For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా భర్త గురించి నాతో నెగిటివ్ గా చెబుతోంది... నమ్మాలా వద్దా’?

|

మనలో చాలా మంది ఆడపిల్లలకు ఇద్దరు అమ్మలు ఉంటారు. అదెలా అంటారా? మనకు జన్మనిచ్చిన తల్లి ఒకరైతే.. మరొకరు మెట్టినింట్లో అత్తమ్మ రూపంలో మరో అమ్మ దొరుకుతారు.

అందుకే ప్రేమకు ప్రతిరూపం అమ్మ అయితే.. పెళ్లి తర్వాత ఆ ప్రేమ అత్త రూపంలో లభిస్తుందని చాలా మంది చెబుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. 'అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతురాలు' అనే జానపదాలు పుట్టుకొచ్చాయి.

పూర్వకాలంలో అత్తమ్మ బతికి ఉన్నంత కాలం కోడలికి మనశ్శాంతి ఉండేది కాదు. మన సినిమాల్లో కూడా ఇలాంటి వాటినే ఎక్కువగా చూపించేవారు. అయితే కాలక్రమేణా అదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రెగ్యులర్ గా సీరియళ్ల రూపంలో అత్తా కోడళ్ల మధ్య పోరును చూపుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..

ఉమ్మడి కుటుంబంలో ఉండే కోడలికి అత్త నుండి ఒక విచిత్రమైన సమస్య వచ్చి పడింది. తన భర్త గురించి ప్రతి ఒక్క విషయాన్ని గుచ్చి గుచ్చి చెబుతోందట. అలాంటి విషయాలు చెబితే తనకు నచ్చడం లేదట. తన భర్త గురించి ఎవరైనా చెడుగా చెబితే భరించలేకపోతుందట.. ఆమె అలా చెప్పినప్పుడల్లా తాను చాలా ఇబ్బందులకు గురవుతుందోట. ఈ పరిస్థితి నుండి తానేలా బయటపడాలని సతమతమవుతోందట. ఈ సమయంలో నేను ఏం చేయాలి.. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో మంచి సలహా ఇవ్వగలరు అని నిపుణులను సంప్రదించింది. అందుకు నిపుణులు ఏమి సమాధానం ఇచ్చారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రంగును ఇష్టపడే వారు పడకగదిలో శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారట...!

నెగిటివ్ విషయాలను..

నెగిటివ్ విషయాలను..

హాయ్..‘నా పేరు వైశాలి(పేరు మార్చాం). నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఇటీవలే కొత్తగా పెళ్లి అయ్యింది. మా అత్తగారు నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. అన్నీ ఓపెన్ గా మాట్లాడతారు. అయితే నా భర్త గురించి ప్రతిరోజూ ఏదో ఒక నెగిటివ్ విషయాన్ని చెబుతారు.

అలా కుదరదు..

అలా కుదరదు..

ఇదే విషయాన్ని నేను నా భర్తకి వెళ్లి చెబితే.. వెంటనే తల్లి, కొడుకు మధ్య గొడవలు అయిపోతాయని సైలెంట్ గా ఉంటున్నాను. ఆ సమయంలో తను కూడా హ్యాపీగా ఫీలవ్వడు. అలా అని నేను మా అత్త నుండి దూరంగా వెళ్లడానికి కుదరదు. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. అయితే తన ప్రవర్తన నాకు నచ్చడం లేదు. నేను ఇలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలి' అనే ఓ వివాహిత తన సమస్యను చెప్పుకుంది.

పరోక్షంగా చెప్పండి..

పరోక్షంగా చెప్పండి..

మీ అత్తగారు మీతో ఎలాగో అన్ని విషయాలను ఓపెన్ గా చెబుతారు కాబట్టి.. తనకు మీరు అలాంటివి నచ్చవని పరోక్షంగా చెప్పాలి. లేదంటే తను ఎప్పటికీ ఆ విషయాలను అర్థం చేసుకోలేదు. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఓపెన్ గా చెప్పేయండి. అలా చెప్పడం వల్ల మళ్లీ అలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. అంతేకాదు ఆమె తన తప్పుల్ని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

వన్ నైట్ స్టాండ్ సెక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...!

ఎలాంటి ప్రభావమో చెప్పండి..

ఎలాంటి ప్రభావమో చెప్పండి..

తనకు మీ ఇద్దరి మధ్య ఉండే లిమిట్స్ గురించి ఒకసారి తెలియజేయండి. మీ ఇద్దరి మధ్య సంబంధాలను ఆమె మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది ఆమె తెలుసుకుంటే.. మీ సమస్య పరిష్కారమైనట్టే. మీరు ఇలా చేయడం వల్ల ఆమె మిమ్మల్ని కాస్త అర్థం చేసుకోవచ్చు.

అవి షేర్ చేసుకోండి..

అవి షేర్ చేసుకోండి..

మీరు మీ అత్తగారితో సరైన కమ్యూనికేషన్ చేస్తే.. ముఖ్యంగా మీ భావోద్వేగాలను తనకు తెలియజేయగలిగితే చాలు. అందుకోసం మీరు కాస్త ఓపిక, తీరికగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు అలాంటి ఇబ్బందుల నుండి ఈజీగా బయటపడొచ్చు.

క్రష్ కోసం ఏ రాశి వారు ఎలా నటిస్తారో తెలుసా...!

తన స్థానంలో ఉండి..

తన స్థానంలో ఉండి..

మీరు మీ అత్తగారి స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించండి. తను మీ కాపురం సంతోషంగా ఉండాలనే అలాంటి విషయాలు చెబుతున్నారా? లేదా అనే విషయాలను ఆలోచించండి. ఆమె మీతో మరింత దగ్గరవ్వడానికి అలా చేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

బాధపడొద్దు..

బాధపడొద్దు..

మీ అత్తగారితో మాట్లాడేటప్పుడు తను చెప్పే మాటలకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కొంత ఒత్తిడిని తట్టుకుంటే చాలు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు కొన్ని విషయాల్లో మీరు రాజీ అవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ సమస్యలకు పరిష్కారం లభించొచ్చు.

English summary

Ways To Deal With Difficult Mother in Law in Telugu

Here are the ways to deal with difficult mother in law in Telugu. Take a look