Latest Updates
-
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ రెండో పెళ్లి పెద్ద ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!
నిర్మాత, తాజాగా ఓ బ్రహ్మణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు.
సాధారణంగా సినీ ఇండస్ట్రీ వారు ఎవరినైనా వివాహం చేసుకున్నా... వివాహానికి ముందు ఎవరితో అయినా సన్నిహితంగా ఉంటే, ఆ ఫొటోలు పొరపాటున లీకైతే సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతాయి. అలాంటి వాటిపై సినీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతాంటారు. అలాంటి వారిలో దిల్ రాజ్ కూడా చేరిపోయాడు. కొన్ని రోజులుగా తేజస్విని(వైఘా రెడ్డి)తో రెండో పెళ్లి గురించి అనేక రకాలు ఊహాగానాలు వినిపించేవి.

సోషల్ మీడియాలో ఎవరికి కావాల్సింది వారు పబ్లిసిటీ చేసుకునేవారు. వీటన్నింటిని దిల్ రాజ్ ఖండించకపోగా.. కనీసం దీనిపై స్పందించలేదు. దీంతో అందరూ ఇది నిజమే అనుకున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని నిజం చేస్తూ దిల్ రాజ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో అన్ని రకాల రుమార్స్ ఆయన పుల్ స్టాప్ పెట్టేశారు.
తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎంతో రహస్యంగా ఉంచే ఈ బడా నిర్మాత తాను పెళ్లి చేసుకోబోయే విషయాన్ని కూడా అంతే రహస్యంగా ఉంచారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలా రెండో పెళ్లిళ్లు చేసుకోవడం సాధారణమే. అయితే వీరి పెళ్లి పెద్ద ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు... ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం...

నిన్నటి ట్వీట్లో...
‘కరోనా లాక్ డౌన్ వంటి ప్రస్తుత పరిస్థితులను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రొఫెషనల్ గా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి నుండి కోలుకునేందుకు నాకు సరైన సమయం రాలేదు. అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. నా జీవితంలో కూడా వ్యక్తిగత సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నాను. అందుకు అనుగుణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకే ఇదే మంచి సమయంగా భావిస్తున్నా‘ అంటూ ట్వీట్ చేశారు దిల్ రాజ్.

మూడేళ్ల క్రితమే..
దిల్ రాజు మొదటి భార్య అనిత మూడు సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మరణించారు. అయితే ఆమె మరణించాక దిల్ రాజు చాలా రోజులుగా తేజస్వినితో కలిసే ఉంటున్నాడు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయినా అనిత ఉన్నప్పటి నుంచే దిల్ రాజుకు ఆమెతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారాలు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరిలోనే అంటూ..
అయితే దిల్ రాజు వ్యక్తిగత విషయం కాబట్టి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె ఇష్టపడినప్పుడు, తనతో కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది చెప్పండి. నిజానికి దిల్ రాజు గత ఫిబ్రవరిలోనే అధికారికరంగా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అనే వార్తలొచ్చాయి. అయితే ఈ బడా నిర్మాత వాటిని ఖండించడం లేదు. ఫేక్ న్యూస్ అని కూడా అనలేదు.

తండ్రి ఒంటరితనాన్ని చూడలేక..!
అయితే దిల్ రాజు కూడా ఇండస్ట్రీలో ప్రముఖుడు కాబట్టి ఆయన రెండో పెళ్లి కాస్త హాట్ టాపిక్ అయ్యింది. అంతే.. ఓ దశలో దిల్ రాజు ఒంటరితనాన్ని చూడలేక తన కూతురు హన్షిత రెడ్డే ఈ వివాహానికి ఒప్పించిందట. తనే ఈ రెండో పెళ్లికి పెద్దగా వ్యవహరించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

అందరూ ఊహించినట్టుగానే..
అయితే అందరూ అనుకున్నట్టుగానే ఈ బడా నిర్మాత తన సొంతూరైన నిజామాబాద్ జిల్లాలోని తమ సొంతూరిలోని ఓ దేవాలయంలో ఆదివారం రాత్రి అతికొద్ది ఆహ్వానితుల మధ్య రెండో పెళ్లి తంతును సాదాసీదాగా ముగించేశాడు. ఆ పెళ్లి ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి అయితే సెటైరికట్లు కామెంట్లు చేసింది. ‘ఇక్కడ ఒక పెళ్లికే దిక్కులేదు. నీవేమో రెండో పెళ్లి కూడా. శభాష్ రాజుగారు..సారీ రెడ్డి గారూ‘ అంటూ సెటైరికల్ విషెస్ చెప్పింది. ఏది ఏమైనా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.



Click it and Unblock the Notifications