For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...

మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధం పెంచుకోడానికి గల మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది అమ్మాయిలు టీనేజీ నుండే తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తమకు కాబోయే కలల రాకుమారుడు ఎలా ఉంటాడో.. తమను పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందంగా చూసుకుంటాడని భావిస్తారు. కానీ అందరి జీవితంలో అది సాధ్యం కాదు..

Ways To Feel Emotionally Connected To Your Partner

కేవలం కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. కాలక్రమేణా వచ్చే మార్పులతో పాటు.. భాగస్వామిలో నచ్చని విషయాలను అంత సులభంగా అంగీకరించలేకపోతున్నారు.

Ways To Feel Emotionally Connected To Your Partner

దీంతో చాలా విషయాల్లో చీటికి మాటికీ గొడవ పడటం.. చిన్న విషయాలకే అపార్థం చేసుకుంటున్నారు. ఇలా చేయడానికి బదులుగా మీ భర్తను ఆకర్షించడం.. ప్రతిరోజూ కొంచెం కొత్తగా కనిపించడం.. మీ మాటలతో వారిని మాయ చేయడం వంటివి చేయాలి.

Ways To Feel Emotionally Connected To Your Partner

అయితే వారు మిమ్మల్ని నిత్యం అంటి పెట్టుకుని ఉండాలంటే.. ఇవొక్కటే చేస్తే సరిపోదు.. అందుకోసం కొన్ని పద్ధతులున్నాయి.. అవి ఫాలో అయితే మీరు కోరుకున్న విధంగా మీ భాగస్వామి మీ మాయలో పడిపోతారు.. ఇంకెందుకు ఆలస్యం.. ఆ విషయాలేంటో చూసెద్దాం పదండి...

రొమాన్స్ లో రతి మన్మథుల్లా రెచ్చిపోయేలా చేసే విషయాలివే...!రొమాన్స్ లో రతి మన్మథుల్లా రెచ్చిపోయేలా చేసే విషయాలివే...!

మీ చుట్టూ తిరగాలంటే..

మీ చుట్టూ తిరగాలంటే..

మీ భర్త మీపై మనసు పడాలన్నా.. మీ మాయలోనే మునిగి తేలాలంటే.. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. అందుకోసం మీరు సమ్మోహితులు కావాలి. ఇందుకోసం కలర్ ఫుల్ డ్రస్, జ్యువెలరీ, మేకప్ ఒక్కటే సరిపోదు.. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమే. మీరు శాశ్వతమైన మానసిక అందంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

పూర్తిగా తెలుసుకోవడం..

పూర్తిగా తెలుసుకోవడం..

అన్నింటికంటే ముందుగా మీలో మీకు నచ్చే విషయాలేంటి.. మీరు బాగా ఇష్టపడేవి.. మీరు బాగా అనగర్గళంగా మాట్లాడతారా? మీరు అతి జాగ్రత్తపరులా? అనే విషయాలనే మీరే డిసైడ్ చేసుకోవాలి. మీ భర్త ప్రవర్తనను బట్టి.. మీలో ఏదైనా స్వభావాన్ని మార్చుకోవాలా లేదా అనే విషయాల గురించి ఆలోచించాలి.

మీరు ప్రేమిస్తుంటే..

మీరు ప్రేమిస్తుంటే..

మీరు మీ భర్తను నిజాయితీగా ప్రేమిస్తుంటే.. మీ భాగస్వామి మీ నుండి ఏమి కోరుకుంటున్నారు.. మీరు వారి కోరికలను నెరవేర్చగలరా అనే విషయాలను తెలుసుకోవాలి. దీని కోసం మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. కాబట్టి తాత్కాలికమైన అంశాలపై కాకుండా.. మీలో ఉండే లోపాలను కనిపెట్టి.. వాటికి చెక్ పెట్టి మీ భాగస్వామి మీ మాయలో పడేలా చేయండి. అప్పుడు మీ ఆత్మవిశ్వాసం కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

రాజీ పడటం..

రాజీ పడటం..

సాధారణంగా దాంపత్య జీవితం అంటేనే కొన్ని విషయాలు సమస్యలు రావడం అనేది సహజం. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో రాజీ పడటం మరియు సర్దుకుపోవడం అనేది సర్వసాధారణమని గుర్తుంచుకోండి. ఇప్పటికే మీ అలవాట్లు, అభిరుచులు మార్చుకుంటే.. మీ బంధం మరింత బలంగా మారే అవకాశం కచ్చితంగా ఉంటుంది.

‘అతి త్వరలో నా పెళ్లి.. కానీ ప్రియురాలితో ఇంకా టచ్ లోనే... నేను చేస్తోంది కరెక్టేనా..'‘అతి త్వరలో నా పెళ్లి.. కానీ ప్రియురాలితో ఇంకా టచ్ లోనే... నేను చేస్తోంది కరెక్టేనా..'

మీ చూపులు..

మీ చూపులు..

చాలా మంది అబ్బాయిలు మహిళల చూపులను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అందుకే అమ్మాయిలు కూడా తమ గురించి మగవారు ఏమనుకుంటున్నారో అని తెగ ఆలోచిస్తారు. దాని ప్రకారమే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కొందరు మీ చూపులు, ప్రవర్తనను బట్టే మీ క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తారు.

స్నేహంగా ఉండండి..

స్నేహంగా ఉండండి..

మీరు వివాహ జీవితంలో సక్సెస్ కావాలంటే.. మీరు మీ భాగస్వామితో ముందుగా మానసికంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరిద్దరూ మంచి స్నేహితుల్లా మారిపోతారు. ఇలాంటి బంధం జీవితాంతం బలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

లైంగిక జీవితం..

లైంగిక జీవితం..

మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాన్ని పెంచడంలో లైంగిక చర్య కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషికి ఆకలి, నిద్ర ఎంత అవసరమో.. సెక్స్ అనేది కూడా అంతే అవసరం. కాబట్టి మీరు మీ భాగస్వామితో వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లయినా ఆ కార్యంలో పాల్గొనండి. దీని వల్ల మీ ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

శారీరక ఆకర్షణ..

శారీరక ఆకర్షణ..

ఒకవేళ మీ భాగస్వామికి రొమాన్స్ చేసేందుకు మూడ్ లేకపోతే.. మీరు మీ శ్రీవారి ఎదుట ఎక్స్ పోజింగ్ ప్రదర్శించొచ్చు. ఎందుకంటే ఎంతటి మగాడైనా ఎక్స్ పోజింగ్ చేస్తే కచ్చితంగా పడిపోతాడు. ఎందుకంటే ఎక్కువ మంది మగాళ్లు శారీరక ఆకర్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వారు మీ చుట్టూనే తిరుగుతారు.

English summary

Ways To Feel Emotionally Connected To Your Partner

Here is how to feel emotionally connected to your partner
Story first published:Thursday, March 25, 2021, 14:04 [IST]
Desktop Bottom Promotion