Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
అలా చేస్తేనే శృంగారంలో అసలైన మజా వస్తుందట...!
మీ రిలేషన్ షిప్ లో సాన్నిహిత్యం పెరగాలంటే మీరు బాగా గొడవపడి.. ఆ తర్వాత ఆ కార్యంలో పాల్గొనాలంట..
కొత్తగా పెళ్లి చేసుకున్న వారు.. ప్రేమలో లోతుగా మునిగి ఉన్న వారు రొమాన్స్ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కొత్తలో శృంగార పరంగా కలవాలని.. దీని వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రతి ఒక్కరికీ కొత్తగా ఏర్పడే బంధంలో అంతా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి క్షణాలను ఎంతో ఆనందిస్తారు. అయితే ఇలాంటి ఆనందం కొన్నిరోజుల తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కొందరేమో తమ భాగస్వామి మీద కొంచెం ప్రేమ తగ్గితే చాలు.. ఆ కార్యాన్ని తూతూమంత్రంగా చేస్తారు.. పెళ్లి అయిన వారిలో కొందరు కొంత కాలం తర్వాత శృంగారం అంటేనే అస్సలు ఆసక్తి చూపరు.

ఇంకొందరు శృంగారంలో పాల్గొన్నామా లేదా అన్నట్టుగా ప్రవర్తిస్తారు.. తమ జీవిత భాగస్వామికి కనీసం సమయం కూడా కేటాయించరు. ప్రతిరోజూ అదే ఫేసే.. అవే మాటలే కదా అని లైట్ తీసుకుంటారు. అయితే ఇలాగే మీ బంధం కొనసాగితే.. మీ ఇద్దరి మధ్య కచ్చితంగా దూరం పెరగడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా కాకుండా మీరు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించాలంటే మీరు అప్పుడప్పుడు గొడవ పడాలంట... అదేంటి భార్యభర్తల మధ్య పోట్లాడుకోమని చెబుతున్నారనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చూడండి... అసలు విషయం మీకే తెలుస్తుంది. ఇంకెందుకు భార్యభర్తలు ఎందుకు గొడవపడాలో ఇప్పుడే చూసేయండి మరి...

తొలిరోజుల్లో అత్యుత్సాహం..
శృంగారం విషయంలో చాలా మంది తొలిరోజుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అయితే కొంతకాలం తర్వాత వారు దాని గురించి ఆలోచించడమే మానేస్తారు. మరికొందరైతే ఆ కార్యాన్ని నామమాత్రం నిర్వహిస్తారు.

కొన్ని మార్పులు చేసుకుంటే..
ఇలా మీ జీవితంలో జరగకుండా ఉండాలంటే.. మీరు శృంగారాన్ని బాగా ఆస్వాదించాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడు మీకు శృంగారం అంటే బోర్ కొట్టకుండా, దానిపై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒక్కసారైనా అలా..
ఎవరైనా సరే జంటలు ఒక్కసారైనా తమ జీవితంలో అలా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు. ఆలుమగలు అన్నాక కచ్చితంగా ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు జరగడం అనేది అత్యంత సహజం. కానీ కొన్నిసార్లు అవే చిలికి చిలికి గాలివానలా మారతాయి. అలాంటి సమయంలో చాలా మంది తమ భాగస్వామితో కొంతకాలం మాటల్లేకుండా.. అసలు తామిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు.

వెంటనే శృంగారంలో..
అయితే అలా చేయడం వల్ల మీ దాంపత్య జీవితానికి ఎలాంటి ప్రయోజనం ఉండదట. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందో.. అప్పుడే యాంగ్రీ సెక్సులో పాల్గొనాలని, అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం కంటే.. గొడవ తర్వాత శృంగారంలో ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు సలహాలిస్తున్నారు.

ఉదయాన్నే..
చాలా మంది జంటలు సాధారణంగా శృంగారం అంటే కేవలం రాత్రి సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే రాత్రి సమయంలో కన్నా.. ఉదయాన్నే శృంగారంలో పాల్గొంటే చాలా ఉత్సాహంగా ఉంటుందట. దీని వల్ల ఒత్తిడి, టెన్షన్లు కూడా తగ్గిపోతాయట. ఆరోజు మొత్తం చాలా ఉల్లాసంగా గడుపుతారు.

అలా చేయాలని కోరిక..
చాలా మంది జంటలకు రాత్రంతా శృంగారంలో పాల్గొని తెల్లారేవరకు చేయాలని కోరికగా ఉంటుంది. అయితే ఇది ఎవ్వరికీ ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా అలా ఒకసారి ప్రయత్నించమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది శృంగారం అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు.

కొంచెం స్పీడుగా..
కొంతమంది పని ఒత్తిడి కారణంగా.. శృంగారం అనే విషయంపై అస్సలు ఆసక్తి చూపరు. అయితే ఇలాంటి సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కొంచెం స్పీడుగా శృంగారంలో పాల్గొన్నా కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. అయితే ఎప్పుడు కాకుండా.. అప్పుడప్పుడు అలా చేసినా బాగుంటుందని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
