For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శ్రీవారు మీరు చెప్పిన మాట వినాలంటే....!

మీ భర్త మీ మాట వినాలంటే చేయాల్సిన పనులేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

ఒకప్పుడు ఆలుమగల అనుబంధం అంటే.. భర్త మాటే భార్య వేదవాక్కుగా భావించేవారు. అయితే కాలక్రమేణా చాలా మార్పులొచ్చాయి.

Ways To Get Your Husband To Listen To You

పరిస్థితులు కూడా మారిపోయాయి. కాబట్టి ఈ కాలంలోనూ ప్రతిసారీ భార్య భర్త మాట వినే పరిస్థితులు తగ్గిపోయాయి. చాలా సందర్భాల్లో భార్య మాటనే భర్త వినాల్సి వస్తోంది.

Ways To Get Your Husband To Listen To You

అయితే కొందరు భార్యలు తమ భాగస్వామి ఎల్లప్పుడూ తమ మాట వినాలని కోరుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన విధంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తుంటే.. కొన్ని చిట్కాలను ఫాలో అవ్వండి... కచ్చితమైన ఫలితాన్ని పొందండి...

మూడు పదుల వయసులోనే 'ఆ'విషయాల గురించి అర్థమవుతుందా?మూడు పదుల వయసులోనే 'ఆ'విషయాల గురించి అర్థమవుతుందా?

నచ్చింది చేస్తే..

నచ్చింది చేస్తే..

భార్యభర్తల మధ్య ఉండే సంబంధం చాలా అన్యోన్యమైనది. వీరి మధ్య సాన్నహిత్యం ఉంటే చాలు ఆ బంధం బలంగా మారిపోతుంది. ఆ బంధం జన్మజన్మలు హాయిగా ఉండిపోతుంది. ఇక అసలు విషయానికొస్తే.. భర్త మీ మాట వినాలంటే.. మీరు సమయం.. సందర్భం లేకుండా మీకు నచ్చిన పని చేయకూడదు. అలా చేస్తే మీ భాగస్వామికి కోపం వస్తుంది. అప్పుడు వాళ్లు మీపై ద్వేషం పెంచుకుంటారు. మీ మాటను కూడా పట్టించుకోరు. ఉదాహరణకు మీ భర్త బయటి నుండి రాగానే లేదా ఏదైనా బిజీ పనిలో ఉన్నప్పుడు తనకు అనవసరమైన విషయాలను గుర్తు చేయకండి. ముందుగా వారు ఫ్రీ అయ్యారా లేదా చూడండి. వారి కండిషన్ ను ఒకసారి గమనించండి. అనువైన సమయం చూసి వారితో మంచిగా మాట్లాడండి.

నెమ్మదిగా మాట్లాడుతూ..

నెమ్మదిగా మాట్లాడుతూ..

కొందరు మహిళలు ఇలాంటివేవీ పాటించకుండా వారికి నచ్చినట్టు వాగుడుకాయ మాదిరిగా మట్లాడుతూనే ఉంటారు. దీంతో మీ భాగస్వామికి బయట ఒత్తిడి ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు. కాబట్టి మీరు మంచి సమయం చూసుకుని.. వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు.. అనుకూలమైన సమయం చూసుకుని వారితో నెమ్మదిగా మాట్లాడండి.. అప్పుడు మీ భర్త మీరు చెప్పిన వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఇలా చేయొద్దు..

ఇలా చేయొద్దు..

కొందరు భార్యలు తమ వైవాహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా తమ భర్త ఏదైనా విషయం గురించి ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాన్ని ఆలోచించకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా తమ భర్త గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ముక్కుసూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లో ఇలా చేయడం సరైనది కాదు. మీరు వారితో ఏదో చెప్పాలని ప్రయత్నించి.. ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తే.. వారికి ఏ మాత్రం పరిస్థితి అర్థమవ్వదు. కాబట్టి ముందు మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడే ముందు వాటికి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుని మాట్లాడాలి.

<strong>వివాహ జంటలు విడిపోకుండా ఉండాలంటే...!</strong></p><p>వివాహ జంటలు విడిపోకుండా ఉండాలంటే...!

ఇవి చూసుకోండి..

ఇవి చూసుకోండి..

మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని కచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి. మీరు ఏదైనా విషయం గురించి మీ భర్తకు చెప్పాలనుకుంటే.. ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి. అందుకు తగ్గట్టు మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలు.. మీ భర్త మీ వద్ద కూర్చుకుని నెమ్మదిగా, ప్రశాంతంగా మాట్లాడుతూ మీ మాటను తప్పకుండా ఉంటారు. అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా, ఆందోళనకరంగా చెబితే.. దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పండి.

స్పష్టంగా వినండి..

స్పష్టంగా వినండి..

మీ భర్త మీ మాట వినాలంటే.. ఎల్లప్పుడూ మీరు చెప్పే విషయాలనే కాకుండా.. మీరు కూడా వారు చెప్పే విషయాలను స్పష్టంగా వినాలి. ఇలాంటి విషయాల్లో స్వార్థంతో ఉండకూడదు. ముందు మీ భర్త ఏం చెబుతున్నారో వినండి.

ప్రతిసారీ మీ మాటే..

ప్రతిసారీ మీ మాటే..

భార్యభర్తల సంబంధంలో ప్రతిసారీ మీదే పైచేయి కావాలంటే కాస్త కష్టమే. కాబట్టి వారు ఏదైనా విషయం గురించి చెబుతుంటే.. పూర్తిగా వినండి.. కావాలంటే అందుకు మీరు తిరిగి రిప్లై ఇవ్వండి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మీ భర్తతో మాట్లాడి మీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీ భర్త మీ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తారు. మీరు చెప్పిందల్లా చేసేస్తారు. దీని వల్ల మీరిద్దరూ కూడా ఎంతో ఆనందంగా, హాయిగా జీవించడానికి అవకాశం లభిస్తుంది.

English summary

Ways To Get Your Husband To Listen To You

Here are the ways to get your husband to listen to you. Have a look
Story first published:Friday, September 10, 2021, 17:31 [IST]
Desktop Bottom Promotion