Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే...!
మీ వివాహ బంధం వంటి కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలి.. ఎవరిని ఆహ్వానించకూడదో తెలుసుకోండి.
మన దేశంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పెళ్లి అంటే ఏడు అడుగులు..మూడు ముళ్లు.. ఎందరో అతిథులు.. అనేక ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎన్నో ఉంటాయి.

ఈ సందర్భంలో మీరు త్వరలో వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వివాహం అంటే ఎంగేజ్ మెంట్ దగ్గరనుండి రిసెప్షన్ వరకు ఎన్నో పనులు ఉంటాయి. అందులో ముందుగా చేసే పని అతిథులను ఆహ్వానించేందుకు జాబితాను రూపొందించడం వంటిది కష్టమైన పనుల్లో ఒకటి.
ఆ తర్వాత అందమైన వస్త్రాలు, మీరు ధరించే సూట్లు, హనీమూన్ కోసం ఎలాంటి ప్రదేశానికి వెళ్లాలి.. ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. అయితే మీ పెళ్లికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానించడానికి మీరు ఇష్టపడకపోవచ్చు. అంతేకాదు మీ అతిథుల జాబితాను తగ్గించడం మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. అంతేకాదు మీరు ఇతరుల (పొరుగింటి వారు) వివాహానికి హాజరైనందున లేదా మీరు ట్రావెల్ బడ్డీలుగా ఉన్నందున మీరు మీ వివాహానికి అలాంటి వారిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మీ వివాహానికి ఎవరెవరు రావాలి అని నిర్ణయించుకోవడం అనేది మీపై మరియు మీ భాగస్వామిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. దీని కోసం మీరు మీ బడ్జెట్ మరియు వేదిక సామర్థ్యం ప్రకారం జాబితాను తగ్గించవచ్చు. అందుకోసం మేము కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. అవేంటో మీరు చూడండి...

ప్రాథమిక జాబితా..
మీ వివాహం గురించి ప్లాన్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన మొదటి విషయం ఇది. మీకు దగ్గరగా ఉండే కుటుంబసభ్యులు, సన్నిహితులు మరియు ముఖ్యమైన బంధువుల పేర్లను రాసుకుని ఒక జాబితాగా తయారు చేసుకోవడం ప్రారంభించాలి. వారి వివాహాలకు ఇతర కార్యక్రమాలకు మిమ్మల్ని ఆహ్వానించిన వ్యక్తుల పేర్లను కూడా మీరు చేర్చవచ్చు. దీనికి తోడు, మీరు కోరుకుంటే, మీరు అరుదుగా కలిసే మీ స్నేహితుల పేర్లను జోడించవచ్చు.

బడ్జెట్ ప్లాన్..
మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నారంటే ముందుగా అతిథుల జాబితా మిమ్మల్ని ప్రభావితం చేయదు. అయితే మీరు అతిథుల జాబితాను తయారు చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్లాన్ బడ్జెట్. ఫంక్షన్ హాలు దగ్గర నుండి క్యాటరింగ్ మరియు రిటర్న్ గిఫ్టుల కోసం మీరు ఎంత ఖర్చు చేస్తారో ఒక అంచనా వేసుకోవాలి. మీ వివాహ వేడుకలో మీరు ఎంత మంది అతిథులు వచ్చినా వారిని సంతోషపరచేందుకు ఈ బడ్జెట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ బడ్జెట్ ను బట్టి మీరు మీ అతిథుల జాబితాను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. మీరు మీ ఫేస్ బుక్ ఫ్రెండ్లను జోడించినట్లయితే, మీరు ఆ వ్యక్తుల పేర్లను తొలగిస్తే ఎలాంటి నష్టం ఉండదు.

ఫంక్షన్ హాలు సామర్థ్యం..
మీరు అంచనా వేసిన బడ్జెట్ కు తగ్గట్టు ఫంక్షన్ హాలు సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఉదాహరణకు మీ వేదిక 100 మంది అతిథులను ఆహ్వానించేందుకు సరిపోతే, మీరు కనీసం 150 మంది అతిథులను ఆహ్వానించేలా వేదికను బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉంది కాబట్టి మీరు కేవలం 100 మంది లోపు ఉండే వేదికను బుక్ చేసుకుంటే సరిపోతుంది.

మీ భాగస్వామితో చర్చించండి..
పెళ్లికి ముందు మీరు ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన పనుల్లో ఇది ఒకటి. మీ అతిథి జాబితాను మీ భాగస్వామితో చర్చించండి. మీరు మీ భాగస్వామి వైపు నుండి అతిథుల సంఖ్యను తెలుసుకోగలుగుతే, వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మేనత్త, మేనమామల వంటి విషయాల గురించి చర్చించవచ్చు. అంతేకాదు, మీరు మీ అదనపు అతిథుల సంఖ్యను కూడా నిర్ణయించవచ్చు.

ఎవరిని ఆహ్వానించకూడదంటే..
మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులలో ఇదొకటి. మీ పెళ్లికి మీరు ఎవరు రావాలనుకుంటున్నారో నిర్ణయించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ప్రతి చిన్న విషయానికీ గొడవ పడే బంధువులు, స్నేహితులను ఆహ్వానించకపోవడమే మంచిది.

మీరే ప్రశ్నించుకోండి...
మీ వివాహానికి ఎవరు హాజరు కావాలో నిర్ణయించడం నిజంగా కఠినమైన మరియు గమ్మత్తైన విషయమే. అయితే మీరు అంచనా వేసిన బడ్జెట్ ను తయారు చేసి, మీ వేదిక సామర్థ్యాన్ని సమీక్షించిన తర్వాత కూడా మీరు అతిథులను తొలగించకపోతే, మీకు మీరే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను వేసుకోవాలి. మీరు కొన్ని సంవత్సరాలుగా వారితో మంచి సంబంధాలను కలిగి ఉన్నారా? అవి మీకు మరియు మీ కుటుంబానికి అర్థం అవుతాయా? వారు ఏదైనా కార్యక్రమంలో లేదా పార్టీలో అవనసరమైన నాటకంతో ఇబ్బంది పెడతారా? వంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఫైనల్ లిస్ట్..
మీరు ఫైనల్ లిస్ట్ జాబితాను రూపొందించిన తర్వాత, మీరు దానికి కట్టుబడి ఉండాలి. మీరు ఇప్పటికే వారి పేర్లను జాబితా నుండి తొలగించిన వారిని తిరిగి యాడ్ చేయడంలో ఎలాంటి అర్థం ఉండదు. ఎందుకంటే మీరు ఏవైనా కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మీకు సమస్యలను తీసుకురావచ్చు. అయితే మీరు అదనపు అతిథుల కోసం కొన్ని సంఖ్యలను కేటాయించవచ్చు. మీరు కొంతమంది వ్యక్తుల పేర్లను తిరిగి యాడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటే, మీరు వారిని అదనపు అతిథుల విభాగానికి చేర్చొచ్చు.



Click it and Unblock the Notifications











