిల్లలు పుట్టాక గొడవలు జరిగితే వారి జీవితాలు కూడా నాశనం చేసినట్టే. అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేవాళ్లు.. అమ్మాయి లేదా అబ్బాయిల్లో ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి.

ఈ లక్షణాలు కనుక మీరు పెళ్లి చేసుకోబోయే వారిలో ఉంటే నిస్సంకోచంగా వారిని పెళ్లి చేసుకోవచ్చు. జీవితాన్ని సుఖమయంగా మార్చుకొని రంగుల జీవితాన్ని గడపొచ్చు. అయితే ఆ నాలుగు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అందం కంటే వ్యక్తిత్వం ఉన్న వారిని ఎంచుకోవాలి:
మీరు చేసుకోబోయేవాళ్లు అందంగా ఉండాలని కోరుకోవడం సహజమే. కానీ ఆ ఒక్క కారణం చేత మీరు వాళ్లని పెళ్లి చేసుకోకూడదు. అందం కంటే వ్యక్తిత్వం గొప్పది. చూసేందుకు ఆరడుగుల పొడవు, స్టైల్ గా ఉండే వాళ్ల కంటే మనుషులతో మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చూసేందుకు మామూలుగా ఉన్నప్పటికీ.. వారి ప్రవర్తన బాగుండి, అందరితో మంచిగా మెదిలితే వారిని పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు.

2. కాంప్రమైజ్ కావాల్సిన అవసరంలేదు:
మనకు కాబోయే వారిలో కొన్ని లక్షణాలు, అర్హతలు ఉండాలనుకున్నప్పుడు వారు అంత త్వరగా దొరక్కపోవచ్చు. ఒకటి, రెండు, మూడు ఇలా సంబంధాలు చూసిన సంఖ్య పెరుగుతూ పోతుందని అనుకోవచ్చు. దాని నుండి కోరుకున్న వారు దొరకట్లేదన్న నిరాశ వచ్చేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఓపికగా ఉండాలి. ఇది బట్టల షాపింగ్ కాదు నచ్చిన రంగు, నచ్చిన డిజైన్ దొరక్కపోతే వేరే షర్టుతో సర్దుకుపోవడానికి. ఇది మీ జీవితం. ఒక్కసారి పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యాక వారితోనే జీవితాంతం ఉండాలి. అందుకే ఎక్కడైనా కాంప్రమైజ్ కావొచ్చు కానీ, పెళ్లి విషయంలో మాత్రం కావొద్దు. మీరు నచ్చిన అంశాలు ఉన్న వారి కోసం కొద్ది కాలం ఆగినా తప్పులేదు.

3. ఒకరి కోసం ఒకరు తెలుసుకునేందుకు సమయం కేటాయించేవాళ్లకే ఓటు:
వివాహానికి ముందు ఒకరి గురించి మరొకలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొంత మంది పెళ్లయ్యాక చూస్కోవచ్చులే అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం పెళ్లికి ముందే కాబోయే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు. ఇదే సరైన పద్ధతి. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉండాలంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే పెళ్లయ్యాక వారిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు వాటిల్లవు.

4. గత సంబంధాల గురించి చెప్పడమే బెటర్:
మీరు ఒకరితో జీవితాన్ని పంచుకోవడానికి నిర్ణయం తీసుకునే ముందు చాలా మందితో డేటింగ్ చేయవచ్చు. అలాంటప్పుడు మీ గత సంబంధాల గురించి కాబోయే వారికి చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే పెళ్లి అయ్యాక మీ గతం గురించి తెలిసినప్పుడు వారు చాలా బాధపడవచ్చు. ఒక్కోసారి అది విడాకులకు కూడా దారితీయవచ్చు. పెళ్లి చేసుకుని భయంభయంగా గడిపేకంటే ముందే అర్థమయ్యేలా చెప్పడం వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవచ్చు. భాగస్వామి మనసు నొచ్చుకోకుండా చూడొచ్చు.



Click it and Unblock the Notifications