Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ పార్ట్‌నర్‌తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి సహాయంతో సెక్స్ చేయకుండానే భాగస్వామిని రెచ్చగొట్టవచ్చు. ఆమెలో లేదా అతనిలో వేడి పెంచవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దీర్ఘకాలిక సంబంధంలో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం సవాలుగా ఉంటుంది. కానీ సంబంధాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది చాలా అవసరం. జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉండటం అంటే చాలా శృంగారం మాత్రమే అనుకుంటారు. అయితే శృంగారం పట్ల కొత్తలో ఉన్నంత ఆసక్తి, ఇష్టం, కోరిక తర్వాత్తర్వాత ఉండవు. శృంగారం ఒక రొటీన్‌లా మారిపోతే దానిలో మజా దొరకదు. అయితే శృంగారాన్ని మాత్రమే కాకుండా ఇతర దారుల్లోనూ జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉండొచ్చు.

సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటితో దాంపత్య జీవితంలో స్పార్క్‌ను మేల్కొలపవచ్చు. దాని వల్ల ఇద్దరి మధ్య ఒక బంధం బలోపేతం అవుతుంది. ఈ చిట్కాలతో శృంగారం చేయకుండానే సన్నిహితంగా మెలగవచ్చు.
ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి సహాయంతో సెక్స్ చేయకుండానే భాగస్వామిని రెచ్చగొట్టవచ్చు. ఆమెలో లేదా అతనిలో వేడి పెంచవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం:
పాత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. గతంలో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత సన్నిహితంగా మెలిగారో ఇద్దరూ కూర్చొని గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా, హాయిగా ఉంటుంది. వివాహం జరిగిన కొత్తలో ఇద్దరూ కలిసి గడిపిన సమయం, రాత్రుళ్లు ఎంత హాయిగా గడిచిందో నెమరువేసుకోవడం మూడ్ తెప్పిస్తుంది. ఇలా కేవలం మాటల ద్వారానే ఇద్దరూ సన్నిహితంగా ఉండొచ్చు. ఇలాంటి హాట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఒకరిని ఒకరు తాకుతూ ఉండటం వల్ల ఇద్దరిలో వేడి పెరిగిపోతుంది.
రొమాన్స్‌ను కేవలం బెడ్రూముకే పరిమితం చేయొద్దు:
దంపతుల మధ్య బంధాన్ని, సాన్నిహిత్యాన్ని కేవలం పడకగదిలే పరిమితం చేయకూడదు. వంటగది, స్టడీ రూము, హాల్ ఇలా ఇంట్లో ఎక్కడైనా భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాలి. వంటగదిలో స్పైసీగా చాలా చేయవచ్చు. స్టడీ రూమును కూడా బెడ్రూము చేసేయవచ్చు. హాలును మీ ఇద్దరి ఏకాంతమందిరంగా మార్చవచ్చు. రొమాన్స్ చేయాలన్న మూడ్ మీలో ఉంటే చాలు.
- మీకేం కావాలి, మీకేమంటే ఇష్టమో భాగస్వామితో నేరుగా చెప్పాలి. దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకం. అది గుర్తుంచుకోవాలి.
- ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. వారానికో డేట్, కలిసి గడపడం, ఇద్దరే కలిసి ప్రత్యేక సమయాన్ని గడపాలి.
- ప్రయోగాలు చేయాలి. సన్నిహితంగా ఉండే విషయంలో ఎప్పుడూ కొత్తగా ఉండటానికి ప్రయత్నించాలి.
- రొమాంటిక్‌గా ఉండాలి. ఇంట్లో రొమాన్స్ చేయడానికి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు.
- ప్రేమ చూపించాలి, ప్రేమిస్తున్నట్లు చెప్పాలి. కౌగిలింత, ముద్దు పెట్టుకోవడం, పట్టుకోవడం వంటి శారీరక స్పర్శ ద్వారా కూడా ప్రేమను తెలియజేయాలి.
- సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాలి. రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే భాగస్వామితో ప్రేమగా గడపాలి.
- ఇంట్లో శృంగార వాతావరణాన్ని సృష్టించండి. కొవ్వొతులు, మధురమైన సంగీతం, మూడ్ తెప్పించే లైటింగ్, పోస్టర్లతో మీ భాగస్వామిలో కోరికలు రగిలించాలి.
- బెడ్రూములో కొత్తగా ప్రయత్నించండి. కొత్త భంగిమలు ప్రయత్నించాలి. రోల్ ప్లేయింగ్, ఫాంటసీ లాంటివి చేస్తూ కొత్తగా చేయాలి.



Click it and Unblock the Notifications