Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లాక్ డౌన్ వేళ.. టాలీవుడ్ లో పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!
కరోనా లాక్ డౌన్ వేళ టాలీవుడ్ లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఓ ఇంటి వారవుతున్నారు.
కరోనా లాక్ డౌన్ వేళ టాలీవుడ్ లో పెళ్లి కళ కొట్టొచ్చొనట్టి కనబడుతోంది. ఇన్నాళ్లు ఎలాంటి ఉలుకు, పలుకు లేకుండా ఉన్న ప్రముఖులు సైతం అకస్మాత్తుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు తమ బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మన భళ్లాలదేవా(రానా) కూడా చేరిపోయాడు.

తన ఫియాన్సీ గురించి తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే మిగిలిన వారి కళ్యాణానికి కరోనా ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. అలా కరోనా సమయంలో ఓ ఇంటి వారైన టాలీవుడ్ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

లాక్ అయిన రానా...
భళ్లాలదేవుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న రానా ఇన్ని రోజులు బ్యాచ్ లర్ గా గడిపాడు. తన పెళ్లి విషయం గురించి ఎవర్నడిగినా సమాధానం దాటవేస్తూ వచ్చాడు. అయితే కరోనా లాక్ డౌన్ వేళ మాత్రం తన ఫియాన్సీ వివరాలను చెప్పి అందరికీ షాకిచ్చాడు. డిసెంబరులో తన వివాహం జరిగే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

భళ్లాలదేవుడితో బజాజ్..
అంతేకాదు తన కాబోయే భార్య మిహీకా బజాజ్ తో కలిసి దిగిన ఓ సెల్ఫీని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపడిచాడు. తన ఎంగేజ్ మెంట్ కు సమయం ఎంతో దూరంలో లేదని చెప్పేశాడు. అంతేకాదు అతి త్వరలోనే తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు సైతం ఇచ్చాడు. దీంతో రానా అభిమానులు తన ప్రేమ గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ వెతికారు. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం సాగించిన రానా ఫియాన్సీ గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపారు.

వైఘా రెడ్డితో దిల్ రాజు
టాలీవుడ్ లో ప్రస్తుత లాక్ డౌన్ వేళ అందరి కంటే ముందుగా పెళ్లి చేసుకున్న వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందు వరుసలో ఉన్నాడు. ఇటీవలే తను కూడా సోషల్ మీడియా ద్వారా తన రెండో పెళ్లి గురించి వివరాలు తెలియజేశాడు. ఆ తర్వాతి రోజే తన వైఘా రెడ్డితో వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు తన కూతురే ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించినట్లు పుకార్లు కూడా వినిపించాయి.

నిఖిల్ నిశ్చితార్థం..
ఇక టాలీవుడ్ లో మరో యంగ్ హీరో నిఖిల్. హ్యాపీ డేస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో కూడా ఇంతకుముందే తన ఎంగేజ్ మెంట్ వివరాలను కూడా వెల్లడించాడు. అయితే పెళ్లి కావాల్సిన సమయంలో లాక్ డౌన్ వచ్చింది.

పల్లవి వర్మతో నిఖిల్..
అయితే లాక్ డౌన్ మళ్లీ పొడిగించే అవకాశాలు ఉన్నాయని, ఇటీవలే ప్రధాని ప్రకటించడంతో, నిఖిల్ పల్లవి వర్మతో కలిసి గురువారం రాత్రి వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి యొక్క ఫొటోలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు.

వైరల్ అయిన ఫొటోలు..
అయితే దిల్ రాజ్ జంట కంటే యంగ్ హీరో నిఖిల్ జంట ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయిపోయాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అయితే అందరి కంటే ఓ నెటిజన్ కామెంట్ అందరిని ఆకట్టుకుంది. అదే ‘టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చేసిందే బాలా‘ అని కామెంట్లు చేస్తున్నారు.

మిగతా హీరోలు కూడా..
ఈ లెక్కన చూసుకుంటే.. మిగిలిన టాలీవుడ్ హీరోలు కూడా తమ బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ చెప్పేసి.. త్వరగా ఓ ఇంటి వారయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా నిఖిల్ వివాహం పూర్తవ్వడంతో.. ఇక తర్వాత నితిన్ ఒక్కడే ప్రస్తుతానికి పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. తన వివాహం కూడా ఏప్రిల్ 16నే కావాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

జబర్దస్త్ మహేష్..
అయితే లాక్ డౌన్ వేళ మరో టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ మహేష్ కూడా అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ నటుడు తన కొత్త జీవితాన్ని బంధువుల అమ్మాయితోనే ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కూడా బాగా వైరల్ అయ్యాయి.

శుభాకాంక్షల వెల్లువ..
నిఖిల్ పెళ్లి చేసుకున్న రోజే మహేష్ కూడా పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజన్లు, వారి మిత్రులు, శ్రేయోభిలాషులందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేష్ తన బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ వల్ల అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. వీరి జోడిలను చూసిన నెటిజన్లంతా ‘నైస్ పెయిర్‘ ‘దీర్ఘసుమంగళి భవ‘ అంటూ పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Click it and Unblock the Notifications