Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
భాగస్వాముల మధ్య ఎమోషనల్ కనెక్షన్ తగ్గుతుందని సూచించే సంకేతాలివే..!
బంధం కలకాలం హాయిగా, సాఫీగా సాగాలంటే ఎమోషనల్ కనెక్షన్ ను పెంచుకోవాలి. అయితే మీ మధ్య భావోద్వేగ కనెక్షన్ తగ్గిందని సూచించే లక్షణాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎమోషనల్ కనెక్షన్ లేనిది ఏ ఇద్దరి మధ్యా బంధం బలపడదు. అది స్నేహంలోనైనా, ప్రేమలో అయినా పెళ్లిలో అయినా సరే. ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎలాంటి సంబంధాన్ని అయినా సరే బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం, నమ్మకం, ఇష్టం, ప్రేమను కొనసాగించడానికి ఇది చాలా అవసరం. అయితే కాలక్రమేణా అంటే స్నేహం, ప్రేమ, పెళ్లి ఇలా ఏ బంధంలోనైనా రోజులు గడుస్తున్నా కొన్ని భావోద్వేగ కనెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇధి మీ సంబంధాల్లో చాలా సమ్యలు కల్గిస్తాయి. అయితే అలాంటి పొరపాట్లు జరగకుండా మీ బంధం కలకాలం హాయిగా, సాఫీగా సాగాలంటే ఎమోషనల్ కనెక్షన్ ను పెంచుకోవాలి. అయితే మీ మధ్య భావోద్వేగ కనెక్షన్ తగ్గిందని సూచించే లక్షణాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కమ్యూనికేషన్ లేకపోవడం:
ఏదైనా సంబంధంలో కమ్యూనికేషన్ కీలకం. అది లేకపోవడం వల్లే ఇద్దరు మనుషుల మధ్య సమస్యలు, మనస్పర్థలు వస్తాయి. భాగస్వాములు తమ ఆలోచనలు, భావాలు మరియు అనుభవాలను పంచుకోకపోతే.. వారిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నట్లు భావిస్తారు. అలాగే భావోద్వేగంగా కనెక్ట్ కావడంలో సమస్యలు ఏర్పడతాయి.

సాన్నిహిత్యం లేకపోవడం:
సాన్నిహిత్యం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. భావోద్వేగం కూడా. చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం లేదా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం వంటి సాన్నిహిత్యం లోపిస్తే.. అది భావోద్వేగ కనెక్షన్ లోపాన్ని సూచిస్తుంది.

కలిసి సమయాన్ని గడపడంపై దృష్టి పెట్టకపోవడం:
భావోద్వేగ సంబంధాలను ఏర్పరుచుకోవడానికి, కొనసాగించడానికి కలిసి సమయాన్ని గడపడం చాలా ముఖ్యం. భాగస్వాములు కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయకపోతే.. ఇది భావోద్వేగ కనెక్షన్ లోపాన్ని సూచిస్తుంది.

వైరుధ్యాలను నివారించడం:
ఎలాంటి సంబంధంలో అయినా సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ భాగస్వాములు విభేదాలను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలి. అలా జరగడం లేదంటే అది భావోద్వేగ కనెక్షన్ లేకపోవడాన్ని సూచిస్తుంది.

నమ్మకం లేకపోవడం:
నమ్మకం అనేది భావోద్వేగ కనెక్షన్లలో ముఖ్యమైన భాగం. ఇదొక్కటి లోపిస్తే అన్నీ పోయినట్లే. నమ్మకం లేకపోతే మనిషి పక్కనే ఉన్నా దూరంగా ఉన్నట్లు భావిస్తుంటారు భాగస్వాములు.

భావోద్వేగ మద్దతు లేకపోవడం:
భావోద్వేగ కనెక్షన్‌లను ఏర్పరుచుకోవడానికి.. కొనసాగించడానికి భావోద్వేగ మద్దతు ముఖ్యం. భాగస్వాములు ఒకరికొకరు భావోద్వేగ మద్దతును అందించకపోతే.. ఇది భావోద్వేగ కనెక్షన్ లోపాన్ని సూచిస్తుంది.
ఇలాంటి సంకేతాలు ఏమైనా మీ బంధంలో కనుక కనిపించినట్లయితే వెంటనే వాటిని పరిష్కరించుకోండి. ఎమోషనల్ బాండ్ ను పెంచుకోండి. అప్పుడే మీ ప్రేమ పదికాలాల పాటు భద్రంగా ఉంటుంది. మీ జీవితం కూడా హాయిగా, సాఫీగా సాగుతుంది. ఇద్దరూ కలిసి నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి పనులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకాన్ని పెంచుకోవడం వంటివి చేస్తుండాలి.
ఎమోషనల్ బాండ్ అనేది ఎలాంటి బంధంలో అయినా సరే చాలా ముఖ్యం. అయితే మీ మధ్య ప్రేమ పెరుగుతుందా, తగ్గుతుందా అనే దాన్ని కూడా ఇదొక్కటే గుర్తించగలదు. ముందే సంకేతాలను ఇస్తుంది. వీటిని మీరు గుర్తించి జీవితాన్ని ఆనందంగా మార్చుకోండి. జీవిత భాగస్వామి భావోద్వేగాలను, వారు చేసే పనుల ద్వారా గమనించి అందుకు అనుగుణంగా మెలగాలి.



Click it and Unblock the Notifications