Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పొసెసివ్ వైఫ్‌తో వేగలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
బంధంలో ఒక భాగస్వామి పొసెసివ్‌నెస్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. స్వేచ్ఛగా గడపలేరు, నచ్చిన రీతిలో బతకలేరు. పొసెసివ్‌నెస్ ఉన్న భాగస్వామితో మీరు వేగలేకపోతుంటే కొన్ని చిట్కాలతో వారితో ఆనందంగా గడపవచ్చు ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు
సంబంధంలో ఉన్నప్పుడు కొంతమంది తమ జీవిత భాగస్వామిపై విపరీతమైన ప్రేమను, ఇష్టాన్ని చూపిస్తారు. ప్రేమ చూపించడాన్ని ఏ పార్ట్‌నర్ అయినా ఇష్టపడతారు. సంబంధంలో ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకపోతే ఆ బంధం ఎక్కువకాలం నిలవదు. భాగస్వాముల మధ్య బాండింగ్ ఏర్పడదు. అయితే ఏదైనా ఒక పరిమితికి లోబడి ఉండాలి. అది మించితే ఇద్దరికీ సమస్యలే. విపరీతమైన ప్రేమ అసూయకు, పొసెసివ్‌నెస్‌కు దారి తీస్తుంది. దీని వల్ల తమ భాగస్వామి ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగినా, చూసినా, నవ్వినా, మాట్లాడినా తట్టుకోలేరు. ఆ పార్ట్‌నర్ కేవలం తమతోనే మాట్లాడాలని, తమతోనే ఉండాలని, వేరేవారితో మాట్లాడవద్దని అనుకుంటారు. దీనినే పొసెసివ్‌నెస్ అంటారు.

బంధంలో ఒక భాగస్వామి పొసెసివ్‌నెస్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. స్వేచ్ఛగా గడపలేరు, నచ్చిన రీతిలో బతకలేరు. పొసెసివ్‌నెస్ ఉన్న భాగస్వామితో మీరు వేగలేకపోతుంటే కొన్ని చిట్కాలతో వారితో ఆనందంగా గడపవచ్చు ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- ప్రతి బంధానికి కమ్యూనికేషన్ కీలకం. భాగస్వామి యొక్క అసూయ, పొసెసివ్‌నెస్ మీ సంబంధాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించినట్లయితే దాని వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి చెప్పండి. సరైన పదాలు, మంచి మాట తీరుతో స్పష్టంగా చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
- భాగస్వామి పట్ల మరింత ఆప్యాయంగా ఉండండి. వారికి ఎప్పుడూ తోడు ఉంటామని, అండగా ఉంటామని చెప్పినట్లవుతుంది.
- వారి సమస్యలను పరిష్కరించండి. మీ భాగస్వామి చేసే పనుల వల్ల బాధపడుతుంటే గొడవకు దిగవద్దు. ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ తప్పు అంగీకరించి క్షమాపణ అడగండి.
- సరిహద్దులను నిర్ణయించడంలో తప్పు లేదు. మీకు అసౌకర్యం కలిగించే విషయాల గురించి మీ భాగస్వామికి చెప్పండి. అసూయ పడటం, పొసెసివ్‌నెస్ వల్ల మీరెంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి.
- ఏదైన సమస్యతో మీ భాగస్వామి మీ దగ్గరికి వస్తే ఆ సమస్య ఏమిటో సావధానంగా వినాలి. సమస్య ఎక్కడ ఉందో, ఏమిటే కచ్చితంగా తెలుసుకోవాలి. దాని కారణాలు విశ్లేషించి పరిష్కరించడానికి ప్రయత్నించాలి. దాని వల్ల మీ బంధం బలోపేతం అవుతుంది. వారికి మీపై నమ్మకం పెరుగుతుంది.
- ఓపికగా ఉండాలని గుర్తుంచుకోండి. సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయమైపోవు. కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. అందుకోసం ఓపికగా వేచి చూడటమే మనం చేయాల్సింది.
- అతిగా ప్రవర్తించవద్దు. భాగస్వామిని వేధించవద్దు. మీ భాగస్వామి ప్రతిసారీ ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు అది మీకెంతో బాధ కలిగిస్తుందో నోటి మాటల ద్వారా నెమ్మదిగా చెప్పండి.



Click it and Unblock the Notifications